Homeజాతీయ వార్తలుRevanth Reddy Padayatra: రేవంత్‌ పాదయాత్ర ఉంటుందా.. లేదా!? 

Revanth Reddy Padayatra: రేవంత్‌ పాదయాత్ర ఉంటుందా.. లేదా!? 

Revanth Reddy Padayatra: తెలంగాణలో వెంటిలేషన్‌పై ఉన్న కాంగ్రెస్‌ను సరైన చికిత్స చేసి శక్తివంతంగా తయారు చేయాలనుకుంటున్నారు టీపీసీసీ చీఫ్‌ రేవంత్‌రెడ్డి. కానీ, ఆయన ప్రయత్నాలకు అడుగడుగునా ఆటంకాలే ఎదురవుతున్నాయి. ఈ క్రమంలో ఎన్నికల ఏడాది రానేవచ్చింది. ఇలాంటి పరిస్థితిలో జెట్‌స్పీడ్‌గా కాంగ్రెస్‌కు శక్తినిచ్చే టానిక్‌ పాదయాత్ర అని భావిస్తున్నారు రేవంత్‌. ఈ క్రమంలో యాత్ర చేయనున్నట్లు కూడా ప్రకటించారు. అయితే పార్టీలో అంతర్గత సంక్షోభంతో యాత్ర సాగుతుందా.. ఆగుతుందా అన్న సందేమాలు వ్యక్తమవుతున్నాయి. ఈ తరుణంలో పాదయాత్రపై బుధవారం ఇవాళ క్లారిటీ రాబోతోంది. షెడ్యూల్‌ కూడా విడుదల చేసే అవకాశం ఉంది. అయితే సేవ్‌ కాంగ్రెస్‌ వాదులుగా చెప్పుకునే నేతలు ఈ యాత్రకు హాజరవుతారా.. లేదా? అన్నదే ఇప్పుడు ప్రశ్న.

Revanth Reddy Padayatra
Revanth Reddy Padayatra

నేడు క్లారిటీ..
రేవంత్‌ రెడ్డి పాదయాత్ర.. తెలంగాణ కాంగ్రెస్‌లో ఎప్పటినుంచో చర్చనీయాంశంగా మారిన అంశం. ఈ యాత్రపై ఇవాళ క్లారిటీ రాబోతోంది. షెడ్యూల్‌ కూడా విడుదల చేసే అవకాశం ఉంది. అయితే సేవ్‌ కాంగ్రెస్‌ వాదులుగా చెప్పుకునే నేతలు ఈ యాత్రకు హాజరవుతారా.. లేదా? రాహుల్‌ పాదయాత్రకు కొనసాగింపుగా హాత్‌ సే హాత్‌ జోడో పేరుతో యాత్ర చేయాలని ఏఐసీసీ నిర్ణయించింది. ఈ కార్యక్రమంపై టీపీసీసీ కార్యవర్గంతోపాటు డీసీసీ అధ్యక్షులకు శిక్షణ కార్యక్రమం నిర్వహించాలని ఆదేశించింది. ఇవాళ ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు బోయినపల్లిలోని గాంధీ ఐడియాలజీ సెంటర్లో జరగనుంది. ఏఐసీసీ నుంచి కీలక నేత హాజరుకాబోతున్నారు. రేవంత్‌రెడ్డి యాత్రతో పాటు సోషల్‌ మీడియా, ఎన్నికల కమిషన్, ధరణి పోర్టల్‌ సహా పలు అంశాలపై చర్చ జరగనుంది.

ఒకే అయితే.. 26న భద్రాచలం నుంచి మొదలు..
రేవంత్‌ పాదయాత్రకు ఒకే అయితే.. ఈనెల 26న భద్రాచలం నుంచి మొదలు పెడతారని తెలుస్తోంది. అయితే దీనిపై ఎలాంటి సమాచారం లేదని.. అంతే కాకుండా ఇవాళ జరిగే మీటింగ్‌కు సంబంధించి కూడా ఎలాంటి సమాచారం లేదని పలువురు నేతలు ఆరోపిస్తున్నారు. ఇదే క్రమంలో పీసీసీ పదవుల మధ్య ఈ మధ్య కాలంలో పెద్ద లొల్లి నడిచింది. దిగ్విజయ్‌ సింగ్‌ వచ్చి.. నేతల అభిప్రాయాలైతే తీసుకున్నారు.. కానీ దానికి సంబంధించి పార్టీలో ఎలాంటి నిర్ణయాలు మార్పులు జరగలేదు. ఇలాంటి టైమ్‌లో పీసీసీతో కలిసి నడిచేదెవరు? పట్టించుకోకుండా పక్కకు పోయేవారెవరు అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి.

Revanth Reddy Padayatra
Revanth Reddy Padayatra

 

అనుమతి ఇవ్వలేదన్న అధిష్టానం..
మరోవైపు దేశంలో రాహుల్‌ యాత్రకు మినహా కాంగ్రెస్‌లో మరెవరికీ యాత్రకు అనుమతి ఇవ్వలేదని ఆ పార్టీ అధిష్టానం స్పష్టం చేసింది. ఈ క్రమంలో రేవంత్‌ పాదయాత్రకు అధిష్టానం అనుమతి తప్పనిసరి. గత అనుభవాల దృష్టా అధిష్టానం ఆశీస్సులు లేకుఉండా యాత్ర మొదలు పెడితే మొదటికే మోసం జరిగే వకాశం ఉంది. ఈనేపథ్యంలో బుధవారం సమావేశం అన్నంతరం యాత్రపై స్పష్టత వస్తుందని కాంగ్రెస్‌ నేతలు పేర్కొంటున్నారు.

Sekhar
Sekhar
Sekhar is an Manager, He is Working from Past 6 Years in this Organization, He Covers News on Telugu Cinema Updates and Looks after the overall Content Management.
Exit mobile version