https://oktelugu.com/

కశ్మీర్ కు ఎన్నికలతో సమస్య పరిష్కారమయ్యేనా?

కాశ్మీర్ సమస్యపై కేంద్రం దృష్టి సారించింది. ఈమేరకు ప్రధాని నరేంద్ర మోడీ ఆధ్వర్యంలో పలు పార్టీల ముఖ్య నేతలతో అఖిలపక్షం సమావేవం నిర్వహించారు. ఇందులో నలుగురు మాజీ ముఖ్యమంత్రులు ఫరూక్ అబ్దుల్లా (నేషనల్ కాన్ఫరెన్స్), మెహబూబా ముఫ్తీ (పీడీపీ), గులాం నబీ ఆజాద్ (కాంగ్రెస్)తో పాటు పీసీసీ చీఫ్ జి.ఎ.మిద్, జమ్ముకశ్మీర్ అప్నీ పార్టీ అధ్యక్షుడు అల్తాఫ్ బుఖారీ, పీపుల్స్ కాన్ఫరెన్స్ నేత సజ్జాద్ లోనె, బీజేపీ సీనియర్ నేత రవీందర్ రైనా, సీపీఎం నాయకుడు మహమ్మద్ […]

Written By:
  • Sekhar Katiki
  • , Updated On : July 6, 2021 / 10:53 AM IST
    Follow us on

    కాశ్మీర్ సమస్యపై కేంద్రం దృష్టి సారించింది. ఈమేరకు ప్రధాని నరేంద్ర మోడీ ఆధ్వర్యంలో పలు పార్టీల ముఖ్య నేతలతో అఖిలపక్షం సమావేవం నిర్వహించారు. ఇందులో నలుగురు మాజీ ముఖ్యమంత్రులు ఫరూక్ అబ్దుల్లా (నేషనల్ కాన్ఫరెన్స్), మెహబూబా ముఫ్తీ (పీడీపీ), గులాం నబీ ఆజాద్ (కాంగ్రెస్)తో పాటు పీసీసీ చీఫ్ జి.ఎ.మిద్, జమ్ముకశ్మీర్ అప్నీ పార్టీ అధ్యక్షుడు అల్తాఫ్ బుఖారీ, పీపుల్స్ కాన్ఫరెన్స్ నేత సజ్జాద్ లోనె, బీజేపీ సీనియర్ నేత రవీందర్ రైనా, సీపీఎం నాయకుడు మహమ్మద్ తారిగామి, పాంథర్స్ పార్టీ అధ్యక్షుడు భీంసింగ్, కేంద్ర సహాయ మంత్రి జితేంద్ర సింగ్, గవర్నర్ మనోజ్ సిన్హా, కేంద్రమంత్రి అమిత్ షా తదితరులు హాజరయ్యారు.

    370 రద్దుపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమైనా ప్రజాస్వామ్య పునరుద్ధరణ అంశంపై ఏకాభిప్రాయం వ్యక్తమవుతోంది. 2019 ఆగస్టు 5న 370 అధికరణ రద్దు, రాష్ర్ట విభజన, కేంద్ర పాలిత ప్రాంతంగా ప్రకటన అనంతరం ఈ సమావేశం నిర్వహించారు. ప్రజాస్వామ్య పునరుద్ధరణకు ప్రభుత్వం నడుంబిగించి పార్టీల మధ్య సఖ్యతకు కృషి చేస్తోంది.

    రాస్ర్ట విభజనకు ముందు అసెంబ్లీలో 87 సీట్లు ఉన్నాయి. మరో 24 సీట్లు పాక్ ఆక్రమిత కాశ్మీర్ (పీవోకే)కు కేటాయించారు.2019 ఆగస్టులో రాష్ర్ట విభజన అనంతరం లద్దాఖ్ ను కేంద్రపాలిత ప్రాంతంగా ప్రకటించి నాలుగు సీట్లు కేటాయించారు. కశ్మీర్ లోయలో 46, జమ్ములో 37 కలిపి మొత్తం 83 సీట్లున్నాయి.2014 డిసెంబర్ లో జరిగిన ఎన్నికల్లో పీడీపీ 28, బీజేపీ 25, నేషనల్ కాన్ఫరెన్స్ 15, కాంగ్రెస్ 12 సీట్లు సాధించాయి. రాష్ర్టం జమ్ము, కశ్మీర్ గా విడిపోయింది. కశ్మీర్ లో ముస్లింలు, జమ్ములో హిందువుల ప్రాబల్యం ఎక్కువ.

    2011 జనాభా లెక్కల ప్రకారం కశ్మీర్ జనాభా68,88,475, కాగా జమ్ము జనాభా53,75,536. నియోజకవర్గాల పునర్విభజన కోసం సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ రంజనా ప్రకాశ్ దేశాయ్ సారథ్యంలో కమిటీని ఏర్పాటు చేశారు. ఈ కమిటీ తాత్కాలిక అంచనాల ప్రకారం కశ్మీర్ లో నాలుగు, జమ్ములో మూడు సీట్లు పెరిగే అవకాశాలున్నాయి. దీంతో ముస్లింపార్టీలైన పీడీపీ, ఎన్ సీ వ్యతిరేకిస్తున్నాయి.

    బీజేపీ మరో రకంగా వ్యూహాలు రచిస్తోంది. కాంగ్రెస్ ను దేశంలో లేకుండా చేయాలని చూస్తోంది. ఇందుకు జమ్ములో మెజార్టీ సీట్లు తన ఖాతాలో వేసుకోవాలని భావిస్తోంది. కశ్మీర్ లో పీడీపీ, ఎన్ సీ మధ్య ఓట్లు చీలి చివరికి తమకే లాభం చేకూరుతుందని చూస్తోంది. చిన్న పార్టీల సహకారంతో అధికారం హస్తగతం చేసుకోవాలనే ఉద్దేశంతో పావులు కదువుపుతున్నట్లు తెలుస్తోంది.