Kapu Community In AP: ‘కాపు’ కాసేవారే కాపులు. మాట మీద నిలబడేవారు. మాటకు విలువిచ్చేవారు. నమ్మితే ప్రాణం పెడతారు. ఎట్టి పరిస్థితుల్లో నమ్మకాన్ని వమ్ము చేయరు. ఎంతటి సంక్లిష్ట పరిస్థితినైనా తట్టుకొని నిలబడగలరు. ఇంత మంచి విశ్లేషణలు కాపుల గురించి ఉన్నా.. దశాబ్దాలుగా దారుణ వంచనకు గురైన వారు కూడా వారే. రాజకీయ క్రీడలో సమిధులుగా మారినవారు కూడా వారే. రాజకీయ, ఆర్థికంగా అణగదొక్కబడడమే కాదు.. వెనుకబడిన వర్గాల వారికి టార్గెట్ కూడా వారే. అలా అనే దానికంటే అంతలా ఆ రెండు సామాజికవర్గాలు కాపులను బలి పశువులు చేశాయి. ఇటు రాజ్యాధికారాన్ని దూరం చేయడమే కాదు. వెనుకబడిన వర్గాల శత్రువులు కాపులను చూపించడంలో కూడా ఆ రెండు వర్గాలు సక్సెస్ అయ్యాయి.

ఉమ్మడి ఏపీలోనైనా.. నవ్యాంధ్రలోనైనా కాపు సామాజికవర్గానిదే సింహ భాగం. కానీ ఆ సామాజికవర్గం ఎప్పుడూ రాజ్యాధికారానికి దూరం. అలాగని ఆర్థికంగా స్థితిమంతులు కాదు. కేవలం కాగితపు లెక్కలకు ఫార్వర్డ్ కేస్ట్. ఆర్థికంగా మాత్రం లోయర్ కేస్ట్. ఫార్వర్డ్ కేస్ట్ అన్న మాట వచ్చినప్పుడు రెడ్డి, కమ్మ సామాజికవర్గాలు జీర్ణించుకోలేకపోతున్నాయి. అటు ఆర్థికంగా చూసుకుంటే ఇతర వెనుకబడిన సామాజికవర్గాలతో సమానంగా ఉండడంతో వారు కూడా అనుమానాపు చూపులు చూస్తున్నారు. అయితే ఇదంతా ఇప్పుడు జరిగింది కాదు. దశాబ్దాలుగా జరుగుతున్న వంచనఇది. ఆ వంచన నుంచి పుట్టుకొచ్చిన ఆర్తనాదమే రిజర్వేషన్. కానీ ఆ రిజర్వేషన్ పోరాటాలకు కూడా ‘మంట’ అంటించి చలి కాచుకోవడం ఆ రెండు సామాజికవర్గాలకు అలవాటుగా మారింది.
గత ఎన్నికల్లో అంతులేని హామీలిచ్చి.. మీ కడగండ్లను తీర్చుతానని.. రిజర్వేషన్లు కల్పిస్తానని.. రాజకీయంగా, ఆర్థికంగా చేయూతనందిస్తానని హామీలిచ్చిన జగన్ ను కాపులు నమ్మారు. అండగా నిలబడ్డారు. ఏకపక్షంగా ఓట్లు వేశారు. చంద్రబాబు సర్కారు చర్యల పుణ్యం. రిజర్వేషన్ ఉద్యమం రగిల్చిన చిచ్చు జగన్ కు పొలిటికల్ గా అడ్వాంటేజ్ అయ్యింది. ప్రత్యామ్నాయంగా పవన్ ఉన్నా..దశాబ్దాలుగా తమపై అలవాటు ప్రయోగమైన వంచనవైపే కాపులు మొగ్గుచూపారు. కానీ తీరా అధికారంలోకి వచ్చాక తమకు జరిగిన అన్యాయాన్ని గుర్తించగలిగారు. తాము చేసిన తప్పిదాన్ని తెలుసుకొని బాధపడుతున్నారు.

అయితే జరిగింది మంచికే.. జరగబోయేది మన మంచికేనన్న పెద్దల మాటలు ఇప్పుడు గుర్తుకొస్తున్నాయి. కాపు సామాజికవర్గమంతా దశాబ్దాలుగా జరుగుతున్న వంచనను గుర్తించి పవన్ చెంతకు చేరుతోంది. పవన్ ను మరింత సమ్మోహన శక్తిగా మార్చుతోంది. అజేయమైన శక్తిగా మార్చబోతోంది. రాజకీయ వ్యూహంలో భాగంగా పవన్ ఎవరితో వెళ్లినా.. ఎవరితో పొత్తు పెట్టుకున్నామద్దతుగా నిలిచేందుకు సిద్ధమైంది. ఈ సుదీర్ఘ ఏపీ రాజకీయాల్లో వచ్చే ఎన్నికల్లో కాపు సామాజికవర్గం క్లీయర్ ఫ్యాక్టర్ పనిచేస్తుందని విశ్లేషకులు సైతం అభిప్రాయపడుతున్నారు. అందుకే ఈ ఎన్నికలు కాపులకు స్పెషల్ గా విశ్లేషిస్తున్నారు. కనీవినీ ఎరుగని రీతిలో కాపు జ్వాలలు ఎగసిపడతాయని సైతం నమ్మకంగా చెబుతున్నారు.