Homeఆంధ్రప్రదేశ్‌BRS- Jana Sena And TDP: బీఆర్ఎస్ ఎంట్రీ పై టిడిపి, జనసేనలో ఎందుకు మౌనం?

BRS- Jana Sena And TDP: బీఆర్ఎస్ ఎంట్రీ పై టిడిపి, జనసేనలో ఎందుకు మౌనం?

BRS- Jana Sena And TDP: తెలుగునాట విస్తృత చర్చ జరుగుతోంది. కేసీఆర్ బీఆర్ఎస్ ఏపీలో ఎవరికి శత్రువు? ఎవరికి మిత్రువు? ఇప్పుడిదే అంతటా హాట్ టాపిక్. ఏపీలో బీఆర్ఎస్ ఎంట్రీపై మిశ్రమ స్పందన లభిస్తోంది. కొన్ని పార్టీలు ఫైర్ అవుతుండగా.. మరికొన్ని పార్టీలు సైలెంట్ గా పరిణామాలను చూస్తున్నాయి. అయితే పార్టీల రియాక్షన్ వెనుక మాత్రం ఏదో ఆసక్తికర రాజకీయ పరిణామాలు చోటుచేసుకుంటున్నట్టు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. వాస్తవానికి కేసీఆర్ ఏపీలో ఇంతవేగంగా బీఆర్ఎస్ విస్తరణకు దిగుతారని ఎవరూ ఊహించలేదు. సంక్రాంతి తరువాత కార్యాలయం ఓపెన్ చేసి కార్యకలాపాలు ప్రారంభిస్తారని అనుకున్నారు. కానీ పండుగకు ముందే పావులు కదిపారు. నాయకులను చేర్చుకొని నాయకత్వ బాధ్యతలు అప్పగించారు. తోట చంద్రశేఖర్ నాయకత్వంలో చేరికలను మరింత ప్రోత్సాహించడానికి డిసైడ్ అయ్యారు. ముఖ్యంగా గోదావరి జిల్లాల నుంచి వీలైనంతగా నాయకులను కారెక్కించాలని చూస్తున్నారు. అందుకే ఏటా గోదావరి పండుగ సందడికి హాజరయ్యే తెలంగాణ మంత్రి, ఏపీ బీఆర్ఎస్ ఇన్ చార్జి తలసాని శ్రీనివాస్ యాదవ్ ముందుగానే వస్తున్నారు. అటు పండుగ సందడి చూడడంతో పాటు చేరికలపై నేతలతో చర్చిస్తారని సమాచారం.

BRS- Jana Sena And TDP
chandrababu, pawan kalyan and kcr

ఏపీలో కేసీఆర్ కు ఫ్రెండ్లీ ప్రభుత్వం ఉంది. జగన్ రూపంలో మంచి స్నేహితుడు ఉన్నాడు. దీంతో అందరూ ఊహిస్తున్నట్టుగానే బీఆర్ఎస్ ఎంట్రీని వైసీపీ లైట్ తీసుకుంది. పెద్దగా స్పందించిన దాఖలాలు లేవు. అయితే ఉన్నట్టుండి వైసీపీ నేతలు, పేర్ని నాని, కొడాలి నాని ద్వయంతో పాటు మంత్రి ఆర్కే రోజా ఘాటుగా స్పందించారు. బీఆర్ఎస్ ను అసలు తాము సీరియస్ గా తీసుకోవడం లేదని సజ్జల ప్రకటించారు. మంత్రి రోజా ఒక అడుగు ముందుకేసి ఏపీ ప్రజలు కేసీఆర్ కు బుద్ధి చెబుతారని కూడా హెచ్చరించారు. ఒక్కసారిగా వైసీపీ విమర్శల డోసు పెంచడం వెనుక ఏం జరిగింది అని సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. బీఆర్ఎస్ బీజేపీకి వ్యతిరేకంగా పుట్టుకొచ్చింది కాబట్టి భారతీయ జనతా పార్టీ నేతలు సహజంగానే ఫైరవుతారు. ఎప్పటి నుంచో రాజకీయ వైరం..ఆపై విపక్షంలో ఉన్న టీడీపీపై బీఆర్ఎస్ దృష్టిపెట్టినట్టు వార్తలు వస్తున్న దృష్ట్యా చంద్రబాబు అండ్ కో స్పందించాలి. కానీ వారు కూడా లైట్ తీసుకున్నారు. ఏకంగా జనసేన నుంచి నేతలను లాక్కున్నారు కాబట్టి పవన్ స్పందించాలి. కానీ ఆయన కూడా సైలెంట్ గానే ఉన్నారు. ఇప్పుడు వైసీపీ స్పందించడమే కాస్తా అతిగా,అనుమానంగా ఉంది.

బీజేపీ నాయకులు స్పందించారంటే అందుకు ఒక అర్ధం ఉంది. కేసీఆర్ బీఆర్ఎస్ ను స్థాపించిందే బీజేపీకి వ్యతిరేకంగా, పైగా జాతీయ అంశాలను ప్రస్తావిస్తూ ప్రధాని మోదీనే సవాల్ చేస్తున్నారు. దానిపై ఏపీ బీజేపీ నేతలు కూడా ఘాటుగా స్పందించారు. ఎంపీ జీవీఎల్ ప్రెస్ మీట్ పెట్టి కేసీఆర్ పై విరుచుకుపడ్డారు. విభజన సమస్యలపై ఏపీకి అన్యాయం చేస్తూ సుప్రీం కోర్టులో పిటీషన్లు వేసింది కేసీఆర్ కాదా? అని ప్రశ్నించారు. దీంతో మిగతా బీజేపీ నాయకులు వాయిస్ ను అందుకున్నారు. కేసీఆర్ పై శృతిమించి విమర్శలు చేయడం ప్రారంభించారు. అటు ప్రధాన విపక్షాలుగా ఉన్న టీడీపీ, జనసేనలు వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నట్టు తెలుస్తోంది. వైసీపీ పరిస్థితి మాత్రం ముందు నుయ్యి.. వెనక్కి గొయ్యి అన్న చందంగా మారింది. జగన్ కు కేసీఆర్ మంచి మిత్రుడే. అటు బీజేపీ నేతలతోను సన్నిహితంగా ఉంటున్నారు. అందుకే కరవమంటే కప్పకు కోపం.. విడవమంటే పాముకు కోపమని భావించి ఇన్నాళ్లు సైలెంట్ గా ఉన్నారు. ఇప్పుడు బీఆర్ఎస్ ఎంట్రీతో బీజేపీతో జగన్ స్నేహాన్ని గులాబీ నేతలు టార్గెట్ చేసే అవకాశముంది. అందుకే ఎందుకైనా మంచిది ఎదురుదాడి చేస్తే బాగుంటుందన్న నిర్ణయానికి వచ్చి జగన్ తన పార్టీ నేతలతో విమర్శలు చేయిస్తున్నారు.

BRS- Jana Sena And TDP
chandrababu, pawan kalyan and kcr

బీఆర్ఎస్ ఎంట్రీతో దెబ్బపడేది కేవలం టీడీపీ, జనసేనకే. ఎందుకంటే కేసీఆర్ టార్గెట్ చేసింది కాపునేతలనే. గోదావరి జిల్లాల్లోని బలమైన కాపు నేతలను, దళిత బీసీ నేతలను సమీకరిస్తున్నారు. వీరిందరూ ఇన్నాళ్లు టీడీపీ, జనసేనల వెంట ఉన్నారు. కేసీఆర్ దిక్కు మరలితే ఈ రెండు పార్టీలకే నష్టం. అందుకే ఈ విషయంలో ఎలా ముందుకెళ్లాలన్న దానిపై టీడీపీ, జనసేనలు మల్లగుల్లాలు పడుతున్నాయి. అందుకే ఈ విషయంలో మౌనం దాల్చినట్టు తెలుస్తోంది.

Dharma Raj
Dharma Rajhttps://oktelugu.com/
Dharma Raj is a Senior Journalist who has good experience in reporting and had worked with top Media Organizations. He Contributes articles on AP Politics.
Exit mobile version