https://oktelugu.com/

టీవీ9 దేవి గురించి ఈ విషయాలు తెలిస్తే షాక్ అవ్వాల్సిందే?

బిగ్ బాస్ షోకు టీవీ9కు ఉన్న అనుబంధం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. గత రెండు సీజన్ల నుంచి టీవీ9కు చెందిన యాంకర్ ఎవరో ఒకరు బిగ్ బాస్ షోలో పాల్గొంటున్న సంగతి తెలిసిందే. తాజాగా అదే సెంటిమెంట్ ను కొనసాగిస్తూ బిగ్ బాస్ షోలోకి రాజమండ్రికి చెందిన దేవీ నాగవల్లి ఎంట్రీ ఇచ్చారు. టీవీ యాంకర్ గా దేవీ నాగవల్లి తెలుగు రాష్ట్రాల ప్రజలకు సుపరిచితమైనా ఆమె వ్యక్తిగత విషయాల గురించి ఎవరికీ పెద్దగా […]

Written By: , Updated On : September 7, 2020 / 08:22 PM IST
shocked to know these things about TV9 Devi

shocked to know these things about TV9 Devi

Follow us on

tv9 devi
బిగ్ బాస్ షోకు టీవీ9కు ఉన్న అనుబంధం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. గత రెండు సీజన్ల నుంచి టీవీ9కు చెందిన యాంకర్ ఎవరో ఒకరు బిగ్ బాస్ షోలో పాల్గొంటున్న సంగతి తెలిసిందే. తాజాగా అదే సెంటిమెంట్ ను కొనసాగిస్తూ బిగ్ బాస్ షోలోకి రాజమండ్రికి చెందిన దేవీ నాగవల్లి ఎంట్రీ ఇచ్చారు. టీవీ యాంకర్ గా దేవీ నాగవల్లి తెలుగు రాష్ట్రాల ప్రజలకు సుపరిచితమైనా ఆమె వ్యక్తిగత విషయాల గురించి ఎవరికీ పెద్దగా తెలియదు.

Also Read : ఫ్లాష్: సినీ నటుడు జయప్రకాష్ రెడ్డి కన్నుమూత

జర్నలిజాన్ని ఎంతో ఇష్టపడే దేవీ నాగవల్లి హెయిర్ స్టైల్ కానీ వస్త్రధారణ కానీ భిన్నంగా ఉంటుంది. మాస్ కమ్యూనికేషన్ లో డిప్లమో చేసిన దేవీ నాగవల్లి తన ప్రతిభతో టీవీ9లో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ఎంతటి రాజకీయ నాయకుడైనా సినిమా స్టార్ అయినా సూటిగా ప్రశ్నించేతత్వం ఉన్న దేవీ నాగవల్లి నిజ జీవితంలోను ముక్కుసూటిగా వ్యవహరిస్తుందనే పేరుంది. బిగ్ బాస్ షో స్టేజ్ పై నాగార్జునను ప్రశ్నలు వేసి దేవి తన ప్రవర్తన అవతలి వ్యక్తులతో ఎలా ఉంటుందో స్పష్టంగా అర్థమయ్యేలా చేశారు.

అయితే అదే స్టేజ్ పై తనకు సంబంధించిన కీలక విషయాలను దేవీ నాగవల్లి చెప్పుకొచ్చారు. దేవీ నాగవల్లి చూడటానికి చిన్న అమ్మాయిలా కనిపించినా తనకు పెళ్లి అయిందని భర్తతో విడిపోయానని… ఆరు సంవత్సరాల బాబు ఉన్నాడని తెలిపారు. కొన్ని సంవత్సరాల పాటు తాను అమెరికాలో ఉన్నానని వివిధ కారణాల వల్ల అక్కడి నుంచి ఇండియాకు తిరిగొచ్చేశానని ఆమె చెప్పుకొచ్చారు. తాను డబ్బు కోసమే ఈ షోకు వచ్చానని ఖచ్చితంగా విన్నర్ అవుతానని దేవి వ్యాఖ్యానించడం గమనార్హం.

మరి దేవి ఆమె అనుకున్న విధంగా చివరి వరకు బిగ్ బాస్ షోలో నిలిచి విజయం సాధిస్తుందా…? లేక మధ్యలోనే షో నుండి వెళ్లిపోతుందా…? చూడాల్సి ఉంది.

Also Read : బిగ్ బాస్ 4 : ఈ సారి వారిదే డామినేషన్