Raghu Rama: వైసీపీ రెబల్ ఎంపీ రఘురామ కృష్ణం రాజు తన రాజకీయ ప్రస్థానం కొనసాగించేందుకు పలు మార్గాలు అన్వేషిస్తున్నారు. వైసీపీకి రాంరాం చెప్పి పార్టీ మారాలని యోచిస్తున్నట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగానే ఆయన చర్చలు జరుపుతున్నట్లు చెబుతున్నారు. ఇన్నాళ్లు ఢిల్లీలో ఉండి రాజకీయాలు చేసిన రఘురామ దానికి రాజీనామా చేసి ఎన్నికలకు వెళతారనే ప్రచారం జోరందుకుంది. ఈ నేపథ్యంలో జనవరి 7న తన నిర్ణయం ప్రకటిస్తారనే వాదనలు కూడా వినిపిస్తున్నాయి.

వైసీపీలోనే ఉంటూ వారినే తిడుతుండటంతో రెబల్ నేతగా గుర్తింపు పొందిన రఘురామ పార్టీకి రాజీనామా చేసి మళ్లీ గెలిచి తానేమిటో నిరూపించుకోవాలని చూస్తున్నారు. అందుకే బీజేపీ నేతలో సంప్రదింపులు జరుపుతున్నట్లు సమాచారం. బీజేపీలో ఉంటేనే వైసీపీ నేతలను సమర్థంగా ఎదుర్కోవచ్చనే ఉద్దేశంతోనే రఘురామ ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.
Also Read: ముద్రగడ లేఖకు కౌంటర్ వేసిన జనసేన ప్రతినిధి.. మామూలుగా లేదుగా..!
బీజేపీ జనసేన ఇప్పటికే పొత్తులో ఉండటంతో ఎన్నికల వరకు టీడీపీ కూడా కలిసే ఆలోచన ఉండటంతో బీజేపీ అయితేనే సరైన విధంగా ఉంటుందని ఆలోచిస్తున్నారు. దీని కోసమే పార్టీ మారేందుకు కసరత్తు చేస్తున్నట్లు తెలుస్తోంది. దీంతో రాష్ర్టంలో రాబోయే రోజుల్లో రాజకీయ పరిణామాలు ఎలా ఉండబోతున్నాయనే దాని మీద అందరికి అంచనాలు పెరిగిపోతున్నాయి.
అయితే వైసీపీకి గుడ్ బై చెప్పి ఉప ఎన్నికలకు వెళతారా? లేక వైసీపీలోనే ఉంటూ రాజకీయాలు మరో మార్గంలో నడిపిస్తారా? అనే అనుమానాలు అందరిలో వస్తున్నాయి. ఏదిఏమైనా రఘురామ రాజు ఎన్నికల నాటికైనా ఏదో ఒక ట్విస్ట్ ఇచ్చేందుకే రెడీ అవుతున్నట్లు పార్టీ వర్గాల్లో చర్చ సాగుతోంది. పార్టీ మార్పుపై కూడా అనేక వాదనలు వినిపిస్తున్నాయి.
Also Read: జగన్ మీద బాణం ఎక్కు పెడుతున్న షర్మిల.. త్వరలోనే సీబీఐకి లేఖ..?