Maha News Vamsi: “మహా అధినేత వంశి మొన్న తప్పించుకున్నాడు.. కానీ వాడిని వదిలిపెట్టే ప్రసక్తి లేదు. వంశి ఆంధ్ర జ్యోతిలో స్ట్రింగర్ లాగా పనిచేశాడు. ఆ తర్వాత “మహా” ఓనర్ ఎలా అయ్యాడు మేము అడగవచ్చా. వంశీ ఎలాంటి లంగా పనులు చేసి, అసాంఘిక దందాలు చేసి ఓనర్ అయ్యాడు మేము మాట్లాడవచ్చా” ఇవీ భారత రాష్ట్ర సమితి మాజీ ఎమ్మెల్యే గాదరి కిషోర్ చేసిన వ్యాఖ్యలు. “మహా” పై దాడి జరిగిన తర్వాత భారత రాష్ట్ర సమితి నాయకులు ఏమాత్రం తగ్గడం లేదు.. పైగా అంతకంతకు రెచ్చిపోతున్నారు. ఇటీవల జగదీశ్ రెడ్డి.. ఆ తర్వాత శ్రీనివాస్ గౌడ్.. ఇప్పుడు కిషోర్ రెచ్చగొట్టే మాటలు మాట్లాడుతున్నారు. తెలంగాణలో తమకు అనుకూలంగా ఉంటేనే సాగుతుందని.. తమకు వ్యతిరేకంగా ఏం చేసినా కుదరదనట్టుగా వారు చేస్తున్న వ్యాఖ్యల ద్వారా అర్థమవుతున్నదని కాంగ్రెస్ నాయకులు అంటున్నారు.
మహా న్యూస్ అధినేత వంశీ గతంలో ఏబీఎన్ ఛానల్ లో పనిచేశారు. ఏబీఎన్ ఛానల్ లో స్ట్రింగర్ గా ఉండేవారు. ఆ తర్వాత ఆయన అంచలంచలుగా ఎదిగారు. ఒక్కసారిగా మహా న్యూస్ మేనేజింగ్ డైరెక్టర్ అయిపోయారు. ఆ తర్వాత మహా మ్యాక్స్, మహా తెలంగాణ, మహా ఆంధ్ర ప్రదేశ్ వంటి చానల్స్ ఏర్పాటు చేశారు. వాస్తవానిలో ఆ ఛానల్ యూట్యూబ్ కు ఎక్కువ, న్యూస్ ఛానల్ కు తక్కువ అన్నట్టుగా ఉంటుంది. అందులో ప్రసారాలు కూడా ఊహించిన స్థాయిలో ఉండవు. తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా ఆ చానల్ ప్రసారాలు సాగిస్తుందని భారత రాష్ట్ర సమితి నాయకులు ఆరోపిస్తున్నారు. అందువల్లే మహా న్యూస్ మీద భారత రాష్ట్ర సమితి నాయకులు దాడి చేసినప్పుడు తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు, లోకేష్, జనసేన అధినేత పవన్ కళ్యాణ్.. మిగతావారు ఖండించారు. మహన్యూస్ కార్యాలయం హైదరాబాదులో ఉంది. దాడి జరిగిన తర్వాత సంఘటన స్థలాన్ని తెలంగాణ మంత్రులు భట్టి విక్రమార్క, పొన్నం ప్రభాకర్ పరిశీలించారు. ప్రజాస్వామ్యంలో ఇటువంటి దాడులకు చోటు లేదని స్పష్టం చేశారు. మీడియా స్వేచ్ఛను హరించే హక్కు ఎవరికీ లేదని పేర్కొన్నారు.
Also Read: హరి హర వీరమల్లు ట్రైలర్ పై చిరంజీవి,రామ్ చరణ్ సంచలన ట్వీట్స్..ఇది అసలు ఊహించలేదుగా!
మహా న్యూస్ కార్యాలయం పై దాడి జరిగిన తర్వాత భారత రాష్ట్ర సమితికి చెందిన నాయకులు ఒక్కొక్కరుగా తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఇటీవల జగదీశ్వర్ రెడ్డి సీమాంధ్ర మీడియా అంటూ వ్యాఖ్యలు చేశారు. సీమాంధ్ర మీడియాపై దాడులు జరుగుతాయని హెచ్చరించారు. ఇంకా రెండు మూడు న్యూస్ చానల్స్ తమ లిస్టులో ఉన్నాయని.. వాటిపై కూడా దాడులు జరుగుతాయని పేర్కొన్నారు. ఆ తర్వాత మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ కూడా మీడియా మీద ఒంటి కాలు మీద రెచ్చిపోయారు. అడ్డగోలుగా కథనాలను ప్రచారం చేస్తే పాతరేస్తామని హెచ్చరించారు.. ఇప్పుడు ఈ జాబితాలో మాజీ ఎమ్మెల్యే గాదరి కిషోర్ చేరారు. ఆయన ఏకంగా మహా న్యూస్ అధినేత వంశీనే టార్గెట్ చేశారు. మొన్నటి దాడుల్లో మిస్ అయ్యాడని.. ఈసారి వదిలే ప్రసక్తి లేదని హెచ్చరించారు. వాస్తవానికి ఈ వివాదంపై మహాన్యులకు కీలకంగా పనిచేసే ఓ మహిళా జర్నలిస్ట్ తన వివరణ ఇచ్చారు. ఇటీవల హైదరాబాద్లో జరిగిన అవ సమావేశంలో దీనిపై ఆమె స్పష్టత ఇచ్చారు.. తమకు తెలియకుండానే అలా జరిగిపోయిందని.. ఇకపై అలా జరగకుండా చూసుకుంటామని పేర్కొన్నారు. అయినప్పటికీ గాదరి కిషోర్ ఈ స్థాయిలో వ్యాఖ్యలు చేయడం విశేషం. కేటీఆర్ మెప్పుకోసం ఒక్కొక్క నాయకుడు రెచ్చి పోయి మాట్లాడుతున్నారని.. వారందరినీ ఆయా నియోజకవర్గాలకు చెందిన ప్రజలు తిరస్కరించారని.. ఇప్పుడు కొత్తగా ప్రజలలో వైషమ్యాలు రెచ్చగొట్టడానికి వారు ప్రయత్నిస్తున్నారని కాంగ్రెస్ నేతలు అంటున్నారు.