https://oktelugu.com/

భారత్ కు ప్రపంచ బ్యాంక్ భారీ సాయం

కరోనా మహమ్మరి ప్రస్తుతం ప్రపంచాన్ని గజగజ వణికిస్తోంది. కరోనా పేరు చెబితే అన్నిదేశాలు భయాందోళనకు గురవుతోన్నాయి. భారత్ లో కరోనా ఎంట్రీతో దేశవ్యాప్తంగా కేంద్రం లాక్డౌన్ చేపట్టింది. 21రోజుల లాక్డౌన్ అమలుతో దేశంలో ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపుతోంది. ఈ నేపథ్యంలో కరోనాపై పోరాటం చేస్తున్న దేశాలకు సాయమందించేందుకు ప్రపంచ బ్యాంక్ ముందుకొచ్చింది. ఈ నేపథ్యంలో కరోనా కట్టడికి భారత్ చేస్తున్న పోరాటానికి ప్రపంచ బ్యాంకు అత్యవసర సాయం కింద బిలియన్ డాలర్ల సాయం(సుమారు రూ.7600కోట్లు) […]

Written By: , Updated On : April 3, 2020 / 02:13 PM IST
Follow us on

కరోనా మహమ్మరి ప్రస్తుతం ప్రపంచాన్ని గజగజ వణికిస్తోంది. కరోనా పేరు చెబితే అన్నిదేశాలు భయాందోళనకు గురవుతోన్నాయి. భారత్ లో కరోనా ఎంట్రీతో దేశవ్యాప్తంగా కేంద్రం లాక్డౌన్ చేపట్టింది. 21రోజుల లాక్డౌన్ అమలుతో దేశంలో ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపుతోంది. ఈ నేపథ్యంలో కరోనాపై పోరాటం చేస్తున్న దేశాలకు సాయమందించేందుకు ప్రపంచ బ్యాంక్ ముందుకొచ్చింది. ఈ నేపథ్యంలో కరోనా కట్టడికి భారత్ చేస్తున్న పోరాటానికి ప్రపంచ బ్యాంకు అత్యవసర సాయం కింద బిలియన్ డాలర్ల సాయం(సుమారు రూ.7600కోట్లు) ప్రకటించింది.

కరోనాను ఎదుర్కొనేందుకు గురువారం ప్రపంచ బ్యాంక్ బోర్డు ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ల సమావేశం నిర్వహించారు. ఇందులో కరోనాను ఎదుర్కోనేందుకు చేపట్టాల్సిన చర్యలపై సుదీర్ఘంగా చర్చించారు. ప్రపంచ సంస్థగా ఉన్న తాము కరోనా నివారణకు ఏం చేయాలనేది దానిపై చర్చించారు. ఇందులోనే భారత్ తమకు ఆర్థికసాయం అందించాలని విజ్ఞప్తి చేసింది. దీనిని పరిశీలించిన అనంతరం ప్రపంచ బ్యాంక్ ప్రతినిధులు కరోనాతో ప్రభావితమవుతున్న దేశాలకు సాయమందించాలని నిర్ణయించారు. ప్రపంచంలోని 25దేశాలకు సాయం చేసేందుకు ప్రపంచ బ్యాంకు ముందుకొచ్చింది. మొత్తం 25దేశాలకు 1.9 బిలియన్ డాలర్ల అత్యవసర సాయం ప్రకటించింది.

ఇందులో అత్యధికంగా భారత్ కు ఒక బిలియన్ డాలర్లను కేటాయిస్తున్నట్టు ప్రపంచ బ్యాంక్ ప్రతినిధులు ప్రకటించారు. ఈ నిధులను స్క్రీనింగ్, కాంటాక్ట్ కేసుల ట్రేసింగ్, లేబొరేటరీ డయాగ్నోస్టిక్స్, వైద్యులకు పర్సనల్ ప్రొటెక్టివ్ ఎక్విప్ మెంట్, నూతన ఐసోలేషన్ వార్డుల ఏర్పాటు కోసం ఇస్తున్నట్లు ప్రపంచ బ్యాంక్ ప్రకటించింది. భారత్ కు ప్రస్తుత పరిస్థితుల్లో ప్రపంచ బ్యాంక్ సాయమందించేందుకు ముందుకు రావడంతో ఊరట లభించింది.

ఆర్థిక వ్యవస్థ పురోగతికి, ప్రజల ఆరోగ్య పరిరక్షణకు రానున్న15నెలల్లో 160బిలియన్ డాలర్ల ఆర్థిక ప్యాకేజీ పై ప్రణాళికలు వేస్తున్నట్లు ప్రపంచ బ్యాంకు ప్రకటించింది. భారత్ తోపాటు పాకిస్తాన్ కు 200మిలియన్ డాలర్లు, ఆఫ్గనిస్థాన్ కు 100, మాల్దీవులకు 7.3, శ్రీలంకకు 128.6 మిలియన్ డాలర్ల సాయం ప్రకటించింది. ప్రపంచ బ్యాంక్ ప్రకటించిన 1.9బిలియన్ల డాలర్లో భారత్ కే ఒక బిలియన్ కేటాయించడం గమనార్హం.