షర్మిల ప్రభావం తెలంగాణలో అంతుందా?

జనం మెచ్చిన నాయకులుంటారు. ప్రజల నుంచి వచ్చిన నేతలుంటారు. పక్కా మాస్ లీడర్ గా గుర్తింపు తెచ్చుకుని ప్రజల్లో పది కాలాల పాటు నిలిచిపోతుంటారు. ఇలాంటి కోవలో నిలిచే నాయకుల్లో ఎన్టీఆర్, వైఎస్సార్ ముఖ్యులు. రెండు ప్రాంతాల్లో తమ అభిమానులను పెద్ద ఎత్తున పెంచుకున్నారు. వారి మరణానంతరం కూడా వారి గుండెల్లో హాయిగా నిద్రపోతున్నారు. తెలంగాణ, ఏపీల్లో ప్రాంతాలకతీతంగా తమ ఉణికి చాటుకున్నారు. దీంతో వారు రాజకీయాలను ప్రభావితం చేస్తున్నారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి మరణానంతరం ఆగిన […]

Written By: Srinivas, Updated On : July 7, 2021 11:11 am
Follow us on

జనం మెచ్చిన నాయకులుంటారు. ప్రజల నుంచి వచ్చిన నేతలుంటారు. పక్కా మాస్ లీడర్ గా గుర్తింపు తెచ్చుకుని ప్రజల్లో పది కాలాల పాటు నిలిచిపోతుంటారు. ఇలాంటి కోవలో నిలిచే నాయకుల్లో ఎన్టీఆర్, వైఎస్సార్ ముఖ్యులు. రెండు ప్రాంతాల్లో తమ అభిమానులను పెద్ద ఎత్తున పెంచుకున్నారు. వారి మరణానంతరం కూడా వారి గుండెల్లో హాయిగా నిద్రపోతున్నారు. తెలంగాణ, ఏపీల్లో ప్రాంతాలకతీతంగా తమ ఉణికి చాటుకున్నారు. దీంతో వారు రాజకీయాలను ప్రభావితం చేస్తున్నారు.

వైఎస్ రాజశేఖర్ రెడ్డి మరణానంతరం ఆగిన గుండెల్లో తెలంగాణ వారే ఎక్కువగా ఉన్నారనడంలో అతియోక్తి కాదు. ఆయన అంటే అంత అభిమానం ప్రజల గుండెల్లో నిలిచి ఉంది. కుల మతాలకతీతంగా అన్ని వర్గాల్లో తమదైన ముద్ర వేశారు. ప్రస్తుతం వైఎస్ షర్మిల సైతం తెలంగాణ ప్రజలను తమ వైపు తిప్పుకునేందుకు పావులు కదుపుతున్నారు. తన తండ్రి ఆశయ సాధనకే ప్రాధాన్యత ఇస్తున్నట్లు పేర్కొన్నారు.

తెలంగాణలో 119 నియోజకవర్గాల్లో 72 వాటిల్లో వైఎస్ అభిమానులున్నారని తెలుస్తోంది. దీంతో షర్మిల తెలంగాణ వ్యాప్తంగా సర్వే చేయించారు. ఆసక్తికర విషయాలు వెలుగుచూశాయి. తన తండ్రి పట్ల ఇప్పటికి జనంలో మంచి అభిప్రాయమే ఉందని తెలుసుకున్నారు. వైఎస్సార్ అంటే పడి చచ్చే వారు ఇప్పటికి ఉన్నారు. ఇన్నాళ్లు ఏపీలోనే వైఎస్ గురించి సర్వేలు చేశారు. కానీ తెలంగాణలో ఎవరు చేయలేదు. దీంతో ఆయన స్థానంపై జనంలో ఉన్న ప్రేమపై ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.

మరో పక్క పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ ఆస్తి అని ప్రకటించడం వెను ఆంతర్యమిదే అని విశ్లేషకులు భావిస్తున్నారు. వైఎస్సార్ ప్రస్తావన లేకుండా గతంలో ఎన్నికలకు వెళ్లి దెబ్బతిన్న కాంగ్రెస్ పార్టీ ఈసారి ఆయన ఫొటోతోనే ప్రచారం చేయాలని చూస్తోంది. షర్మిల పార్టీ ప్రకటించి వైఎస్ అభిమానులను తమ వైపు తిప్పుకుంటే కాంగ్రెస్ కే నష్టం సంభవించే అవకాశాలున్నాయి.

వైఎస్ రాజశేఖర్ రెడ్డి జపం చేస్తూ రేవంత్ రెడ్డి కూడా జై కొడుతున్నారు. షర్మిల పార్టీ ప్రకటించాక పాదయాత్రలో తటస్తులను తమ వైపు తిప్పుకుంటే కేసీఆర్ కు కూడా చావుదెబ్బ తగులుతుందని సర్వేలు స్పష్టం చేస్తున్నాయి. ఈనేపథ్యంలో షర్మిల చేపట్టే పాదయాత్రతో వైఎస్ అభిమానులను ఏ మేరకు ఆకట్టుకుంటారోనని అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.