2000 Note Withdrawal Opposition: 2000 నోటును ఉపసంహరించుకుంటున్నట్టు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రకటించింది. ఇందుకు తన అధికారిక వెబ్ సైట్ లో అనేక సందేహాలకు సమాధానాలు ఇచ్చింది.. ఒక ప్రెస్ నోట్ కూడా విడుదల చేసింది. అయితే ఇది ఇప్పటికి ఇప్పుడు తీసుకున్న నిర్ణయం కాదని.. నుంచి 2000 నోటు ముద్రణను పూర్తిగా నిలిపివేశామని, ప్రస్తుత నిర్ణయం ప్రజలపై ఎటువంటి ప్రభావం చూపించబోదని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చెబుతోంది. అంతేకాదు ప్రజలు తమ వద్ద ఉన్న 2000 రూపాయల నోటను మార్చుకునేందుకు సెప్టెంబర్ 30 వరకు గడపు ఇచ్చినట్టు రిజర్వ్ బ్యాంక్ ఇండియా ప్రకటించింది. ఈ చర్చ మొత్తం జరుగుతుండగానే కేంద్ర ప్రభుత్వంపై ప్రతిపక్షాలు ఒక రేంజ్ లో ఫైర్ అవుతున్నాయి.
ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నది
” 2016 నవంబర్ 8 న ప్రకటించిన పెద్ద నోట్ల రద్దు నిర్ణయంతో దేశ ఆర్థిక వ్యవస్థ మొత్తం అతలాకుతులమైంది. ఈ నిర్ణయం వల్ల హతాశులై చనిపోయిన వారు ఎందరో. గాయపడిన వారు కూడా ఎందరో. ఆ గాయాలను దాటుకొని దేశం ఇప్పుడిప్పుడే గాడిన పడుతోంది. ఇలాంటి సమయంలో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 2000 నోటును ఉపసంహరించుకున్నట్టు ప్రకటించడం దారుణమైన నిర్ణయమని” ప్రతిపక్షాలు మండిపడుతున్నాయి.”నోట్ల రద్దు పై అప్పుడూ, ఇప్పుడూ కేంద్రం చెబుతున్నది నల్లధనం కట్టడికోసమే. అప్పుడు ఎందుకు కాలేదు? ఇప్పుడు ఎందుకు అవుతుందో సగటు జీవి ప్రశ్నకు సమాధానం ఎవరు చెబుతారని” ప్రతిపక్షాలు నిలదీస్తున్నాయి.
క్లీన్ నోట్ పాలసీ అంటే ఇదేనా
క్లీన్ నోట్ పాలసీ కింద 2000 నోట్లను ఉపసంహరించుకున్నట్టు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రకటించింది. ఈ మేరకు తక్షణమే 2000 నోట్లు ఇవ్వడం ఆపేయాలని అన్ని బ్యాంకులనూ ఆదేశించింది. అలాగే ప్రస్తుతం ఉన్న 200 నోట్లను బ్యాంకులకు వెళ్లి మార్చుకోవచ్చు అంటూ ప్రకటించింది. అయితే ఈ అవకాశం సెప్టెంబర్ 30 దాకా ఉంటుంది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కు చెందిన 19 ప్రాంతీయ కార్యాలయాల్లో ఈ నోట్ల మార్పిడికి వీలుంటుంది.. ఇక మంగళవారం అంటే మే 23 నుంచి బ్యాంకుల్లో 2000 నుట్లను ఖాతాదారులు తమ ఖాతాల్లో డిపాజిట్ చేసి, అందుకు అవసరమైన మొత్తాల్లో తిరిగి నోట్లను తీసుకోవచ్చు అని రిజర్వ్ బ్యాంక్ వెల్లడించింది. అయితే రోజు 20 వేలకు మించి డిపాజిట్ చేయకూడదని షరతు విధించింది.
నాటి దుస్థితి వస్తుందా
నల్లధనం కట్టడి కోసం పెద్ద నోట్లు రద్దు చేస్తున్నట్టు 2016 నవంబర్ 8న ప్రధానమంత్రి ప్రకటించారు. పాత వెయ్యి, 500 నోట్లను రద్దు చేస్తున్నట్టు వెల్లడించారు. అయితే రద్దు చేసిన నోట్లలో బ్యాంకుల్లో మార్చుకునేందుకు ఎన్ని ఇబ్బందులు పడ్డారో ప్రజలకు తెలుసు. ప్రభుత్వం ముందస్తుగా ఏర్పాటు చేయకపోవడంతో ఖాతా దారులు నరకం చూశారు. కొంతమంది క్యూలో నిలబడి ప్రాణాలు కోల్పోయారు. అయితే వేగంగా నోట్ల మార్పిడి ప్రక్రియ జరగాలని తొందరలో ఎవరూ ఊహించని విధంగా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 2000 నోటును చెలామణిలోకి తీసుకొచ్చింది. 2017 మార్చి కి ముందు దేశంలో చెలామణిలో ఉన్న 2000 నోట్లు దాదాపు 89 శాతం కావడం విశేషం. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇప్పుడు ఆ నోట్లను ఉపసంహరించుకున్నట్టు ప్రకటించడంతో జనం ఎన్ని ఇబ్బందులు పడతారోనని సర్వత్రా భయాలు కనిపిస్తున్నాయి.
ఎన్నో అక్రమాలు
గతంలో పెద్ద నోట్ల రద్దు సమయంలో ఎన్నో అక్రమాలు జరిగాయి. ముఖ్యంగా బ్యాంకింగ్ రంగ పెద్దల అవినీతిపై అనేకానేక ఆరోపణలు వచ్చాయి.. ఈ నేపథ్యంలో ఇప్పుడు కూడా నోట్ల మార్పిడితో రకరకాల ప్రలోభాలకు, ఒకలకు ఆస్కారం ఉంటుందని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. నిజానికి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 2018_19 నుంచే 2000 నోటు ముద్రణ నిలిపివేసింది. చలామణిలో ఉన్న వాటి సంఖ్య దాదాపుగా తగ్గించేసింది. అయినప్పటికీ అడపా దడపా 2000 నోట్లు కనిపిస్తూనే ఉన్నాయి. ఇక తాజా నిర్ణయంతో అవి ఉపసంహరణకు గురికానున్నాయి.