Rice War: వరి పోరులో గెలుపు టీఆర్ఎస్ ఖాతాలోకి?

Rice War:  తెలంగాణలో బీజేపీ, టీఆర్ఎస్ మధ్య కొంతకాలంగా రాజకీయ వార్ నడుస్తోంది. తెలంగాణలో టీఆర్ఎస్ కు ధీటుగా బీజేపీ ఎదుగుతున్న క్రమంలోనే టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అలర్ట్ అయ్యారు. ఈనేపథ్యంలోనే కేంద్రంలోని బీజేపీని బాదానం చేసేలా తెలంగాణలో వరి పోరుకు శ్రీకారం చుట్టారు. ఈ పాచిక పారడంతో వరి పోరులో విజయం మాత్రం టీఆర్ఎస్ ఖాతాలోకి వెళ్లినట్లు కన్పిస్తోంది. టీఆర్ఎస్ ప్రభుత్వం తెలంగాణలో నీటి ప్రాజెక్టులకు అధిక ప్రాధాన్యం ఇస్తోంది. జెడ్ స్పీడుతో కాళేశ్వరం ప్రాజెక్టును […]

Written By: NARESH, Updated On : December 29, 2021 12:24 pm
Follow us on

Rice War:  తెలంగాణలో బీజేపీ, టీఆర్ఎస్ మధ్య కొంతకాలంగా రాజకీయ వార్ నడుస్తోంది. తెలంగాణలో టీఆర్ఎస్ కు ధీటుగా బీజేపీ ఎదుగుతున్న క్రమంలోనే టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అలర్ట్ అయ్యారు. ఈనేపథ్యంలోనే కేంద్రంలోని బీజేపీని బాదానం చేసేలా తెలంగాణలో వరి పోరుకు శ్రీకారం చుట్టారు. ఈ పాచిక పారడంతో వరి పోరులో విజయం మాత్రం టీఆర్ఎస్ ఖాతాలోకి వెళ్లినట్లు కన్పిస్తోంది.

Rice War

టీఆర్ఎస్ ప్రభుత్వం తెలంగాణలో నీటి ప్రాజెక్టులకు అధిక ప్రాధాన్యం ఇస్తోంది. జెడ్ స్పీడుతో కాళేశ్వరం ప్రాజెక్టును పూర్తిగా చేయగా కొన్నిచోట్ల నిరంతరం పనులు సాగుతున్నాయి. ఈక్రమంలోనే తెలంగాణలో నీటి సదుపాయం గతంలో కంటే గణనీయంగా పెరిగింది. దీంతో రైతులంతా వరి పంట వేసేందుకే మొగ్గు చూపుతున్నారు.

Also Read:  కేసీఆర్ అలా చేస్తే ఇక ముందస్తు ఎన్నికలు లేనట్లే..!

ఈక్రమంలోనే గత ఖరీఫ్ సీజన్లో తెలంగాణలో వరి పంట ఎక్కువగా సాగైంది. దాదాపు కోటికి పైగా ఎకరాల్లో వరి పంట సాగైనట్లు అంచనా. ఇందులో భాగంగానే తెలంగాణ ప్రభుత్వం కేంద్రానికి 60లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం ఇచ్చేందుకు అంగీకారం తెలిపింది. అయితే ఈసారి 90లక్షల మెట్రిక్ టన్నుల మేర ధాన్యం కొనుగోలు కేంద్రాలకు వస్తుందని రాష్ట్ర ప్రభుత్వం అంచనా వేస్తోంది.

దీంతో తెలంగాణలో పండించిన మొత్తం ధాన్యాన్ని కేంద్రమే కొనుగోలు చేయాలని టీఆర్ఎస్ డిమాండ్ చేస్తోంది. ఈక్రమంలోనే ఇరుపార్టీల మధ్య మాటలయుద్ధం కొంతకాలంగా తీవ్ర స్థాయిలో నడుస్తోంది. వరి ధాన్యం కొనుగోలు అంశంపై టీఆర్ఎస్ ఎంపీలు పార్లమెంటులోనే కేంద్రాన్ని గట్టిగానే  నిలదీసే ప్రయత్నం చేశారు. కేంద్ర మంత్రి పీయూల్ గోయల్ వరి కొనుగోలుపై ధీటుగానే సమాధానం ఇచ్చారు.

టీఆర్ఎస్ దీనిని సాకుగా చూపి కేంద్రంలోని బీజేపీ వరి కొనుగోలు చేయడలేదని తెలంగాణలో ధర్నాలు, నిరసనలు చేపట్టింది. మంత్రులు, ఎమ్మెల్యేలు రోడ్లపైకి వచ్చి నిరసన తెలిపి బీజేపీని బాదానం చేసే ప్రయత్నం చేస్తూ రైతులకు తాము అండగా ఉంటామనే సంకేతాలను పంపించింది. ఈక్రమంలోనే కేంద్రం తాజాగా మరో 6లక్షల మెట్రిక్ టన్నుల బియ్యాన్ని కొనుగోలు చేసేందుకు అంగీకారం తెలుపుతూ లేఖ రాసింది.

మరోవైపు యాసంగి పంటపై సైతం టీఆర్ఎస్ కేంద్రాన్ని ఇరుకున పెట్టే ప్లాన్ రెడీ చేసింది. కేంద్రం వరి కొనుగోలు చేసేందుకు సుముఖంగా లేనందున రైతులు వరి పంట వేయద్దని టీఆర్ఎస్ సర్కార్ చెబుతోంది. ఈక్రమంలోనే యాసంగి పంటపై ఇప్పుడే క్లారిటీ లేనందునా కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాలు ముందస్తు ఒప్పందాలేమి చేసుకోలేదు. మొత్తానికి వరి పోరులో బీజేపీని కార్నర్ చేయడంలో టీఆర్ఎస్ పైచేయి సాధించిందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.

Also Read:  బీజేపీని టార్గెట్ చేస్తున్న కేసీఆర్? వరిని వాడుకుని పన్నాగాలు పన్నుతున్న సీఎం?