
కరోనా కాలంలో మాస్కు అనే పదం ట్రెండింగ్ గా మారింది. మనిషికి ఒంటి మీద బట్టలు ఎలాగో.. మూతికి మాస్కు కూడా అనేలా పరిస్థితులు మారిపోయాయి. దేశంలో కరోనా కేసులు రోజుకు రోజుకు పెరిగిపోతుండటంతో ప్రజలు మాస్కుల్లేకుండా బయటికి వెళ్లాలంటే జంకుతున్నారు. ఈ మహ్మమరిపై మరింత అవగాహన కలిగించే ఓ రెస్టారెంట్ యజమాని చేసిన ప్రయత్నాన్ని ప్రతీఒక్కరు అభినందిస్తున్నారు.
ఈనాడు, ఆంధ్రజ్యోతిని వదలని జగన్!
మధురైకి చెందిన ఓ రెస్టారెంట్ యజమాని కరోనా ట్రెండ్ తగ్గట్టుగా వినూత్నంగా ఆలోచించాడు. ప్రస్తుత పరిస్థితుల్లో మాస్కులు ధరించడం ఎంత ముఖ్యమో తెలిసేలా తన రెస్టారెంట్లో మెనూను సిద్ధం చేశాడు. రుచికరమైన పరోటాలను మాస్కుల రూపంలో కస్టమర్లకు అందిస్తూ ఆకట్టుకుంటున్నాడు. మాస్కుల పరోటాతోపాటు కరోనా రవ్వదోశ, కరోనా బోండాలను కస్టమర్లకు వడ్డిస్తూ కోవిడ్-19పై అవగాహన కల్పిస్తున్నాడు.
ఈ రెస్టారెంట్లోని పరోటా మాస్కులకు ఫుల్ గిరాకీ పెరిగింది. నిజమైన మాస్కులను పోలివున్న మాస్కులను చూస్తూ కస్టమర్లు లోట్టలేసుకుంటూ తింటున్నాడు. పరోటాపై పిండికాలి.. అక్కడక్కడ ఏర్పడిన మచ్చలు సరికొత్త డిజైన్ లా కనబడుతూ చూపరులను ఆకట్టుకున్నాయి. ఒక్కో పరోట ధర రూ.50గా నిర్ణయించి కస్టమర్లకు అందిస్తున్నాడు. ధర కొంచెం ఎక్కువైనప్పటికీ కస్టమర్లు మాత్రం మాస్కు పరోటాలను ఇష్టంగా తింటున్నారు.
ఆ మహిళ చేసిన పనికి ఐపీఎస్ ఫిదా
కరోనాపై అవగాహన పెంచేలా ఈ పరోటా మాస్కులను తయారు చేసినట్లు సదరు రెస్టారెంట్ యజమాని చెబుతున్నాడు. వీటికి ప్రజల నుంచి మంచి స్పందన వస్తుండటంపై సంతోషం వ్యక్తం చేశాడు. ప్రతీఒక్కరు మాస్కుధరించడంతోపాటు భౌతిక దూరం పాటిస్తూ.. కరోనాను తరిమికొట్టాలనే సందేశాలను పరోటాల ద్వారా ఇవ్వడంపై పలువురు అతడిని అభినందిస్తున్నారు. ప్రస్తుతం ఈ పరోటా మాస్కులు నెట్టింట్లో వైరల్ అవుతోన్నాయి. కొందరు నెటిజన్లు తమదైన శైలిలో మిమ్స్, లైకులు, కామెంట్లు పెడుతూ వైరల్ చేస్తున్నారు.