కోమటిరెడ్డిపై వేటు వేస్తారా..?

తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో అంతర్గత కుంపట్లు కొత్తేమీ కాదు. ఎన్నికల్లో టికెట్ కేటాయింపు నుంచి నామినేటెడ్ పోస్టు కోసం కూడా కుమ్ములాటలు సాగుతూనే ఉంటాయి. ఇటీవల టీపీసీసీ అధ్యక్ష పదవిని రేవంత్ రెడ్డికి ఇవ్వొద్దని కొందరు నాయకులు బాహాటంగానే విమర్శించారు. అంతేకాకుండా నాకంటే నాకే ఇవ్వాలని పట్టుబట్టారు. కానీ అధిష్టానం మాత్రం తీవ్రంగా చర్చించి రేవంత్ రెడ్డికే పట్టం కట్టింది. అయితే పార్టీలోని కొందరు సీనియర్ నాయకులు చేసేదేమీ లేక కామ్ గా ఉండగా.. కోమటిరెడ్డి వెంటరెడ్డి […]

Written By: NARESH, Updated On : June 28, 2021 11:29 am
Follow us on

తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో అంతర్గత కుంపట్లు కొత్తేమీ కాదు. ఎన్నికల్లో టికెట్ కేటాయింపు నుంచి నామినేటెడ్ పోస్టు కోసం కూడా కుమ్ములాటలు సాగుతూనే ఉంటాయి. ఇటీవల టీపీసీసీ అధ్యక్ష పదవిని రేవంత్ రెడ్డికి ఇవ్వొద్దని కొందరు నాయకులు బాహాటంగానే విమర్శించారు. అంతేకాకుండా నాకంటే నాకే ఇవ్వాలని పట్టుబట్టారు. కానీ అధిష్టానం మాత్రం తీవ్రంగా చర్చించి రేవంత్ రెడ్డికే పట్టం కట్టింది. అయితే పార్టీలోని కొందరు సీనియర్ నాయకులు చేసేదేమీ లేక కామ్ గా ఉండగా.. కోమటిరెడ్డి వెంటరెడ్డి మాత్రం సొంత పార్టీపై విమర్శలు చేస్తూనే ఉన్నారు.

టీపీసీసీ అధ్యక్ష పదవిని మొదట్లో రేవంత్ రెడ్డికి ఇచ్చినా పర్వాలేదని వ్యాఖ్యలు చేసిన కోమటిరెడ్డి వెంకటరెడ్డి చివరి నిమిషంలో తనకే ఇవ్వాలని ఏకంగా ఢిల్లీకి వెళ్లారు. అక్కడ కొందరు పెద్దలతో కలిసి లాభీయింగ్ నడిపించారు. తనకు ఆ పదవి ఇవ్వకపోతే బీజేపీలో చేరుతానని కూడా అన్నారు. అయితే ఆయన పాచిక పారలేదు. దీంతో రేవంత్ రెడ్డికే కిరటం దక్కడంతో కోమటిరెడ్డి హైకమాండ్ పై విమర్శలు చేయడం ప్రారంభించారు. టీపీసీసీ అధ్యక్ష పదవిని అమ్ముకున్నారని ఆరోపించారు. దీంతో పార్టీ హై కమాండ్ ఆయన విమర్శలపై వివరణ తీసుకుంది.

గతంలో ఆయన సోదరుడు రాజగోపాల్ రెడ్డి కూడా కాంగ్రెస్ పార్టీపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. అంతేకాకుండా ఆయన బీజేపీ బాట పట్టారు. కానీ ఆయనపై ఎలాంటి చర్యలు తీసుకోలేదు. దీంతో తాను వ్యాఖ్యలు చేసినా ఎలాంటి చర్యలు తీసుకోరనే ఉద్దేశంతోనే కోమటిరెడ్డి ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారని అంటున్నారు. అయితే ఇప్పుడు కోమటిరెడ్డిపై ఎలాంటి చర్యలు తీసుకోకపోతే రేపు మరికొందరు అంసతృప్త నాయకులు తమ స్వరం పెంచే అవకాశం ఉందని అంటున్నారు.

పార్టీ పటిష్టతతో పాటు క్రమశిక్షణను మెయింటేన్ చేస్తానని పీసీసీ అధ్యక్ష పదవి చేపట్టిన తరువాత రేవంత్ రెడ్డి చెప్పారు. దీంతో ఇలా సొంత పార్టీపై విమర్శలు చేసేవారిపై రేవంత్ రెడ్డి క్రమశిక్షణ చర్యలు తీసుకుంటారా..? అన్న చర్చ సాగుతోంది. ఇప్పటికే ఎన్నో వైఫల్యాలతో పార్టీ అధ్వాన స్థితికి చేరింది. ఈ సమయంలో పార్టీని కాపాడుతారనే ఉద్దేశంతోనే రేవంత్ రెడ్డికి పగ్గాలు అప్పజెప్పారు. ఈ తరుణంలో కోమటిరెడ్డి లాంటి వాళ్లకు అడ్డుకోకపోతే పార్టీ మనుగడకే ప్రమాదం ఏర్పడే అవకాశముందని అంటున్నారు.