కేంద్రం ఆ నిర్ణయాన్ని రాష్ట్రాలకే వదిలేస్తుందా..!

కరోనా వైరస్ వ్యాప్తిని నివారణకు దేశంలో గత నెల 23 నుంచి ఈ నెల 14వ తేదీ వరకూ కేంద్ర ప్రభుత్వం లాక్ డౌన్ ను విధించింది. లాక్ డౌన్ ముగింపు గడువు సమీపిస్తుండటంతో లాక్ డౌన్ ను కొనసాగించాలా లేక ఎత్తివేయాలా అనే అంశంపై కేంద్రం అందరి సలహాలను సేకరిస్తోంది. కొందరు కొనసాగించాలని, మరి కొందరు ఎత్తివేయాలని కోరుతుండటంతో లాక్ డౌన్ పై నిర్ణయాన్ని రాష్ట్రాలకే వదిలేసే ఆలోచనలో కేంద్రం ఉన్నట్టుగా తెలుస్తోంది. ఈ క్రమంలో […]

Written By: Neelambaram, Updated On : April 12, 2020 7:34 pm
Follow us on


కరోనా వైరస్ వ్యాప్తిని నివారణకు దేశంలో గత నెల 23 నుంచి ఈ నెల 14వ తేదీ వరకూ కేంద్ర ప్రభుత్వం లాక్ డౌన్ ను విధించింది. లాక్ డౌన్ ముగింపు గడువు సమీపిస్తుండటంతో లాక్ డౌన్ ను కొనసాగించాలా లేక ఎత్తివేయాలా అనే అంశంపై కేంద్రం అందరి సలహాలను సేకరిస్తోంది. కొందరు కొనసాగించాలని, మరి కొందరు ఎత్తివేయాలని కోరుతుండటంతో లాక్ డౌన్ పై నిర్ణయాన్ని రాష్ట్రాలకే వదిలేసే ఆలోచనలో కేంద్రం ఉన్నట్టుగా తెలుస్తోంది.

ఈ క్రమంలో కరోనా కట్టడికి దేశాన్ని మూడు జోన్లుగా విభజించాలనే ప్రతిపాధిస్తోంది. ఈ జోన్ లలో గ్రీన్, ఆరెంజ్, రెడ్ జోన్లుగా ఉంటాయి. కరోనా ప్రభావం తీవ్రంగా ఉండే రెడ్ జోన్లలో పూర్తి స్థాయి ఆంక్షలు. ఆరెంజ్ జోన్ లో పరిమిత స్థాయిలో ఆంక్షలు. కరోనా కేసులు ఒక్కటి కూడా లేని గ్రీన్ జోన్ లో ఆంక్షలు పూర్తిగా ఎత్తువేసే ఆలోచనను సూచిస్తుంది. లాక్ డౌన్ పై త్వరలోనే కొత్త మార్గదర్శకాలు విడుదల చేసేందుకు కేంద్రం కసరత్తు చేస్తోంది. లాక్ డౌన్ ఎత్తివేస్తే ఉత్పన్నమయ్యే సమస్యలు, వాటి పరిష్కారానికి తీసుకోవాల్సిన చర్యలు ఈ మార్గదర్శకాలలో పేర్కొనే అవకాశం ఉందని చెబుతున్నారు.

మరోవైపు కరోనా సమస్య తీవ్రంగా ఉన్న స్పెయిన్ లాక్ డౌన్ ను ఈ నెల 25 వరకూ పొడిగించింది. ఇటలీలో ఈ నెల 13 తో లాక్ డౌన్ ముగుస్తుండగా మరో రెండు వారాలు పొడిగించింది. భారత ప్రభుత్వం లాక్ డౌన్ గురించి ఇంకా తన నిర్ణయాన్ని ప్రకటించ లేదు. మన దేశంలో పరిస్థితి అంత తీవ్రంగా లేకపోయినా కరోనా వ్యాప్తి పెరిగిందని కేంద్రం విడుదల చేస్తున్న గణాంకాలు చెబుతున్నాయి.వారం రోజుల కిందట రోజుకు సుమారు 500 మంది కొత్తగా కరోనా బారిన పడుతుంటే ప్రస్తుతం ఆ సంఖ్య వెయ్యికి పెరిగింది. ఈ పరిస్థితుల్లో కేంద్రం నిర్ణయం కీలకంగా మారింది.

కేంద్రం తీసుకునే నిర్ణయం ఏదైనా తమ రాష్ట్రా పరిధిలో ఈనెలాఖరు వరకు లాక్‌డౌన్‌ను పొడిగించాలని దేశంలోని ఏడు రాష్ట్రాలు నిర్ణయించాయి. వీటిలో అందులో ఆరు రాష్ట్రాలు బీజేపీయేతర పాలిత ప్రాంతాలైతే, బీజేపీ ఏలుబడిలో ఉన్న కర్ణాటక కూడా ప్రధాని నిర్ణయంతో సంబంధం లేకుండా లాక్‌డౌన్‌ను పొడిగిస్తూ నిర్ణయం తీసుకోవడం గమనార్హం. కాకపోతే వ్యవసాయ, పారిశ్రామిక రంగాకు కొన్ని మినహాయింపు ఇస్తూ సీఎం యడ్యూరప్ప ఈ నిర్ణయం తీసుకున్నారు. పంజాబ్‌, ఒడిశా రాష్ట్రాలు ప్రధానితో సీఎం వీడియోకాన్ఫరెన్స్‌కు ముందే ఈ ప్రకటన చేయగా, తాజాగా తెలంగాణ, కర్ణాటక, రాజస్థాన్‌, మహారాష్ట్ర, పశ్చిమబెంగాల్‌ రాష్ట్రాలు పొడిగింపు నిర్ణయం తీసుకున్నాయి. లాక్‌డౌన్‌ సడలింపుపై కేంద్రమే స్పష్టమైన నిర్ణయం తీసుకోవాలుని సీఎం లంతా ప్రధానికి సూచిస్తునే, అంతకు ముందే ఆయా రాష్ట్రాల ముఖ్యమంత్రులు పొడిగింపు ప్రకటన చేయడం గమనార్హం.