https://oktelugu.com/

RRR Pay Per View: ‘ఆర్ఆర్ఆర్’ రిలీజ్ ‘పే పర్ వ్యూ’లో.. వర్కౌట్ అవుతుందా ?

RRR Pay Per View: జనవరి 7వ తేదీన ఆర్ఆర్ఆర్ భారీ స్థాయిలో అత్యున్నతమైన అంచనాలతో ప్రపంచ వ్యాప్తంగా విడుదల కాబోతుంది. సౌత్ ఇండియాతో పాటు నార్త్ ఇండియాలోనూ భారీ అంచనాలు ఉన్నాయి. కానీ, కరోనా మూడో వేవ్ విస్తృతంగా రావడానికి సిద్ధం అయింది. మరి హిందీలో ఆర్ఆర్ఆర్ కు అనుకున్నంతగా కలెక్షన్స్ వస్తాయా ? ఇదే ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. నిజానికి కరోనా తర్వాత చాలా చోట్ల జనాలు థియేటర్స్ వరకు రావడానికి ధైర్యం చేయడం […]

Written By:
  • Shiva
  • , Updated On : December 29, 2021 11:58 am
    Follow us on

    RRR Pay Per View: జనవరి 7వ తేదీన ఆర్ఆర్ఆర్ భారీ స్థాయిలో అత్యున్నతమైన అంచనాలతో ప్రపంచ వ్యాప్తంగా విడుదల కాబోతుంది. సౌత్ ఇండియాతో పాటు నార్త్ ఇండియాలోనూ భారీ అంచనాలు ఉన్నాయి. కానీ, కరోనా మూడో వేవ్ విస్తృతంగా రావడానికి సిద్ధం అయింది. మరి హిందీలో ఆర్ఆర్ఆర్ కు అనుకున్నంతగా కలెక్షన్స్ వస్తాయా ? ఇదే ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.

    RRR Pay Per View

    RRR Pay Per View

    నిజానికి కరోనా తర్వాత చాలా చోట్ల జనాలు థియేటర్స్ వరకు రావడానికి ధైర్యం చేయడం లేదు. ఇప్పటికే ఓమిక్రాన్ దెబ్బకి మహారాష్ట్ర, మధ్యప్రదేశ్ లో మళ్ళీ లాక్ డౌన్ విధించే వాతావరణం కనిపిస్తోంది. ఆల్ రెడీ ఆయా రాష్ట్రాల్లో ఇప్పటికే థియేటర్స్ ను కేవలం 50% ఆక్యుపెన్సీతో మాత్రమే నడుపుతున్నారు. పైగా థియేటర్స్, షాపింగ్ మాల్స్ ను డేంజర్ జోన్ లో ఉన్నాయని ప్రభుత్వాలు కూడా అభిప్రాయపడుతున్నాయి.

    కాబట్టి.. ఉన్నపలంగా కొన్నాళ్లు థియేటర్స్, షాపింగ్ మాల్స్ ను మూసి వేయడమే మంచిది అనేలా అధికారులు కూడా ఇప్పటికే హెచ్చరికలు జారీ చేస్తున్నారు. మరి చివరికి ఏం జరుగుతుంది ? నిజంగానే థియేటర్స్ ను మూసేస్తే.. ఆర్ఆర్ఆర్ పరిస్థితి ఏమిటి ? అందుకే, సినీ పండితులు ఆర్ఆర్ఆర్ టీమ్ కి ఒక సలహా ఇస్తున్నారు.

    Also Read: మల్టీస్టారర్​ కింగ్​ మేకర్స్ ఆప్పుడు బాలచందర్​.. ఇప్పుడు రాజమౌళి- జూ.ఎన్టీఆర్​

    పే పర్ వ్యూ.. అవును ఈ పద్ధతిలోనే సినిమాని రిలీజ్ చేస్తే బాగుంటుంది అనే చర్చ మొదలైంది. సినిమా థియేట్రికల్ బిజినెస్ తక్కువగా ఉండే రాష్ట్రాల్లో అలా వెళ్తేనే మంచిది అని సినిమా విశ్లేషకులు కూడా సూచన చేస్తున్నారు. గతంలో సల్మాన్ ఖాన్ రాధే సినిమాకి కూడా ఓటీటీలోనే డబ్బులు పెట్టి చూసుకునే విధంగా ఏర్పాటు చేశారు.

    కాకపోతే, ఓటీటీ లో సాధారణంగా ఎలాంటి సినిమా విడుదలైన, కొన్ని నిమిషాల్లోనే ఒరిజినల్ ప్రింట్ ను పైరసీ రూపంలో బయటకు వచ్చేస్తోంది. కాబట్టి.. పే పర్ వ్యూ అంటూ సినిమా విడుదల చేసినా, సినిమా పై ఈజీగా పైరసీ భూతం ఎటాక్ అయ్యే ఛాన్స్ ఉంది. మరి చివరకు రాజమౌళి ఎలాంటి నిర్ణయం తీసుకుంటాడో చూడాలి.

    Also Read: నా చివరి శ్వాస వరకు తారక్​ స్నేహం నా గుండెల్లో నిలిచిపోతుంది- చరణ్​

    Tags