https://oktelugu.com/

ఆ ఓట్లైనా టీడీపీకి పడేనా..?

ఆంధ్రప్రదేశ్‌లో తెలుగుదేశం పార్టీ పరిస్థితి నానాటికీ తీసికట్టుగా ఉంది. సార్వత్రిక ఎన్నికల్లో కనీసం పోటీ ఇవ్వలేకపోయిన టీడీపీ.. ఆ తర్వాత జరుగుతున్న ఏ ఎన్నికల్లోనూ తన సత్తా చాటలేకపోతోంది. ఇటీవల జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లోనూ పార్టీ ప్రభావం పెద్దగా కనిపించలేదు. ఇక కార్పొరేషన్‌, మున్సిపల్ ఎన్నికల్లోనూ ఎక్కడో అట్టడుగునా మిగిలిపోయింది. కేవలం ఒక్క మున్సిపాలిటీలో పాగా వేసి జెండా ఎగురవేసింది. అయితే.. పంచాయతీ ఎన్నికల సందర్భంగా తమ పార్టీకి 40 శాతం ఓట్లు పడ్డట్టుగా టీడీపీ […]

Written By:
  • Srinivas
  • , Updated On : April 15, 2021 2:05 pm
    Follow us on

    TDP
    ఆంధ్రప్రదేశ్‌లో తెలుగుదేశం పార్టీ పరిస్థితి నానాటికీ తీసికట్టుగా ఉంది. సార్వత్రిక ఎన్నికల్లో కనీసం పోటీ ఇవ్వలేకపోయిన టీడీపీ.. ఆ తర్వాత జరుగుతున్న ఏ ఎన్నికల్లోనూ తన సత్తా చాటలేకపోతోంది. ఇటీవల జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లోనూ పార్టీ ప్రభావం పెద్దగా కనిపించలేదు. ఇక కార్పొరేషన్‌, మున్సిపల్ ఎన్నికల్లోనూ ఎక్కడో అట్టడుగునా మిగిలిపోయింది. కేవలం ఒక్క మున్సిపాలిటీలో పాగా వేసి జెండా ఎగురవేసింది.

    అయితే.. పంచాయతీ ఎన్నికల సందర్భంగా తమ పార్టీకి 40 శాతం ఓట్లు పడ్డట్టుగా టీడీపీ అధినేత చంద్రబాబు చెప్పుకొచ్చారు. కానీ.. ఆ పరిస్థితి ఎక్కడా కనిపించలేదు. 40 శాతం ఓట్లు పడితే కనీసం సీట్లు సాధించి తీరాలి. కానీ.. టీడీపీ మద్దతుదారులు ఎక్కడా గెలిచిన దాఖలాలు లేవు. దారుణంగా చావుదెబ్బ తింది. ఆ విషయం చంద్రబాబుకు సైతం తెలుసు. కానీ.. మీడియా ముందుకు వచ్చేసరికి మాత్రం లెక్కకు మించి లెక్కలు చేపడం ఆయన నైజం. ఇది ప్రజలందరికీ కూడా ఎపుడో అర్థమైపోయింది. కానీ.. అర్థం కానిదల్లా చంద్రబాబుకే అనేది స్పష్టం.

    ఇక ఇప్పుడు తిరుపతి ఉప ఎన్నిక పోరు హోరాహోరీగా నడుస్తోందని చెప్పుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు చంద్రబాబు. గత సార్వత్రిక ఎన్నికల వేళ తిరుపతి లోక్‌సభ సీటుకు పోటీ చేస్తే టీడీపీకి వచ్చిన ఓట్లు 37 శాతం. పోలైన ప్రతీ వంద ఓట్లలో 37 ఓట్లు టీడీపీకి పడితే.. 57 శాతం ఓట్లు వైసీపీకి పోలయ్యాయి. అయితే.. ఆ సమయంలో టీడీపీకి ఆ 37 శాతం ఓట్లు కూడా ఎలా వచ్చాయో అందరికీ తెలిసిందే. టీడీపీ చేసిన ప్రలోభాల పర్వానికి ఆ మాత్రం ఓట్లు రాల్చినట్లుగా అప్పట్లో భారీగానే ఆరోపణలు వచ్చాయి.

    అయితే.. ఇప్పుడు ఆ ఓట్లు టీడీపీని మైనస్ కానున్నట్లుగా తెలుస్తోంది. ఎందుకంటారా.. ఇప్పుడు టీడీపీ తరఫున డబ్బులు పెట్టడానికి ఎవరూ ముందుకు రావడం లేదు. దీంతో ఓటర్లను ప్రలోభ పెట్టే అంత సీన్‌ టీడీపీకి లేకుండా పోయింది. ఈ నేపథ్యంలో ఈ లోక్‌సభ ఎన్నికల్లో ఆ 32 శాతం కూడా టీడీపీకి పోలవుతాయా అనే ప్రశ్న వెల్లువెత్తుతోంది.