Telangana: తెలంగాణలో రాజకీయ పరిణామాలు మారుతున్నాయి. బీజేపీ, టీఆర్ఎస్ మధ్య పోటీ వాతావరణం పెరుగుతోంది. దీనికి గాను అన్ని మార్గాల్లో కూా ఇరు పార్టీలు ఆధిపత్యం కొనసాగించాలని భావిస్తున్నాయి. ప్రస్తుతం బీజేపీ, టీఆర్ఎస్ యాగాలు చేయడానికి ముందుకు వస్తున్నాయి. దీంతో రాష్ర్టంలో హోమాలు, యాగాలు చేసేందుకు కార్యాచరణ ప్రణాళికలు రూపొందించుకుంటున్నాయి. రాజకీయంగా ఎదిగేందుకు ఈ మార్గాన్ని ఎంచుకున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే బీజేపీ రాష్ర్టంలో దూసుకుపోతుండటంతో దాన్ని ఎలాగైనా కట్టడి చేయాలని భావిస్తోంది. దీనికి గాను ఆధ్యాత్మిక మార్గాన్ని అవలంభించేందుకు సిద్ధమైనట్లు సమాచారం.

రాష్ర్టంలో బీజేపీ బలం క్రమంగా పెరుగుతోంది. అధికార పార్టీ టీఆర్ఎస్ పై వ్యతిరేకత కూడా అలాగే ఎక్కువవుతోంది. అందుకే బీజేపీని ఎదర్కొనేందుకు టీఆర్ఎస్ పావులు కదుపుతోంది. ఇందులో భాగంగా యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో యాగం చేయాలని భావించింది. దీని కోసం అన్ని ఏర్పాట్లు చేస్తోంది. సీఎం కేసీఆర్ ఆధ్యాత్మిక వేత్త చిన్న జీయర్ స్వామిని కలిచి చర్చలు జరిపారు. యాగం నిర్వహించే కార్యాచరణ ప్రణాళికపై మాట్లాడారు.
యాదాద్రి ప్రారంభోత్సవం సందర్భంగా మార్చిలో సుదర్శన యాగం నిర్వహించాలని సంకల్పించారు. దీనికి టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కూడా చేతులు కలిపేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. ఇందుకు వర్ధన్నపేట ఎమ్మెల్యే ఆరూరి రమేష్, స్టేషన్ ఘన్ పూర్ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్యలు చండీయాగాలు నిర్వహించారు. దీంతో టీఆర్ఎస్ నేతల్లో కలిగిన భక్తిభావంపై అందరిలో ఆశ్చర్యం వ్యక్తమవుతోంది.
Also Read: తెలంగాణలో కరోనా మరణాలపై రహస్యమిదీ?
ఈ నేపథ్యంలో బీజేపీ హిందూత్వ నినాదంతో ఓట్లు రాబట్టుకుంటోందని భావించిన టీఆర్ఎస్ తన పంథా మార్చుకున్నట్లు రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. దీంతో వారి రూట్లోనే వెళ్లి బీజేపీని దెబ్బతీయాలని చూస్తోంది. దీని కోసమే యాగాల నిర్వహణకు నడుం బిగించినట్లు తెలుస్తోంది. మరోవైపు బీజేపీ కూడా మృత్యుంజయ హోమాలు నిర్వహించాలని భావిస్తోంది. దీని కోసం ఏర్పాట్లు చేస్తోంది.
పంజాబ్ లో పీఎం కాన్వాయ్ ని రైతులు అడ్డుకున్న సందర్భంలో ఆయనకు మంచి జరగాలని కోరుతూ ఈ యాగాలు చేసేందుకు నిర్ణయించినట్లు సమాచారం. మొత్తానికి రాష్ర్టంలో యాగాల నిర్వహణకు రెండు పార్టీలు సంకల్పించడంతో ఆధ్యాత్మికత వెల్లివిరియనుంది. తెలంగాణలో భక్తి పారవంశ్యంతో రెండు పార్టీలు యాగాలు నిర్వహించడంతో భక్తి భావం పెరగనున్నట్లు తెలుస్తోంది.
Also Read: తెలంగాణపై బీజేపీ జాతీయ నాయకుల దండయాత్రకు అసలు కారణం అదే?
[…] […]