
Janasena: జనసేన పార్టీ పెట్టి పది సంవత్సరాలు పూర్తి అయినా సందర్భంగా పవన్ కళ్యాణ్ నేడు మచిలీపట్టణం లో ‘దిగ్విజయభేరి’ అనే మహాసభని ఏర్పాటు చేసాడు.ఈ సభని జనసేన పార్టీ కార్యకర్తలు , అభిమానులు ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు.రాష్ట్రం నలుమూలల నుండి అభిమానులు సంద్రం లాగా ఎగసి పడ్డారు.ఫలితంగా పవన్ కళ్యాణ్ ప్రయాణించే జాతీయ రహదారులు సైతం వేలాది మంది అభిమానులతో కిక్కిరిసిపోయింది.

మూడు గంటల సమయం లో మంగళగిరి జనసేన పార్టీ ఆఫీస్ నుండి ప్రయాణం ప్రారంభిస్తే, ఇప్పటికీ ఆయన మచిలీపట్టణం సభా స్థలికి చేరుకోలేదు. కారణం అడుగడుగునా జనాలు నీరాజనం పలకడమే.ప్రభుత్వం ర్యాలీ ని ఆపేందుకు పోలీసులతో ఉత్తర్వులు జారీ చేయించినా అశేష జనవాహిని తాకిడికి పోలీసులు కూడా చేతులెత్తేశారు.ఇలాంటి అద్భుతమైన రెస్పాన్స్ వస్తుందని బహుశా జనసేన పార్టీ శ్రేణులు కూడా ఊహించలేకపోయాయి ఉండొచ్చు. లేకపోతే ఉదయాన్నే పవన్ కళ్యాణ్ మచిలీపట్టణం సభా స్థలికి పయనం అయ్యేవాడు.

ఇది ఇలా ఉండగా పవన్ కళ్యాణ్ సభలకు యువత రావడం అనేది చాలా కామన్..కానీ మొట్టమొదటిసారి అడుగడుగునా మహిళలు అత్యధిక సంఖ్యలో పవన్ కళ్యాణ్ వారాహి ముందుకొచ్చి హారతులు పట్టడం అనేది అందరినీ ఆశ్చర్యపరిచింది. ఒక ఆడబిడ్డ అయితే నెలలు నిండి ఉన్న బిడ్డని పట్టుకొని పవన్ కళ్యాణ్ ముందుకు వచ్చి హారతి పట్టిన విజువల్స్ హృదయాలను నిజంగా కదిలించేసింది. ఇంత అశేష ఆదరణ.. ముఖ్యంగా మహిళా లోకం నుంచి ఉంటుందని బహుశా పవన్ కళ్యాణ్ కూడా ఊహించి ఉండదు. ఇదే మార్పునకు సంకేతం అని అంటున్నారు.
అభిమానులు కూడా ఊహించి ఉండరు,ఆయన ప్రసంగం కోసం ఇప్పుడు కోట్లాది మంది అభిమానులు, ఇతర పార్టీ అభిమానులు కూడా ఎదురు చూస్తున్నారు.నేడు ఆయన ఇచ్చే స్పీచ్ రాష్ట్ర రాజకీయాల ముఖ చిత్రం మారిపోయే అవకాశాలు మెండుగా ఉన్నాయి.భవిష్యత్తులో జనసేన పొత్తులతో ముందుకు పోతుందా, లేదా ఒంటరిగా పోతుందా అనే ప్రశ్నలకు కూడా తెరపడనుంది నేడు,చూడాలి మరి ఆయన ప్రసంగం ఎలా ఉండబోతుంది అనేది.