దేశంలో రాజకీయ సమీకరణలు మారుతున్నాయి. బీజేపీ ఆంధ్రప్రదేశ్ లో బలపడేందుకు పావులు కదుపుతోంది. 2014లో బీజేపీ, టీడీపీ, జనసేనతో కలిసి పోటీ చేసింది. 2019లో ఎవరికి వారే పోటీ చేశారు. జగన్ అధికారంలోకి వచ్చారు. భవిష్యత్ వ్యూహాల్లో భాగంగా బీజేపీ జన సేనానితో మైత్రి కోరుకుంది. ఆంధ్రప్రదేశ్ లో నాటి బీజేపీ చీఫ్ కన్నా లక్ష్మినారాయణతో కలిసి రాష్ర్ట వ్యవహారాల ఇన్ చార్జి, జనసేనతో కలిసి కార్యక్రమాలు చేపడతామని పంచాయతీ నుంచి పార్లమెంట్ దాకా పొత్తు కొనసాగిస్తామని పేర్కొన్నారు.
కానీ ఆచరణలో మాత్రం ఇప్పటి వరకు రెండు పార్టీలు కలిసి ఏ ఆందోళనలోనూ పాల్గొనలేదు. తిరుపతి ఉప ఎన్నికలో మాత్రమే కలిసి పనిచేశారు. బీజేపీ, జనసేన పొత్తు ఖరారైన తరువాత పవన్ కల్యాణ్ ఒకేసారి కేంద్రమంత్రి అమిత్ షాతో కలిశారు. ప్రధానితో అయితే ఇప్పటివరకు సమావేశం కాలేదు. ఇతర పార్టీల నాయకులకు ఇస్తున్న విలువ పవన్ కు దక్కాలని కార్యకర్తలు భావిస్తున్నారు.
తెలంగాణ బీజేపీ నేతలు మాత్రం జనసేన నేతలపై ఘాటు వ్యాఖ్యలు చేశారు.ఎమ్మెల్సీ ఎన్నికల్లో తాము పీవీ కుమార్తెకు మద్దతిస్తామని ప్రకటించారు. జాతీయ నేతలు గౌరవం ఇస్తున్నా తెలంగాణ నేతల తీరుపై వవన్ అసహనం వ్యక్తం చేశారు. ఖమ్మం, వరంగల్ మున్సిపల్ ఎన్నికల్లో కలిసి పోటీ చేశారు. ఏపీలో పవన్ చరిష్మా తమకు కలిసొస్తుందని బీజేపీ జనసేనతో పొత్తు పెట్టుకుంది. తిరుపతి ఉప ఎన్నికలో ప్రచారానికి పవన్ వెళ్లిన రోజు స్పందన బాగానే వచ్చింది.
కేంద్రం కొద్ది రోజులుగా సీఎం జగన్ కు సముచిత ప్రాధాన్యం ఇస్తున్నట్లు తెలుస్తోంది. కేంద్ర మంత్రులతో అపాయింట్ మెంట్లు తీసుకుంటూ గంటల కొద్దీ భేటీలు కొనసాగిస్తున్నారు. మిత్రపక్షమైన జనసేన అధినేతకు ఇప్పటివరకు ఏ రకమైన సమావేశాలు లేకుండా పోయాయి. దీంతో జనసేన కార్యకర్తల్లో నైరాశ్యం నెలకొంది.
ఏపీలో టీడీపీ స్థానాన్ని తాము దక్కించుకోవాలనే ఉద్దేశంతో బీజేపీ పవన్ పొత్తు పెట్టుకోవాలని చూసింది. తిరుపతి ఉప ఎన్నికసమయంలోనూ బీజేపీతో కాకుండా ఒంటరిగా పోటీ చేద్దామని జనసైనికుల నుంచి ఒత్తిడి వచ్చింది. గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల సమయంలోనూ జనసేన మద్దతు ఇచ్చింది. దీంతో బీజేపీ, జనసేన పార్టీలు కలిసి ఉన్నా ఎక్కడ కూడా ఆందోళనలు మాత్రం చేయలేదు.