బీజేపీ ప్రతిపక్ష స్థానాన్ని భర్తీ చేస్తోందా?

ఆంధ్రప్రదేశ్ లో బీజేపీ ఒక్కసారిగా తన గ్రాఫ్ ను పెంచుకుంది. కరోనా వైరస్ సమస్య ప్రారంభమైన నాటినుంచి ఆ పార్టీ నాయకులు పలు ఏదో ఒక అంశంపై స్పందిస్తూనే ఉన్నారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ ప్రతీ రోజు ముఖ్యమంత్రికి, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కి లేఖలు రాస్తూ వస్తున్నారు. మొక్కజొన్న పంటకు మద్దతు ధర, లాక్ డౌన్ సమయంలో రైతుల సమస్యలపై, నమోదు పాజిటివ్ కేసులపై శ్వేతపత్రం విడుదల చేయడం, అన్నవారంలో క్వారంటైన్ కేంద్రం […]

Written By: Neelambaram, Updated On : April 21, 2020 3:37 pm
Follow us on

ఆంధ్రప్రదేశ్ లో బీజేపీ ఒక్కసారిగా తన గ్రాఫ్ ను పెంచుకుంది. కరోనా వైరస్ సమస్య ప్రారంభమైన నాటినుంచి ఆ పార్టీ నాయకులు పలు ఏదో ఒక అంశంపై స్పందిస్తూనే ఉన్నారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ ప్రతీ రోజు ముఖ్యమంత్రికి, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కి లేఖలు రాస్తూ వస్తున్నారు. మొక్కజొన్న పంటకు మద్దతు ధర, లాక్ డౌన్ సమయంలో రైతుల సమస్యలపై, నమోదు పాజిటివ్ కేసులపై శ్వేతపత్రం విడుదల చేయడం, అన్నవారంలో క్వారంటైన్ కేంద్రం ఏర్పాట్లు వంటి తదితర అంశాలపై లేఖలు రాశారు. ప్రభుత్వం ర్యాపిడ్ టెస్ట్ కిట్ ల కొనుగోలు అంశంపై కన్నా ట్విట్, ఆపై విజయసాయి రెడ్డి కన్నాపై అమ్ముడుపోయాయని విమర్శలు చేయడంతో ఈ అంశాన్ని బీజేపీ అందిపుచ్చుకుంది.

కిట్ ల వ్యవహారం పై తొలుత టీడీపీ బయటకు తీసుకురావడంలో, క్యాష్ చేసుకోవడంలో ప్రధాన ప్రతిపక్ష పార్టీ అయిన టీడీపీ వెనుకబడింది. బిజెపి అధ్యక్షుడు కన్నాపై విజయసాయి రెడ్డి ఆరోపణలపై కన్నా మీడియా సమావేశం నిర్వహించడం, అనంతరం ఆ పార్టీ నాయకులు సుజనా చౌదరి, ఎమ్మెల్సీ మాధవ్, మాజీ మంత్రి రావెల కిషోర్ బాబు, అనుబంధ సంఘాల నాయకులు సైతం విజయసాయి వ్యాఖ్యలను ఖండించారు. కన్నా ట్విట్టర్ వేదికగా ఎంపీ విజయ సాయి రెడ్డిని ఉతికేశారు. ఎంపీ మాత్రం స్పందించలేదు.

ఎంపీ విజయసాయి రెడ్డి చేసిన ఆరోపణలపై బీజేపీ చాలా తీవ్రంగా స్పందించింది. అధికార వైసీపీ మాత్రం ఏ విషయంలో బీజేపీ నాయకులు లేవనెత్తిన అంశాలపై స్పందించలేదు. కిట్ ల కొనుగోలు విషయంలో వైద్య ఆరోగ్య శాఖ కమిషనర్ మీడియా కు వివరణ ఇచ్చారు. రాజకీయంగా ఈ విషయంలో వైసీపీ వెనక్కి తగ్గడంపై ఆ పార్టీ నాయకులు సైతం తప్పు బడుతున్నారు.