Fisheries Subsidies: మత్సకారులనో ప్రోత్సహించేందుకు భారత దేశంతోపాటు ప్రపంచంలోని చాలా దేశాలు సబ్సిడీలు ఇస్తుంటాయి. ప్రభుత్వాలు ఇచ్చే ప్రోత్సాహకాలు ఎంతోమంది మత్సకార కుటుంబాలకు ఉపాధని ఇవ్వడంతోపాటు చే పల ఉత్పత్తి పెంచి చేపల ఎగుమతి ద్వారా ఆయా దేశాలకు విదేశీ మారక ద్రవ్యాన్ని ఆర్జించి పెడుతన్నారు. అయితే మత్స్యకారులు తక్కువగా ఉన్న కొన్ని దేశాలు… చేపలను దిగుమతి చేసుకుని ప్రాజెసింగ్ పరిశ్రమలు, విక్రయ వ్యాపారాలు చేస్తున్నాయి. ఇటీవల జరిగిన ప్రపంచ వాణిజ్య సదస్సులో చేపల సాగు, మత్స్యకారులకు ఇస్తున్న సబ్సిడీపై చర్చించారు. మత్స్యకారులకు ఇస్తున్న సబ్సిడీ ఎత్తివేయాలని చేపల ఉత్పత్తి తక్కువగా ఉన్న దేశాలు డిమాండ్ చేశాయి. వీరికి ప్రపంచ వాణిజ్య సంస్థ (డబ్ల్యూటీవో) కూడా మద్దతు తెలిపింది. దీనికి కాలుష్యాన్ని సాకుగా చూపింది. మర బోట్లు, డీజిల్, పెట్రోల్ ఇంజిన్లతో నడిచే షిప్‌లతో చేపల వేట కొన సాగిస్తుండడంతో సముద్ర జలాలు కలుçషితం అవుతున్నాయని, పర్యావరణం దెబ్బతింటోందని పేర్కొంది. అయితే మత్స్యకారులు ఎక్కువగా ఉన్న భారత్ మాత్రం ఈ నిర్ణయాన్ని వ్యతిరేకించింది. లక్షల మంది ఉపాధిని ప్రభావితం చేసే ఈ నిర్ణయాన్ని తాము అమలు చేయమని స్పష్టం చేసింది. వ్యవసాయ శాఖమంత్రి పీయూష్‌గోయల్ దీనిని బలంగా టవ్యతిరేకించారు. 25 ఏళ్ల సబ్సిడీ కొనసాగించాలని డిమాండ్ చేశారు.

అభివృద్ధి చెందే దేశాలను దెబ్బతీయడమే..
మత్సకారులపై ఆంక్షలు భారత్‌తోపాటు అభివృద్ధి చెందుతున్న దేశాలను ఆర్థికంగా దెబ్బతీయడమే అని పీయూష్‌గోయల్ వాదించారు. భారత్ లాంటి దేశాలల్లో ఇప్పటికీ 70 శాతం నాటు పడవల్లోనే చేపల వేట కొనసాగుతోందని, భారత జాలర్లతో పర్యావరణానికి ఎలాంటి ముప్పు లేదని స్పష్టం చేశారు. భారత దేశంలో 15 లక్షలకు పైగా మత్స్యకారులు చేపల వేటద్వారా ఉపాధి పొందుతున్నారని తెలిలిపారు. సబ్సిడీలు ఎత్తివేస్తే వారంతా రోడ్డున పడతారని, దేశ ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపుతుందని తెలిపారు. ప్రపంచంలో చైనా 7.3 బిలియన్ డాలర్లు, యురోపియన్ యూనియన్ 3.8 బిలియన్ డాలర్లు, అమెరికా, 3.4, బిలియన్ డాలర్లు సబ్సిడీ ఇస్తున్నాయని, భారత్ ఇస్తున్న సబ్సిడీ కేవలం 277 మిలలియన్ డాలర్లు మాత్రమే అని స్పష్టం చేశారు.
Also Read: Father’s Day Special story : ఫాదర్స్ డే ఎలా మొదలైంది..? ఎందుకు సెలెబ్రేట్ చేస్తారో తెలుసా..?

ఏడేళ్లు కొనసాగించేందుకు అనుమతి..
భారత దేశం ఒత్తిడితో దీంతో దిగివచ్చిన డబ్ల్యూటీవో సబ్సిడీని మరో ఏడేళ్లు కొనసాగించేందుకు అనుమతి ఇచ్చింది. తర్వాత ఎత్తివేయాలని స్పష్టం చేసింది. ఈ నిర్ణయం భారత్‌తోపాటు అభివృద్ధి చెందుతన్న చిన్న దేశాలకు పెద్ద ఊరటనిచ్చింది. లేదంటే సబ్సిడీ ఎత్తివేయలేదన్న సాకుతో ప్రపంచ వాణిజ్య దేశాలు చిన్న దేశాలపై ఆంక్షలు విధించడంతోపాటు దిగుమతి పన్ను భారీగా పెంచేవి. ఫలితంగా ఎగుమతులపై తీవ్ర ప్రభావం చూపేది. భారత్ చూపిన చొరవ, తెగువ మన దేశ మత్స్యకారులతోపాటు ప్రపంచంలలోని చిన్న దేశాల మత్స్యకారులకు ఎంతో లబ్ధి చేకూర్చింది. అయితే ఇక్కడ బాధాకర విషయం ఏమిటంటే ప్రపంచ వాణిజ్య విజయంపై మన దేశంలోనే ప్రచారం చేయకపోవడం. ఈ విషయాన్ని ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియా పెద్దగా పట్టించుకోలేదు. కనీసం చిన్న వార్త కూడా కవర్ చేయలేదు.
Also Read:China Military: చైనా ప్రమాదకర ఎత్తు.. భారత్‌సహా పొరుగు దేశాలకు ముప్పు!