Priyanka Gandhi: ఉత్తరప్రదేశ్ లో కాంగ్రెస్ దూకుడు పెంచింది. ప్రచారంలో దూసుకుపోతోంది. ఈసారి అధికారం చేజిక్కించుకోవాలని ప్రయత్నిస్తోంది. పూర్తిస్థాయి బాధ్యతలను ఇప్పుడు ప్రియాంక గాంధీ భుజాన వేసుకున్నారు. మంచైనా చెడైనా తనదే బాధ్యత అని చెబుతున్నారు. ఇక్కడ మెజార్టీ స్థానాలు సాధించి సోదరుడికి కానుక ఇవ్వాలని భావిస్తున్నారు. ఇందులో భాగంగా ఇప్పటికే పలు పథకాలు ప్రకటించి ముందకు వెళుతున్నారు. పార్టీ ఇదే తరహాలో ముందుకు సాగితే ప్రత్యర్థి పార్టీలకు చుక్కలు కనిపించడం ఖాయమైనట్లేనని చెబుతున్నారు.

గత ఎన్నికల్లో చేసిన తప్పులు ఈసారి చేయకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ప్రాంతీయ పార్టీలను నమ్మడం లేదు. పూర్తిస్థాయి బాధ్యతలు ప్రియాంక గాంధీ తీసుకున్నారు. దీంతో రాష్ర్టంలో పార్టీని అధికారంలో నిలపడమే లక్ష్యంగా ముందుకు కదులుతున్నారు. ఇదే తరహాలో సాగితే మిగతా పార్టీలకు కష్టమే అనిపిస్తోంది. ఈ నేపథ్యంలో బీజేపీ, బీఎస్పీ, ఎస్పీ లు తమ వైఖరులు స్పష్టం చేయాల్సిన అవసరం ఏర్పడింది. దీంతో యూపీలో అధికారం కోసం అన్ని పార్టీలు ఏ మేరకు స్పందిస్తాయోనని అందరిలో అనుమానాలు వస్తున్నాయి.
ఇప్పటికే ప్రియాంక గాంధీ మేనిఫెస్టోను అంచెలంచెలుగా అమలు చేసేందుకు సిద్ధమయ్యారు. అధికారం కోసం యాత్రలు చేపడుతున్నారు. ప్రజలను తమ వైపు తిప్పుకునే క్రమంలో రాష్ర్టవ్యాప్తంగా చుట్టి వస్తున్నారు. దీంతో యూపీలో కాంగ్రెస్ పార్టీ అధికారమే లక్ష్యంగా ముందుకు సాగుతోంది. ఈ నేపథ్యంలో ప్రత్యర్థి పార్టీలు కూడా తమ వైఖరి వెల్లడించాల్సిన అవసరం ఏర్పడింది.
మహిళలకు 40 శాతం సీట్లు, పేదలకు ఉచిత వైద్యం, ఇంటర్ విద్యార్థులకు స్మార్ట్ ఫోన్లు, డిగ్రీ విద్యార్థులకు స్కూటీలు ఉచితంగా అందజేత, గోధుమలు, వరికి రూ.2500 మద్దతు ధర తదితర హామీలతో రాష్ర్టంలో పాగా వేయాలని కాంగ్రెస్ పార్టీ ఉవ్విళ్లూరుతోంది. మరోవైపు ప్రతి పేద కుటుంబానికి రూ.25 వేల ఆర్థిక సాయం చేస్తామని చెబుతోంది. దీంతో కాంగ్రెస్ పార్టీ రాష్ర్టంలో జోరు మీద కనిపిస్తోంది.