Yashaswini Reddy : ఆమె వయసు 26 సంవత్సరాలు. ఎక్కడో ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో పుట్టింది. రేవంత్ రెడ్డి స్వగ్రామమే ఈ అమ్మాయి సొంత ఊరు కూడా. ఆమె వయసు 26 సంవత్సరాలు. ఆర్థిక నేపథ్యం కూడా అంతంత మాత్రమే. అక్కడివాళ్లు ఈమెది చాలా పేద కుటుంబం అని చెప్తారు. కానీ ఎప్పుడైతే అనుమాండ్ల ఝాన్సీ రెడ్డి ఇంటి కోడలు అయిందో అప్పుడే ఆమె లైఫ్ టర్న్ అయింది. ఓటమి ఎరుగని ఒక నాయకుడిని ఓడించింది. స్థానిక మీడియాలోనే కాదు జాతీయ మీడియాలోనూ వ్యక్తి అయింది.
పేద కుటుంబం
ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా కొండారెడ్డిపల్లి అనే గ్రామం ఇప్పుడు రెండు విధాలుగా చరిత్రకెక్కింది. ఒకటి ఈ గ్రామం లో పుట్టిన రేవంత్ రెడ్డి పిసిసి అధ్యక్షుడు అయ్యారు. కొడంగల్ ఎమ్మెల్యేగా గెలిచి రాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. ఇక ఇదే గ్రామంలో పుట్టిన యశస్విని రెడ్డి అనే అమ్మాయి పాలకుర్తి నియోజకవర్గం లో మకుటం లేని మహారాజుగా వెలుగొందుతున్న ఎర్రబెల్లి దయాకర్ రావును ఓడించి రికార్డు సృష్టించింది. ఎటువంటి ఆర్థిక నేపథ్యం లేకున్నా.. తన ప్రశ్నించే స్వభావంతో ఓటర్లలో చైతన్యం తీసుకువచ్చింది. ప్రభుత్వ వ్యతిరేక విధానాలను ప్రజలకు అర్థమయ్యేలా చెప్పగలిగింది. అంతేకాదు తన స్పష్టమైన తెలంగాణ యాసతో పాలకుర్తి ప్రజలకు దగ్గర అయింది. అదే ఎర్రబెల్లి దయాకర్ రావును ఓడించేలా చేసింది. అంతటి తెలంగాణ ఉద్యమం జరుగుతున్నప్పుడు కూడా ఎర్రబెల్లి దయాకర్ రావు ఓడిపోలేదు. 2014లో తెలంగాణ రాష్ట్రం ఏర్పడినప్పటికీ కూడా ఆయన టిడిపి నుంచి పోటీ చేసి గెలుపొందారు. తెలంగాణ ఉద్యమం జరుగుతున్నప్పుడు వచ్చిన ఉప ఎన్నికల్లోనూ ఎర్రబెల్లి దయాకర్ రావు గెలిచారు. అంతటి కాకలు తీరిన ఎర్రబెల్లి దయాకర్ రావును యశస్విని రెడ్డి ఓడించిందంటే మామూలు విషయం కాదు. ఎర్రబెల్లి దయాకర్ రావు రాజకీయ అనుభవం 30 సంవత్సరాలు. అంటే ఆయన రాజకీయ అనుభవంతో పోలిస్తే కూడా నాలుగేళ్లు చిన్నది. అయినప్పటికీ యశస్విని రెడ్డి దయాకర్ రావును కూడా ఇచ్చింది. వాస్తవానికి యశస్విని రెడ్డి రాజకీయ నాటకీయ పరిణామాల మధ్య జరిగింది. యశస్విని రెడ్డి అత్త హనుమండ్ల ఝాన్సీ రెడ్డి పాలకుర్తి నియోజకవర్గం లో గత కొన్ని సంవత్సరాలుగా ధార్మిక కార్యక్రమాలు చేపడుతున్నారు. ఝాన్సీ రెడ్డి అమెరికాలో స్థిరాస్తి వ్యాపారం చేస్తూ ఉంటారు. ఆమెకు ఇద్దరు కొడుకులు. రెండవ కోడలే యశస్విని రెడ్డి.. అయితే ఆమెకు కాంగ్రెస్ టికెట్ ఖరారు కావడం.. అమెరికాకు సంబంధించిన పౌరసత్వ సమస్య తలెత్తడంతో ఆణివార్యంగా తన కోడలు యశస్విని రెడ్డిని ఝాన్సీ రెడ్డి తెరపైకి తీసుకొచ్చారు..
జై కేసీఆర్ అన్నారు
ఎప్పుడైతే యశస్వినిరెడ్డి తెరపైకి వచ్చారో.. కాంగ్రెస్ కేడర్ లో కూడా కొంత అనుమానం ఉన్నది. ఈ 26 సంవత్సరాల అమ్మాయి ఎర్రబెల్లి దయాకర్ రావు ఓడించగలుగుతుందా అని అందరూ అనుకున్నారు. ఎన్నికల ప్రచారంలో జై కాంగ్రెస్ అనబోయి జై కేసీఆర్ యశస్విని రెడ్డి అనడంతో కాంగ్రెస్ నాయకులు నోరేళ్లపెట్టారు. ఈమె ఎర్రబెల్లి దయాకర్ రావు తో పోటీపడి గెలుస్తుందా అని అందరూ అంటున్నారు. కానీ వారందరి అంచనాలు పటా పంచలు చేస్తూ దయాకర్ రావు మీద గెలిచింది. చివరికి రేపు పోలింగ్ జరుగుతుందనగా దయాకర్ రావు ఆదేశాల మేరకు పోలీసులు యశస్విని రెడ్డి ఇంటి మీదకి వెళ్లారు. వారిని ఇబ్బంది పెట్టాలని చూసారు. కానీ ఇన్ని పరిణామాలు గమనిస్తున్న పాలకుర్తి ప్రజలు దయాకర్ రావుకు తమ ఓటు ద్వారా బుద్ధి చెప్పారు. చివరికి 26 సంవత్సరాలు అమ్మాయిని తన ప్రాంత ఎమ్మెల్యేగా ఎన్నుకున్నారు. ప్రజాస్వామ్య స్ఫూర్తిని ప్రదర్శించారు. ఎక్కడో మహబూబ్ నగర్ జిల్లాలో రేవంత్ రెడ్డి స్వగ్రామంలో జన్మించిన ఒక మామూలు పేదింటి అమ్మాయి ఈ రోజున అసెంబ్లీకి వెళ్తోంది. దయాకర్ రావు లాంటి సీనియర్ నాయకుడిని ఓడించింది. ప్రజాస్వామ్యంలో బ్యూటీ అంటే ఇదే కావచ్చు.