Thar Roxx crash viral video: తూర్పు ఢిల్లీలో ఒక వింత సంఘటన చోటుచేసుకుంది. కొత్తగా కొనుగోలు చేసిన థార్ కార్ డెలివరీ రోజే నాశనం అయ్యింది. వివరాల్లోకి వెళ్తే ఓ మహిళ ఇటీవలే సుమారు ₹27 లక్షలు ఖర్చుచేసి మహీంద్రా థార్ కార్ కొనుగోలు చేసింది. కారు డెలివరీ కోసం షోరూం సిబ్బంది ఫస్ట్ ఫ్లోర్‌లో ఏర్పాటు చేశారు.
కారు తాళాలు అందుకున్న ఆ మహిళ, ఆనందంతో వాహనాన్ని స్టార్ట్ చేసింది. ఆ సమయంలో, కొత్త కారును మొదట నిమ్మకాయ తొక్కాలని అనుకున్న ఆమె కంగారులో యాక్సిలరేటర్‌ను గట్టిగా నొక్కింది. దీంతో అదుపుతప్పిన థార్ షోరూం గాజు అద్దాలు పగలగొట్టి కింద పడిపోయింది.
ప్రాణాపాయం నుంచి ఆ మహిళను ఎయిర్‌బ్యాగ్స్ రక్షించాయి. చిన్న గాయమూ కాకుండా బయటపడింది. కానీ, కొత్తకారు మాత్రం క్షణాల్లోనే ధ్వంసమై నుజ్జునుజ్జుగా మారిపోయింది.
Also Read: భారత్ కు పొంచివున్న ప్రమాదాన్ని పసిగట్టి అలర్ట్ కావాలి
ఈ సంఘటన చూసిన షోరూం సిబ్బంది, ఇతర కస్టమర్లు అవాక్కయ్యారు. కారు డెలివరీ రోజే ఇలా జరగడం అందరినీ షాక్‌కు గురి చేసింది.
ఈ సంఘటన సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా, నెటిజన్లు “కారు అదృష్టం, యజమాని అదృష్టం వేరు వేరు” అంటూ కామెంట్లు చేస్తున్నారు.
నిమ్మకాయలను తొక్కించబోయి.. మహీంద్రా థార్ కొత్త కారును షోరూమ్ మొదటి అంతస్తు నుండి కిందపడేసిన మహిళ
ఢిల్లీలో ఘటన.. ఎయిర్ బ్యాగులు ఓపెన్ కావడంతో తప్పిన ప్రమాదం
వెంటనే మహిళను ఆసుపత్రికి తరలింపు pic.twitter.com/8nRcUNuRDN
— Telugu Scribe (@TeluguScribe) September 10, 2025