Pooja Hegde: పూజ హెగ్డేకు ప్రస్తుతం ఎదురులేదు. వరుస హిట్స్, లెక్కకు మించి ఆఫర్స్ ఆమె సొంతం. లక్కీ హీరోయిన్ అనే బ్రాండ్ నేమ్ కూడా సొంతం చేసుకుంది. ఒక్క హిట్ అంటూ తపస్సు చేసిన అక్కినేని అఖిల్ దాహం మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్ లర్ మూవీతో పూజా హెగ్డే తీర్చేసింది. ఆమె పట్టిందల్లా బంగారమే అన్నట్లు ప్రస్తుత పరిస్థితి ఉంది. అయితే ఈ సిట్యుయేషన్ ని క్యాష్ చేసుకుంటుంది పూజా హెగ్డే. తన ట్రాక్ రికార్డు చూపిస్తూ రెమ్యునరేషన్ విషయంలో నిర్మాతలకు చుక్కలు చూపిస్తుందట. పూజా రెమ్యూనరేషన్ ఇప్పుడు మూడు కోట్లకు పైమాటే నట.

దర్శక నిర్మాతలు వెంటబడుతున్నారని తన రేంజ్, రెమ్యూనరేషన్ ఇంకా పెంచేసిందట. త్రివిక్రమ్-మహేష్ మూవీతో పాటు హరీష్ శంకర్ పవన్ కళ్యాణ్ తో ప్రకటించిన భవదీయుడు భగత్ సింగ్ చిత్రాలలో హీరోయిన్ గా పూజా హెగ్డే(Pooja Hegde)ను తీసుకోవాలని అంటుకుంటున్నారట. ఈ చిత్ర నిర్మాతలు పూజాను సంప్రదించగా రెమ్యూనరేషన్ భారీగా డిమాండ్ చేసిందట. ఓ స్థాయి టూ టైర్ హీరో రేంజ్ రెమ్యూనరేషన్ పూజా డిమాండ్ చేస్తున్నట్లు సమాచారం.
దానికి తోడు ఏకంగా 12మంది పర్సనల్ స్టాఫ్ ని మైంటైన్ చేస్తున్నారట. ఆమె రెమ్యూనరేషన్ తో పాటు స్టాఫ్ ఖర్చులు కూడా నిర్మాతలకు తడిసిమోపెడు అవుతున్నాయట. ఆ మధ్య దర్శక నిర్మాత ఆర్ కె సెల్వమణి ఇదే విషయమై పూజ పై విమర్శలు చేశారు. ఆమె మెయింటెనెన్స్ నిర్మాతలకు అదనపు భారం అవుతుందని ఆరోపించారు. అదే సమయంలో కొంచెం యాటిట్యూడ్ కూడా పెరిగిందని, సెట్స్ కి సమయానికి రావడం లేదన్న టాక్ వినిపిస్తుంది. రాధే శ్యామ్ షూట్ సమయంలో పూజా ప్రవర్తన ప్రభాస్ కి నచ్చలేదని, ఇద్దరికి విబేధాలు తలెత్తాయని కథనాలు వెలువడ్డాయి. మరి సక్సెస్ నెత్తికి ఎక్కించుకొని, ఎక్కువ చేస్తే కెరీర్ త్వరగానే ముగుస్తుంది. పూజా ఈ విషయం తెలుసుకుంటే బెటర్.