నిండు గర్భణీకి కరోనా!

చైనాలోని వూహాన్లో పుట్టిన కరోనా వైరస్ ప్రపంచాన్ని బెంబెలెత్తిస్తోంది. చిన్న, పెద్ద అనే తేడా లేకుండా అందరిపై ఈ మహమ్మరి ప్రభావం చూపుతోంది. ప్రస్తుతం నమోదవుతున్న కేసులను బట్టి చేస్తే చిన్నపిల్లలు, వృద్ధులు ఎక్కువగా కరోనా బారిన పడుతున్నట్లు స్పష్టమవుతోంది. తాజాగా కరోనా మహమ్మరి తొమ్మిది నెలల గర్భిణీకి సోకింది. దీంతో వైద్యులు అప్రమత్తమై ఆమెకు చికిత్స అందిస్తున్నారు. దేశ రాజధాని ఢిల్లీలో గర్భిణికి కరోనా పాజిటివ్ వచ్చింది. ఢిల్లీలోని ఎయిమ్స్ లో కరోనా బాధితులకు వైద్యం […]

Written By: Neelambaram, Updated On : April 3, 2020 3:15 pm
Follow us on

చైనాలోని వూహాన్లో పుట్టిన కరోనా వైరస్ ప్రపంచాన్ని బెంబెలెత్తిస్తోంది. చిన్న, పెద్ద అనే తేడా లేకుండా అందరిపై ఈ మహమ్మరి ప్రభావం చూపుతోంది. ప్రస్తుతం నమోదవుతున్న కేసులను బట్టి చేస్తే చిన్నపిల్లలు, వృద్ధులు ఎక్కువగా కరోనా బారిన పడుతున్నట్లు స్పష్టమవుతోంది. తాజాగా కరోనా మహమ్మరి తొమ్మిది నెలల గర్భిణీకి సోకింది. దీంతో వైద్యులు అప్రమత్తమై ఆమెకు చికిత్స అందిస్తున్నారు.

దేశ రాజధాని ఢిల్లీలో గర్భిణికి కరోనా పాజిటివ్ వచ్చింది. ఢిల్లీలోని ఎయిమ్స్ లో కరోనా బాధితులకు వైద్యం అందిస్తున్న ఓ వైద్యుడికి కరోనా సోకింది. పేషంట్లను నుంచి వైద్యుడికి కరోనా సంక్రమించినట్లు తెలుస్తోంది. దీంతో వైద్యులు ముందు జాగ్రత్తగా వైద్యుడి భార్యను టెస్టు చేయగా కరోనా పాజిటివ్ వచ్చింది. ఆమె ప్రస్తుతం తొమ్మిది నెలలు గర్భిణీ. దీంతో వైద్యులు అప్రతమతమై వారిద్దరికి చికిత్సలు అందజేస్తున్నారు. ప్రస్తుతం వైద్యుడి భార్యకు ఎలాంటి ప్రాణాపాయం లేదని వైద్యులు తెలిపారు.

ఇటీవల కరోనా వైరస్ తో ఆరునెలల శిశువు మృతిచెందిన సంగతి తెల్సిందే. ఈ వార్త మరువముందే నిండు గర్భిణీకి కరోనా సోకడంతో ఆందోళన రేకెత్తిస్తోంది. ప్రజలంతా స్వీయనియంత్రణ పాటించి ఇళ్లకే పరిమితం కావాలని వైద్యులు సూచిస్తున్నారు.
Also Read: ఏపీలో తొలి కరోనా మరణం