Chandrababu deepfake video: ఏపీలో( Andhra Pradesh) సోషల్ మీడియాలో ఫేక్ ప్రచారం అధికం అవుతోంది. రాజకీయంగా ఇబ్బందులు పెట్టుకోవాలని ప్రత్యర్థులపై బురద జల్లి కార్యక్రమం కొనసాగుతోంది. తాజాగా ఏపీ సీఎం చంద్రబాబు పేరుతో ఓ ఫేక్ వీడియో వైరల్ అవుతోంది. ఆయన మాట్లాడని మాటలను మాట్లాడినట్టుగా సృష్టించి వీడియోను సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు. దీంతో ప్రభుత్వం ఈ అంశాన్ని సీరియస్ గా తీసుకుంది. గట్టి హెచ్చరికలే పంపింది. తాజాగా ఈ ఫేక్ వీడియో పై సిఐడి సైబర్ విభాగం దృష్టి పెట్టింది. కేసు కూడా నమోదు చేయడం విశేషం. తెలుగు రాష్ట్రాల్లో ఎరువుల కొరత అధికంగా ఉంది. ఏపీలో ఎరువులు అందుబాటులోకి వచ్చాయి. అయితే రైతుల ఆందోళన నేపథ్యంలో సీఎం చంద్రబాబు స్పందించారు. ఎరువుల కొరత పై మాట్లాడారు. అయితే చంద్రబాబు అనని మాటలను ఎడిటింగ్ లో కట్ చేసి.. యాడ్ చేసి వ్యతిరేక ప్రచారం చేస్తున్నారు. దీనిపై ఏపీ ప్రభుత్వం సీరియస్ గా ఉంది.
రైతులపై మాటలు వక్రీకరణ..
సీఎం చంద్రబాబు( CM Chandrababu) ఇటీవల రైతుల గురించి.. ఎరువుల కొరత అంశంపై మాట్లాడారు. అదే సమయంలో పురుగు మందులు, యూరియా ఎక్కువగా వాడటం ఆరోగ్యానికి మంచిది కాదని.. వాటిని తగ్గించాలని సూచించారు. అయితే కొంతమంది ఆ వీడియోను డౌన్లోడ్ చేశారు. డీప్ ఫేక్ టెక్నాలజీని ఉపయోగించి చంద్రబాబు మాట్లాడని మాటలను మాట్లాడినట్లుగా మార్చేశారు. ఆ వీడియోతో చంద్రబాబు రైతులను హెచ్చరిస్తూ.. జైల్లో వేస్తాం అంటూ బెదిరిస్తున్నారని.. టైటిల్ పెట్టి.. సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా వైసీపీ శ్రేణులు రోల్ చేయడం ప్రారంభించాయి. దీనిపై టిడిపి మైనారిటీ సెల్ అధ్యక్షుడు షేక్ మస్తాన్ వలి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆయన ఫిర్యాదు మేరకు రంగంలోకి దిగింది సిఐడి సైబర్ క్రైమ్. అది ఫేక్ వీడియో అని తేల్చి చెప్పింది. ఎవరైనా వైరల్ చేస్తే తప్పకుండా చర్యలు తీసుకుంటామని స్పష్టం చేసింది.
నారా లోకేష్ సీరియస్..
అయితే దీనిపై మంత్రి నారా లోకేష్( Nara Lokesh ) స్పందించారు. కోరలు పీకేసినా పాము కాటేస్తుందట. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీని చూస్తుంటే నిజమే అనిపిస్తోంది. మొన్నటి ఎన్నికల్లో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అనే విశ్వసర్పం కోరలు జనం పీకేశారు. అయినా వైసీపీ విష సర్పం ప్రతిక్షణం విషం కక్కుతూనే ఉంది. ప్రతి అంశంలోనూ ఫేక్ వీడియోలు, ఫేక్ ఆందోళనలు.. అంటూ విరుచుకుపడ్డారు మంత్రి నారా లోకేష్. ఒక సీఎం మీడియా ముఖ్యంగా మాట్లాడిన మాటలనే ఇలా వక్రీకరించిన వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ విష సర్పాలను ఏం చేయాలి అంటూ ప్రశ్నించారు. ప్రజలు ఇటువంటి వాటిని నమ్మవద్దని విజ్ఞప్తి చేశారు.
#PsychoFekuJagan
కోరలు పీకేసినా పాము కాటేస్తుందట! వైసీపీని చూస్తుంటే నిజమే అనిపిస్తుంది. మొన్నటి ఎన్నికల్లో వైసీపీ అనే విష సర్పం కోరలు జనం పీకేశారు. అయినా వైసీపీ విష సర్పం ప్రతి క్షణమూ విషం కక్కుతూనే ఉంది. యూరియా విషయంలో, ప్రభుత్వ పథకాల విషయంలో ప్రతిదాంట్లో ఫేక్ వీడియోలు, ఫేక్… pic.twitter.com/N0CQp2vVvW— Lokesh Nara (@naralokesh) September 9, 2025