Bigg Boss Telugu 7: బిగ్ బాస్ వీకెండ్ ఎపిసోడ్ కావడంతో నాగార్జున తో పాటు స్పెషల్ గెస్ట్ లు సందడి చేశారు. సినిమా ప్రమోషన్స్ లో భాగంగా స్టార్స్ బిగ్ బాస్ స్టేజి పై మెరిశారు. ఆదివారం ఎపిసోడ్లో నానితో పాటు హీరోయిన్ ఆషిక రంగనాథ్ ఎంట్రీ ఇచ్చారు. ఆమె తన కొత్త మూవీ ”నా సామి రంగ ” ప్రమోట్ చేయడం కోసం వచ్చారు.
ముందుగా నాగార్జున ఆమెను స్టేజి పైకి ఆహ్వానించారు. తర్వాత కంటెస్టెంట్స్ ని పరిచయం చేశారు. అమర్ హీరోయిన్ కి ఎన్ని మార్కులు ఇస్తావ్ అని నాగార్జున అన్నారు. 100 కి 1000 సార్ అని అమర్ దీవ్ చెప్పడంతో .. ఆషిక రంగనాథ్ ఫ్లయింగ్ కిస్ ఇచ్చింది. అమర్ టక్కున పట్టుకుని జేబులో పెట్టుకున్నాడు. తర్వాత అర్జున్ నిల్చోబెట్టి ఎన్ని మార్కులు ఇస్తావ్ అని అడిగారు నాగ్. 100 అవుట్ ఆఫ్ 100 ఇస్తాను సార్ అని అర్జున్ చెప్పాడు.
చూడటానికి మంచిగా తెలుగమ్మాయిలా ఉన్నారు అని అర్జున్ పొగిడాడు. ఇక శోభా తో కన్నడలో మాటలు కలిపింది ఆషిక రంగనాథ్. తర్వాత ‘ ప్రశాంత్ లో మంచి కవి దాగున్నాడు అంటూ ప్రశాంత్ ని ఇరికించాడు నాగార్జున. ప్రశాంత్ ఒక కవిత చెప్పు అని అడిగారు. దీంతో ప్రశాంత్ తెగ సిగ్గు పడిపోయాడు. ‘చీకట్లో వచ్చే జాబిలిలా .. పొద్దునే వచ్చే చందమామలా ‘ అనగానే .. పొద్దునే వచ్చే చందమామనా… అని నాగార్జున గాలి తీసేశారు.
దీంతో ప్రశాంత్ .. మేడం ని చూడగానే మైండ్ బ్లాక్ అయిపోయింది సార్ అని చెప్పాడు. తర్వాత నాగార్జున .. తనని ఇమిటేట్ చెయ్యాలని చెప్పాడు. ఎవరు బాగా ఇమిటేట్ చేసారో ఆషిక మీకు చెప్తుంది అన్నారు. దీంతో అర్జున్, ప్రియాంక .. నాగార్జున ని ఇమిటేట్ చేశారు. అర్జున్ బాగా చేశాడు అని ఆషిక రంగనాథ్ చెప్పారు. నాగార్జున గారితో వర్క్ చేయడం చాలా సంతోషంగా ఉందని ఆషిక రంగనాథ్ చెప్పారు.