Srilnka: శ్రీలంకలో సంక్షోభం ముదురుతోంది. ఆర్థిక ఇబ్బందులు చుట్టుముట్టాయి. ఫలితంగా దేశం అధోగతి పాలైంది. చైనాను నమ్ముకుని నట్టేట మునిగింది. అయినా పాలకుల్లో ఇంకా మార్పు రావడం లేదు. దీంతో దేశం యావత్తు సమస్యల్లో చిక్కుకుపోతోంది. శ్రీలంక రూపాయి మన మారకం విలువ కంటే తక్కువ. దీంతో అక్కడి పరిస్థితులు ఇండియాను కూడా భయపెడుతున్నాయి. ప్రస్తుతం లంక మనం అందించే సాయంపైనే ఆధారపడుతోంది. ఇంతటి దౌర్భాగ్యమైన స్థితికి రావడానికి కారణాలనేకం. కర్ణుడి చావుకు సవాలక్ష కారణాలన్నట్లు శ్రీలంక సంక్షోభానికి కూడా చాలా కారణాలు ఉన్నాయని తెలుస్తోంది.
అసలు లంక ఈ స్థితికి రావడానికి కారణం ఉచిత పథకాలే అని తెలుస్తోంది. ప్రజలకు ఉచితంగా ఇబ్బడి ముబ్బడిగా అన్ని అందించే సరికి ఆర్థిక వ్యవస్థ కుదేలైంది. దీంతో సంక్షోభం ఆవహించింది. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో శ్రీలంక కోలుకోవడం కష్టమే అనిపిస్తోంది. పాలకుల నిర్లక్ష్యంతోనే ఇంతటి దారుణం జరిగినట్లు తేలిపోయింది కానీ ఏం లాభం జరగాల్సిన నష్టం ఎప్పుడో జరిగిపోయింది. ఈ క్రమంలో నిత్యావసర సరుకుల ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. ఈ పరిస్థితుల్లో లంక ను ఓదార్చడమే కానీ చేయగలిగిది ఏదీ లేదని తెలుస్తోంది.
Also Read: Naga Chaitanya Thank You: జూలై 8న ‘థాంక్యూ’.. చైతు కొత్తగా ట్రై చేశాడు !
ద్రవ్యోల్బణం క్షీణించింది. రూపాయి విలువ మరింత దిగజారింది. దీంతో దేశంలో ధరలు అమాంతం పెరిగిపోయాయి. పెట్రోల్ ధర రూ. 300కు చేరింది. దీంతో ఏం కొనాలన్నా ఏం తినాలన్నా గగనంగానే మారింది. దీంతో సామాన్యులు సమస్యలతో బాధపడుతున్నారు. చిన్నపిల్లలకు సైతం ఆహారం అందని దుస్థితి. ఇదే స్థితి కొన్నాళ్లు కొనసాగితే మరణాలే శరణ్యం అనే వాదన కూడా వస్తోంది. బతుకు మీద రోజురోజుకు ఆశలు సన్నగిల్లుతున్నాయి.
ప్రభుత్వం పన్నుల రూపంలో పిండుకోవడంతో ధరలు ఒక్కసారిగా పెరిగిపోయాయి. దీంతో ప్రజలు సమస్యల్లో కొట్టుమిట్టాడుతున్నారు. ొక్క నిమ్మకాయ కొనాలంటే దాదాపు రూ.60 లు చెల్లించాల్సిందే. అంటే ధరల భారం ఎంతగా పెరిగాయో తెలుస్తోంది. దీంతోనే లంక కోలుకోలేని విధంగా దెబ్బ తిన్నది. చుట్టుపక్కల ఉన్న దేశాల సాయం కోసం ఎదురు చూస్తోంది. లంక చేసుకున్న స్వయంకృతాపరాధంతోనే ఇంతటి నష్టాలను చవిచూస్తోంది. ఏదైనా దీపం ఉన్నప్పుడే ఇల్లు చక్కబెట్టుకోవాలి. డబ్బులు ఉన్నప్పుడే వస్తువులు కొనుక్కోవాలి. అంతే కానీ ఆర్థిక ఇబ్బందులు ఏర్పడినప్పుడు బాధపడటంలో అర్థమేముంటుంది.
ఇండియా కూడా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరాన్ని శ్రీలంక సూచిస్తోంది. అక్కడి దుస్థితిని చూస్తే మనకు అలాంటి ఆపద రావొద్దని కోరుకోవడం సహజమే. అంతటి విపత్కర పరిస్థితిని ఎదుర్కొంటున్న లంకకు మానవతా దృక్పథంతో సాయం చేయడం మినహా మనం చేయగలిగింది ఏమీ లేదు అందుకే మనం కూడా ఇప్పటి నుంచే అప్రమత్తంగా ఉంటూ ఆర్థిక సంక్షోభం రాకుండా చూసుకోవాల్సిన బాధ్యత మనందరిపై ఉంది.