Homeఆంధ్రప్రదేశ్‌వైసీపీ లక్ష లేఖల ప్రణాళిక: చివరి నిమిషంలో లీక్?

వైసీపీ లక్ష లేఖల ప్రణాళిక: చివరి నిమిషంలో లీక్?

Raghu rama rajuవైసీపీలో లేఖల కలకలం రేగుతోంది. వైసీపీ వర్సెస్ వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణం రాజు వ్యవహారంలో లేఖలు ప్రముఖ పాత్ర పోషిస్తున్నాయి. రఘురామపై అనర్హత వేటు వేయాలని వైసీపీ కోరుతోంది. మరోవైపు వైసీపీ లేఖలను పట్టించుకోవద్దని రఘురామ ఇరువురు తమ వాణిని వినిపించేందుకు పాట్లు పడుతున్నారు. ఈ నేపథ్యంలో మొత్తం వ్యవహారమే మారిపోతోంది. దీనిపై రఘురామ ఎందుకు భయపడుతున్నారనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.

వైసీపీ రెబల్ ఎంపీ రఘురామ కృష్ణంరాజుపై అనర్హత వేటు వేయించాలని వైసీపీ తెగ ప్రయత్నాలు చేస్తోంది. దీనికి ఆయన కూడా అంతేస్థాయిలో పోరాటం కొనసాగిస్తున్నాడు. కానీ వేటు మాత్రం పడడం లేదు. దీంతో వారిలో ఆగ్రహం వస్తోంది. ఎన్నిసార్లు లేఖలు రాసినా ఫలితం ఉండటం లేదని చెబుతున్నారు. తాజాగా వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి రఘురామ వ్యవహారంపై చర్యలు తీసుకోవాలని కోరుతూ స్పీకర్ ఓం బిర్లాకు లేఖ రాశారు. అయినా స్పందన లేదు.

రఘురామ వ్యవహారంలో ఎన్ని లేఖలు రాసినా ఫలితం లేకపోవడంతో వైసీపీ రూటు మార్చింది. రఘురామ పై అనర్హత వేటు వేసే విధంగా లక్ష లేఖలు రాయాలని భావించింది. కానీ ఈ విషయం బయటకు తెలియడంతో ప్రభుత్వం ఆ ప్రయత్నాన్ని విరమించుకుంది. అయితే రఘురామ కూడా ఆ లేఖలను పరిగణనలోకి తీసుకోవద్దని స్పీకర్ కు లేఖ రాసినట్లు తెలుస్తోంది. దీంతో వైసీపీ, రఘురామ వ్యవహారం కాస్త ముదురు పాకంలో పడినట్లయింది.

మొత్తానికి వైసీపీలో లేఖల కలకలం దడ పుట్టిస్తోంది. ఇరు వర్గాలను భయపెడుతోంది. ఒకరిపై మరొకరు బురద జల్లుకునేందుకేు ప్రాధాన్యం ఇస్తున్నట్లు తెలుస్తోంది. వైసీపీ లేఖల విషయాన్ని ప్రస్తావించిన రఘురామ తనపై అనర్హత వేటు వేయించేందుకు కుట్రలు పన్నుతున్నారని ఆరోపించారు. ఈ వ్యవహారం ఎందాకా వెళుతుందోనని పలువురు పార్టీ నేతలే తలలు పట్టుకుంటున్నారు.

Sekhar
Sekhar
Sekhar is an Manager, He is Working from Past 6 Years in this Organization, He Covers News on Telugu Cinema Updates and Looks after the overall Content Management.
Exit mobile version