ESMA: ఆంద్రప్రదేశ్ లో ముఖ్యమంత్రి జగన్ ఒంటెద్దు పోకడ పోతున్నారు. ఏకపక్ష నిర్ణయాలతో శత్రువులను తయారు చేసుకుంటున్నారు. రాజకీయాల్లో శాశ్వత మిత్రులు, శాశ్వత శత్రువులు ఉండరనేది నిజమే. కానీ ఆయన మాత్రం ఉద్యోగులతో పెట్టుకుంటున్నారు. దీంతో వచ్చే ఎన్నికల్లో ఆయనకు భంగపాటు తప్పదనే వాదనలు వినిపిస్తున్నాయి. గత ఎన్నికల్లో తామే గెలిపించామని ఉద్యోగులు పలుమార్లు ప్రకటించిన సంగతి తెలిసిందే. కానీ ఆయనలో మాత్రం మార్పు రావడం లేదు. దీంతో ఉద్యోగులకు జగన్ కు మధ్య సఖ్యత కనిపించే అవకాశాలు కనిపించడం లేదు. రాబోయే ఎన్నికల్లో ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్లు అందరు వ్యతిరేకంగా ఓటు వేస్తే ఓటమి తప్పదనే విషయం తెలిసినా జగన్ మాత్రం తన పంతం వీడటం లేదు.
తాను పట్టిన కుందేలుకు మూడే కాళ్లంటే కుదరదు. విషయం అన్నాక కాస్త పట్టువిడుపులు ఉండాలి. అప్పుడే మనకు ఏదైనా కలిసి వస్తుంది. అంతే కానీ నేను చెప్పినట్లు వినాలని మొండి వైఖరి అవలంభిస్తే మొదటికే మోసం వస్తుందని తెలుసుకోవాలి. లేకపోతే మనుగడ కష్టమే. ఏపీలో జగన్ ఉద్యోగుల విషయంలో బేషజాలకు పోవడంతో సమస్య జఠిలమవుతోంది. చివరకు ఆయనకు వ్యతిరేకంగా ఉద్యోగులు సమ్మె చేసేందుకు నిర్ణయించుకున్నారు. దీంతో ఎవరికి నష్టం. ఎవరి పరువు పోతుంది అనే విషయాలు పట్టించుకోవడం లేదు.
ప్రభుత్వం వారించినా చలో విజయవాడ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించి సవాలు విసిరారు. అయినా జగన్ లో మార్పు రావడం లేదు. ప్రభుత్వం ఆంక్షలు విధించినా ఉద్యోగులు ఎలా విజయవాడ చేరుకున్నారని డీజీపీని ప్రశ్నించినట్లు తెలుస్తోంది. కానీ జగన్ మాత్రం ఇవి పట్టించుకోవడం లేదు. ఫలితంగానే విమర్శలు ఎదుర్కొంటున్నారు. ఉద్యోగుల ఆగ్రహానికి కారణమవుతున్నారు. అయినా తన మాట నెగ్గాలని భావించడంపై ఉద్యోగులు నిరసన వ్యక్తం చేస్తున్నారు.తమ డిమాండ్లు తీర్చాల్సిందేనని చెబుతున్నారు.
Also Read: తగ్గడమే బెస్ట్.. ఉద్యోగ సంఘాలను చర్చల దిశగా బతిమాలుతున్న జగన్ సర్కార్..!
గతంలో ముఖ్యమంత్రులుగాచేసిన వారు కూడా ఉద్యోగుల విషయంలో ఇంత రాద్దాంతం చేయలేదు. సమస్య పరిష్కారానికే ప్రాధాన్యం ఇచ్చారు. దీంతో వివాదాలు లేకుండా చూసుకున్నారు.ఇదే సరైన పద్ధతి. కానీ వారితో గొడవలకు దిగితే ప్రభుత్వానికే ఇబ్బందులు తలెత్తుతాయన్నది జగన్ కు తెలియడం లేదా? తప్పును సరిదిద్దుకునే ప్రయత్నం చేయకుండా సమస్యను మరింత పెద్దదిగా చేసుకుంటూ తన ప్రతిష్టను మరోమారు మసకబారేలా చేసుకోవడం అవివేకం. జగన్ లో ఇప్పటికైనా మార్పు వచ్చి ఉద్యోగుల సమస్యలు పరిష్కరించి వారిని సమ్మె చేయకుండా చూడటమే ఆయన ముందున్న లక్ష్యం అని తెలుసుకుంటే మంచిది.
అయితే జగన్ మాత్రం ఉద్యోగులపై ఎస్మా ప్రయోగించేందుకే నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. ఇదే జరిగితే జగన్ పై వ్యతిరేకత ఇంకా ఎక్కువ అవుతుంది. రాబోయే ఎన్నికల్లో వైసీపీని అధికారానికి దూరం చేసేందుకే ఉద్యోగులు ప్రాధాన్యం ఇస్తే పరిస్థితి కలిసి రాదని తెలుసుకోవాలి. ఉద్యోగుల డిమాండ్లు నెరవేర్చితేనే జగన్ కు అంతా కలిసి వస్తుందని పలువురి వాదన.కానీ జగన్ ఏ మేరకు నిర్ణయం తీసుకుంటారో తెలియడం లేదు.
Also Read: రోజా రాజీనామాకు రెడీయేనా?