కేసీఆర్ చరిష్మాకు.. కరోనా చెక్ పెట్టిందా?

తెలంగాణ రాష్ట్రంలో తిరుగులేని నాయకుడిగా కేసీఆర్ ఎదిగారు. ప్రత్యేక రాష్ట్రం సాధించి సీఎంగా ప్రజలను మన్నలను పొందారు. ముందస్తు ఎన్నికలతో ప్రజల ముందుకెళ్లి విజయఢంకా మోగించి రెండోసారి అధికారంలోకి వచ్చారు. తెలంగాణలో సీఎం కేసీఆర్ ఎదురొచ్చే నాయకుడు విపక్షాలు ఎంతవెతికినా మచ్చుకు ఒక్కరు కూడా కన్పించరు. ప్రతిపక్షాలన్ని మూకుమ్మడికి ప్రభుత్వంపై దాడిచేసిన సీఎం కేసీఆర్ ఒక్కమాటతో చెక్ పెట్టిన సందర్భాలెన్నో ఉన్నాయి. తెలంగాణ సీఎం కేసీఆర్ చరిష్మా.. రాజకీయ చతురతను ఇతర రాష్ట్రాల సీఎంలు, కేంద్రమంత్రులు ఆమోఘం […]

Written By: Neelambaram, Updated On : July 9, 2020 8:42 pm
Follow us on


తెలంగాణ రాష్ట్రంలో తిరుగులేని నాయకుడిగా కేసీఆర్ ఎదిగారు. ప్రత్యేక రాష్ట్రం సాధించి సీఎంగా ప్రజలను మన్నలను పొందారు. ముందస్తు ఎన్నికలతో ప్రజల ముందుకెళ్లి విజయఢంకా మోగించి రెండోసారి అధికారంలోకి వచ్చారు. తెలంగాణలో సీఎం కేసీఆర్ ఎదురొచ్చే నాయకుడు విపక్షాలు ఎంతవెతికినా మచ్చుకు ఒక్కరు కూడా కన్పించరు. ప్రతిపక్షాలన్ని మూకుమ్మడికి ప్రభుత్వంపై దాడిచేసిన సీఎం కేసీఆర్ ఒక్కమాటతో చెక్ పెట్టిన సందర్భాలెన్నో ఉన్నాయి.

తెలంగాణ సీఎం కేసీఆర్ చరిష్మా.. రాజకీయ చతురతను ఇతర రాష్ట్రాల సీఎంలు, కేంద్రమంత్రులు ఆమోఘం అంటూ ప్రశంసించిన ఘటనలు అనేక ఉన్నాయి. కేసీఆర్ పథకాలను ఇతర రాష్ట్రాల సీఎంలు ఆదర్శంగా తీసుకొని ఆయా రాష్ట్రాల్లోనూ అమలు చేశారు. అంతలా కేసీఆర్ ఆయన చరిష్మాను జాతీయ స్థాయిలోనూ చాటారు. అయితే ఇదంతా కరోనాకు ముందుమాట. ఇప్పుడు తెలంగాణలో పరిస్థితులన్నీ మారిపోయాయి. కరోనాను తొలినాళ్లలో కట్టడి చేస్తూ అందరిచేత శభాష్ అనిపించుకున్న కేసీఆర్ నేడు ఆ మహమ్మరికి భయపడి ఫౌంహౌజ్ లో దాక్కున్నారనే విమర్శలను మూటగట్టుకుంటున్నారు.

కరోనా టైంలో రేవంత్ కు ఛాన్స్ దొరికిందా?

సీఎం అధికారిక నివాసం ప్రగతిభవన్లో 30మంది కరోనా పాజిటివ్ రావడంతో ఈ విమర్శలు ఇంకా ఎక్కువయ్యారు. ఆయన క్యాబినెట్లోని మంత్రులు, అధికార పార్టీ ఎమ్మెల్యేలు కరోనా బారినపడటం.. వారంతా ప్రైవేట్ ఆస్పత్రుల్లో చికిత్స చేయించుకోవడంపై ప్రతిపక్షాలు ఆగ్రహం వ్యక్తం చేశారు. సామాన్యులకు గాంధీ ఆస్పత్రిలో చికిత్స అందిస్తుండగా అధికార పార్టీ నేతలకు మాత్రం ప్రైవేట్ ఆస్పత్రుల్లో చికిత్స అందిస్తున్నారనే సంకేతాలను విపక్షాలు ప్రజల్లోకి తీసుకెళ్లగలిగాయి. దీంతో సీఎం కేసీఆర్ గ్రాఫ్ క్రమంగా పడిపోతూ వస్తోంది.

కరోనా రాష్ట్రంలోకి ఎంట్రీ ఇచ్చే సమయంలో సీఎం కేసీఆర్ అసెంబ్లీ సాక్షిగా చేసిన వ్యాఖ్యలను ప్రతిపక్షాలు గుర్తుచేస్తున్నాయి. తెలంగాణ వాతావారణంలో కరోనా వైరస్ బ్రతకదని.. జ్వరం.. జలుబులకు వేసుకొనే పారాసిటామాల్ ట్యాబ్లెట్ సరిపోతుందని.. టీఆర్ఎస్ ప్రజాప్రతినిధులంతా మాస్కులు ధరించకుండానే పనులు చేస్తామంటూ చెప్పారు. కేసీఆర్ కరోనాపట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించడం వల్లే ప్రతీరోజు వేలల్లో కరోనా కేసులు పెరిగిపోతున్నాయని ప్రతిపక్షాలు విమర్శలను గుప్పిస్తున్నాయి.

ఓ జర్నలిస్టు ఆవేదన.. కన్నీళ్లు పెట్టకమానరు

లాక్డౌన్ సమయంలో ప్రతీసారి మీడియా ముందుకు వచ్చే ప్రజలకు అవగాహన కల్పించే కేసీఆర్ కొద్దిరోజులుగా బయట ఎక్కడ కన్పించడం లేదని విపక్షాలు ఎద్దేవా చేస్తున్నాయి. చివరగా హరితహరం కార్యక్రమంలో కేసీఆర్ కన్పించారని నాటి నుంచి సీఎం అజ్ఞాతంలోకి వెళ్లారని చెబుతున్నాయి. కరోనాను అరికట్టాల్సిన సీఎం ఫౌంహౌజ్ లో ఉండటాన్ని తప్పుబడుతున్నారు. అయితే దీనిపై టీఆర్ఎస్ నేతలు ఎదురుదాడికి దిగుతుండటం గమనార్హం. దీంతో ప్రభుత్వం కరోనాపై చేతులేత్తేసిందా? అనే సందేహాల్లో ప్రజల్లో కలుగుతున్నాయి.

తెలంగాణ సచివాలయం భవనం కూల్చివేత కూడా కేసీఆర్ కు వ్యతిరేకంగా మారింది. కరోనా విజృంభిస్తున్న వేళ పాత సచివాలయాన్ని కోవిడ్ ఆస్పత్రిగా మార్చాలని విపక్షాలు, ప్రజాసంఘాలు డిమాండ్ చేశాయి. దీనిని ప్రభుత్వం ఏమాత్రం పట్టించుకోకుండా సచివాలయాన్ని కూల్చివేసింది. కేసీఆర్ తీరుపై ప్రజల్లోకి వ్యతిరేక సంకేతాలు వెళ్లినట్లు తెలుస్తోంది. ఇప్పటివరకు తెలంగాణలో ఎదురులేకుండా దూసుకెళుతున్న కేసీఆర్ కు కరోనా సడెన్ బ్రేక్ వేసినట్లు కన్పిస్తుంది. సీఎం కేసీఆర్ కరోనా విమర్శల నుంచి ఏవిధంగా బయటపడుతారో వేచి చూడాల్సిందే..!