CM KCR- National Party: తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ జాతీయ రాజకీయాల వైపు చూస్తున్నారు. దసరా రోజున పార్టీ ఏర్పాటు చేసి తద్వారా కార్యకలాపాలు విస్తృతం చేయాలని బావిస్తున్నారు. కానీ ఇక్కడే ఓ ట్విస్ట్ ఏర్పడుతోంది. జాతీయ రాజకీయాలు సీఎం కేసీఆర్ కు తలనొప్పిగా మారుతున్నాయి. కొత్త పార్టీ ఏర్పడితే చిక్కులు ఎదురు కానున్నాయి. ఏకంగా సీఎం పోస్టే ఊస్ట్ కానుంది. దీంతో ఏం చేయాలనేదానిపై కేసీఆర్ సమాలోచనలు చేస్తున్నారు. కొత్త పార్టీ పెడితే శాసనసభా పక్ష నేతగా కూడా మరొకరిని నియమించాల్సిన అవసరం ఉంటుంది. దీంతో కేసీఆర్ ఏం చర్యలు తీసుకుంటారు? టీఆర్ఎస్ పార్టీనే పేరు మార్చి బీఆర్ఎస్ గా చేయాలని చూస్తున్నారు. ఇందులో ఎదురయ్యే న్యాయపరమైన ఇబ్బందులను గుర్తిస్తున్నారు.

టీఆర్ఎస్ ను బీఆర్ఎస్ గా మార్చడమా? లేక కొత్త పార్టీ పెట్టడమా అనే కోణంలో ఆలోచనలు చేస్తున్నారు. టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తీసుకునే ఏ నిర్ణయమైనా తమకు శిరోధార్యమే అని చెబుతున్నారు. టీఆర్ఎస్ కు బదులుగా బీఆర్ఎస్ లేదా మరో పేరు పెట్టడమా అని ఆరా తీస్తున్నారు. టీఆర్ఎస్ ను ఇలాగే కొనసాగిస్తే కూడా రాజ్యాంగ పరమైన చిక్కులు ఎదురయ్యే అవకాశం ఉంది. దీనికి ఏం చేయాలనేదానిపై మంతనాలు జరుపుతున్నారు. ఎలా ముందుకు వెళితే మనకు ప్రయోజనం ఉంటుందనే కోణంలో చర్చలు కొనసాగిస్తున్నారు.
జాతీయ పార్టీ ఏర్పాటులో కేసీఆర్ కు ఆదిలోనే హంసపాదు ఎదురవుతోంది. న్యాయపరమైన చిక్కులు కలవరపెడుతున్నాయి. అన్నిటిని పరిగణనలోకి తీసుకుని ప్రస్తుతం ఏం స్టెప్ వేయాలనే దానిపై కూలంకషంగా చర్చిస్తున్నారు. జాతీయ పార్టీ ఏర్పాటుతో కేంద్రంలో చక్రం తిప్పాలని చూస్తున్నారు. దీనికోసమే సర్వశక్తులు ఒడ్డుతున్నారు. దసరా రోజునే పార్టీ ప్రకటన చేయాలని భావిస్తున్నా దానికి ఎదురయ్యే ఇబ్బందుల దృష్ట్యా ఏ నిర్ణయం తీసుకుంటారో తెలియడం లేదు. పార్టీ పేరు ప్రకటించి అందరిలో నూతనోత్తేజం నింపాలని భావిస్తున్నారు.

కేసీఆర్ మూడో కూటమి ప్రయత్నాల్లో భాగంగా పలు రాష్ట్రాల్లో పర్యటించి నేతలను కలిసి వారి మద్దతు కోరారు. బీజేపీయేతర ప్రభుత్వం కోసం అందరు కలిసి రావాలని అడిగారు. ఇప్పటికే తమిళనాడు, కేరళ, కర్ణాటక, మహారాష్ట్ర, ఢిల్లీ, ఉత్తరప్రదేశ్, పశ్చిమ బెంాల్ వంటి రాష్ట్రాల్లో పర్యటించి తమతో కలిసి రావాలని ప్రార్థించారు. దేశ ప్రయోజనాల కోసం మూడో కూటమి అవసరాలను గుర్తించాలన్నారు. దీంతో థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు అనివార్యమని వారికి చెప్పారు. వారు కూడా అందుకు సరే అనడంతో ఇక పార్టీ ఏర్పాటు దిశగా పావులు కదుపుతున్నారు. ఇందులో ఎదురయ్యే సమస్యలను ఎదుర్కొని ఏ మేరకు నిలబడతారో వేచి చూడాల్సిందే.