Homeఆంధ్రప్రదేశ్‌అశోక్ గజపతిని ‘ఆడవాళ్ల’తో కొట్టిస్తారా ఏంటి?

అశోక్ గజపతిని ‘ఆడవాళ్ల’తో కొట్టిస్తారా ఏంటి?

ఎక్కడ తగ్గాలో కాదు.. ఎక్కడ కొట్టాలో తెలిసిన వాళ్లే ఈ వైసీపీ వాళ్లు’ అని ఇప్పుడు ఏపీలో గుసగుసలాడుకుంటున్నారు. ఎందుకంటే వైసీపీ ప్రభుత్వం పూసపాటి విజయనగరం రాజుల సంస్థానం అయిన ‘మాన్సాస్ ట్రస్ట్’ను చేజిక్కించుకొని సంచయిత చేతిలో పెట్టింది. టీడీపీ కేంద్రమాజీ మంత్రి అశోక్ గజపతిరాజు ను సాగనంపింది.

అయితే ఆయన న్యాయస్తానాల గడపతొక్కి మళ్లీ పదవిని అలంకరించుకున్నాడు. ఇప్పుడు వైసీపీ నైతికంగా ఈ విషయంలో ఓడగా.. టీడీపీ గెలిచేసింది. అయితే అశోక్ గజపతిరాజుపై వైసీపీ నేతలు ఎదురుదాడి మొదలుపెట్టారు. ముఖ్యంగా ఉత్తరాంధ్రలోనే మకాం వేసిన విజయసాయిరెడ్డి ఇష్టారీతిన విమర్శల వాన కురిపిస్తున్నారు.

మాన్సాస్ సహా అశోక్ గజపతిరాజు అక్రమాలపై ఆరు విచారణ కమిటీలు వేసి ఇప్పుడు నిగ్గుతేల్చే పనిలో వైసీపీ ప్రభుత్వం బిజీగా ఉంది. తమను ఎదురించి మాన్సాస్ ట్రస్ట్ ను దేవాలయాలను దక్కించుకున్న అశోక్ గజపతిరాజుపై తాజాగా ‘మహిళల’ను రంగంలోకి దింపారన్న గుసగుసలు వినిపిస్తున్నాయి.

ఏపీ మహిళా కమిషన్ చైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మా ఇప్పుడు రాజకీయం మొదలుపెట్టారన్న ప్రచారం సాగుతోంది. ఆమె విశాఖలో దిగి సంచయితను పరామర్శించారు. మహిళను తొక్కేసారని విమర్శించారు. కొత్త పాయింట్ ను కనిపెట్టారు. మాన్సాస్ ట్రస్ట్ రాజ్యాంగంలో పురుషులకు మాత్రమే చైర్మన్ పదవి దక్కాలని ఉందని..ఇది సరికాదని ఆరాజ్యాంగం మార్చాలని వాసిరెడ్డి పద్మ అన్నారు.

ప్రపంచవ్యాప్తంగా మహిళలకు సమాన హక్కులు ఇస్తున్నారని.. మాన్సస్ ట్రస్ట్ మాత్రం ఇలా మహిళలపట్ల వివక్ష చూపిస్తున్నారని.. దీన్ని మార్చాలని వాసిరెడ్డి పద్మ కోరారు. దీంతో అశోక్ గజపతిరాజుపై ‘మహిళా అస్త్రాలు’ ప్రయోగించి ఆయనను ఇరుకునపెట్టడానికి రెడీ అవుతున్నట్టు తెలుస్తోంది.

NARESH
NARESHhttps://oktelugu.com/
Naresh Ennam is a Editor who has rich experience in Journalism and had worked with top Media Organizations.He has more than 19 years experience in Journalism. He has good Knowledge on political trends and can do wonderful analysis on current happenings on Cinema and Politics. He Contributes Politics, Cinema and General News.

Most Popular

Kajal Aggarwal : బాలీవుడ్ లోకి వెళ్తే పనికిమాలిన పాత్రలే ఇస్తారు అంటూ కాజల్ అగర్వాల్ హాట్ కామెంట్స్..

Kajal Aggarwal : నేటి తరం యూత్ ఆడియన్స్ లో తిరుగులేని స్టార్ ఇమేజ్ ని సొంతం చేసుకున్న కాజల్ అగర్వాల్ , పెళ్లి తర్వాత తన సెకండ్ ఇన్నింగ్స్ ని చాలా...

The Odyssey : ‘ది ఒడిస్సీ’ లో క్రేజీ రోల్ ని మిస్ చేసుకున్న మన హీరో.. పెద్ద...

రీసెంట్ గా భారీ అంచనాల నడుమ విడుదలైన క్రిస్టోఫర్ నోలన్ 'ది ఒడిస్సీ' చిత్రం , బాక్స్ ఆఫీస్ వద్ద ఏ రేంజ్ వసూళ్ల సునామీ ని సృష్టిస్తూ ముందుకు దూసుకెళ్తుందో మన...

Lenin Movie : 11వ రోజు ఊహించని రికార్డు నెలకొల్పిన ‘లెనిన్’.. ఇప్పట్లో ఈ సునామీ ఆగేలా లేదు..

Lenin Movie : అక్కినేని అఖిల్ హీరో గా నటించిన 'లెనిన్' చిత్రం వసూళ్లు ఇప్పట్లో ఆగేలా కనిపించడం లేదు. మొదటి ఆట నుండే సూపర్ హిట్ టాక్ ని కైవసం చేసుకున్న...

Team India : జింబాబ్వే టూర్ కు టీమిండియా ఇదే.. వాళ్ల మీద మనోళ్ళ రికార్డులు ఎలా ఉన్నాయంటే..

Team India : ఐర్లాండ్ చేతిలో వైట్ వాష్.. ఇంగ్లాండ్ చేతిలో టి20.. వన్డే సిరీస్ కోల్పోయిన తర్వాత టీమిండియా పూర్తిగా నిరాశలో కూరుకుపోయింది. బౌలింగ్ దారుణంగా ఉంది. బ్యాటింగ్ చెత్తగా ఉంది....

TTD : చంద్రబాబు జైల్లో చనిపోతే పొట్టేళ్ల విందు.. అటువంటి అధికారికి తిరుమలలో ఏఈఈ పోస్ట్..

TTD : రాజకీయ నాయకులు రాజకీయాలు చేస్తుంటారు. వాళ్లలో వాళ్లకు వ్యూహాలు ఉంటాయి. ఎత్తులు ఉంటాయి. వాటిని చిత్తు చేసే ఎత్తుగడలు కూడా ఉంటాయి. ఇవన్నీ రాజకీయంలో ఒక భాగం. కానీ ఉద్యోగులు...
Oktelugu Epaper
Exit mobile version