https://oktelugu.com/

తెలంగాణలో మరో ఎన్నికల జాతర

నాగార్జున సాగర్ ఉప ఎన్నిక ముగిసిపోకముందే తెలంగాణలో మరో ఎన్నికల జాతర మొదలైంది. ఈసారి మినీ పోరుకు రంగం సిద్ధమైంది. తెలంగాణలో మున్సిపల్ ఎన్నికలకు నోటిఫికేషన్ వెలువడింది. రెండు కార్పొరేషన్లు, ఐదు మున్సిపాలిటీల్లో ఎన్నికలు నిర్వహించేందుకు రాష్ట్ర ఎన్నికల సంఘం తాజాగా నోటిఫికేషన్ విడుదల చేసింది. గ్రేటర్ వరంగల్, ఖమ్మం కార్పొరేషన్లతోపాటు జడ్చర్ల, కొత్తూరు, నకిరేకల్, సిద్దిపేట, అచ్చంపేట మున్సిపాలిటీలకు ఎన్నికలు నిర్వహించేందుకు ఈసీ రెడీ అయ్యింది. రేపటి నుంచి ఈనెల 18వరకు నామినేషన్లు స్వీకరిస్తారు. 19న […]

Written By:
  • NARESH
  • , Updated On : April 15, 2021 / 02:11 PM IST
    Follow us on

    నాగార్జున సాగర్ ఉప ఎన్నిక ముగిసిపోకముందే తెలంగాణలో మరో ఎన్నికల జాతర మొదలైంది. ఈసారి మినీ పోరుకు రంగం సిద్ధమైంది. తెలంగాణలో మున్సిపల్ ఎన్నికలకు నోటిఫికేషన్ వెలువడింది. రెండు కార్పొరేషన్లు, ఐదు మున్సిపాలిటీల్లో ఎన్నికలు నిర్వహించేందుకు రాష్ట్ర ఎన్నికల సంఘం తాజాగా నోటిఫికేషన్ విడుదల చేసింది.

    గ్రేటర్ వరంగల్, ఖమ్మం కార్పొరేషన్లతోపాటు జడ్చర్ల, కొత్తూరు, నకిరేకల్, సిద్దిపేట, అచ్చంపేట మున్సిపాలిటీలకు ఎన్నికలు నిర్వహించేందుకు ఈసీ రెడీ అయ్యింది. రేపటి నుంచి ఈనెల 18వరకు నామినేషన్లు స్వీకరిస్తారు. 19న అభ్యర్థుల నామినేషన్ల పరిశీలన ఉంటుంది. నామినేషన్ల ఉపసంహరణ 22 వరకు ఉంటుంది. ఈనెల 30న పోలింగ్ నిర్వహిస్తారు. మే 3న ఓట్ల లెక్కింపు నిర్వహించి ఫలితాలు ప్రకటిస్తారు.

    ఇక మొన్నటి మున్సిపల్ ఎన్నికల్లో జరగని.. ఖాళీ అయిన డివిజన్లకు కూడా ఈ నెల 30నే ఈసీ ఎన్నికలు నిర్వహించేందుకు సిద్ధమైంది. ఇప్పటికే ఎన్నికల సంఘం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. ఈ ఉదయం వార్డుల వారీ రిజర్వేషన్లను ప్రకటించారు. దీంతో ఈ నెలతో తెలంగాణలో ఇక మొత్తం ఎన్నికల ప్రక్రియ ముగియనుంది. రాబోయే మూడేళ్ల వరకు ఇక ఏ ఎన్నిక ఉండదు.

    వరంగల్ పరిధిలో 66 డివిజన్లకు గాను 5 డివిజన్లు ఎస్సీ మహిళలకు కేటాయించారు. ఎస్సీలకు 6, ఎస్టీ1, ఎస్టీ మహిళ 1, బీసీ మహిళలకు 10, బీసీ జనరల్ 10, జనరల్ మహిళలకు 16 డివిజన్లు కేటాయించారు. ఇక ఖమ్మంలోనూ 60 డివిజన్లకు రిజర్వేషన్లు ఖరారు చేశారు.