https://oktelugu.com/

Thaman Comments: వాగ్లేవీ ఏలేస్తోంది.. తమన్ కామెంట్స్ కి కారణం మహేషే !

Thaman Comments: నిన్నటి ‘తెలుగు ఇండియన్ ఐడల్’ ఎపిసోడ్‌ లో ఓ ఆసక్తికర సంఘటన జరిగింది. కంటెస్టెంట్ వాగ్లేవి ‘రంగ్‌దే’ పాట పాడటం సార్ట్ చేసిన క్షణం నుంచి జడ్జ్ గా ఉన్న తమన్ రియాక్షన్స్ మారుతూ వచ్చాయి. తమన్ బాగా ఎగ్జైట్ అయ్యాడు. పాట పై తన అభిప్రాయం చెబుతూ “వాగ్లేవీ, నువ్వు రాబోయే పదిహేను ఇరవై ఏళ్లు ఇండస్ట్రీని ఏలుతావు’ అంటూ బరువైన వ్యాఖ్యలే చేశాడు. తమన్ మాటలకు వాగ్లేవీ కూడా ఆశ్చర్యపోయింది. ఇక […]

Written By:
  • Shiva
  • , Updated On : May 14, 2022 / 12:15 PM IST
    Follow us on

    Thaman Comments: నిన్నటి ‘తెలుగు ఇండియన్ ఐడల్’ ఎపిసోడ్‌ లో ఓ ఆసక్తికర సంఘటన జరిగింది. కంటెస్టెంట్ వాగ్లేవి ‘రంగ్‌దే’ పాట పాడటం సార్ట్ చేసిన క్షణం నుంచి జడ్జ్ గా ఉన్న తమన్ రియాక్షన్స్ మారుతూ వచ్చాయి. తమన్ బాగా ఎగ్జైట్ అయ్యాడు. పాట పై తన అభిప్రాయం చెబుతూ “వాగ్లేవీ, నువ్వు రాబోయే పదిహేను ఇరవై ఏళ్లు ఇండస్ట్రీని ఏలుతావు’ అంటూ బరువైన వ్యాఖ్యలే చేశాడు. తమన్ మాటలకు వాగ్లేవీ కూడా ఆశ్చర్యపోయింది.

    Thaman

    ఇక తమన్ మాట విని ఎపిసోడ్‌ చూస్తున్న ప్రేక్షకులు కూడా ఆశ్చర్యచకితులు అయ్యారు. సహజంగా టీవీ షోలలో పొగడ్తలు సర్వసాధారణం. ప్రతి భాషలోనూ ఇలాంటి ఊహాజనిత ప్రసంగాలు, ప్రశంసలతోనే షోలు నడుస్తాయి. కానీ తమన్ చేసిన ఇలాంటి వ్యాఖ్య మాత్రం మొదటిసారి. పైగా తమన్ నుంచి ఇంతటి ప్రశంస, అభినందన మొదటిసారి వింటున్నాం. అసలు నిజంగా తమన్ కి వాగ్దేవి గాత్రం అంత గొప్పగా నచ్చిందా ?

    చిన్నపుటి నుంచీ తమన్ సంగీత ప్రపంచంలోనే మునిగి తేలుతున్నాడు. అందుకే, తమన్ కి సంగీతం లోతులు బాగా వంటబట్టాయి. ఎంతో గొప్పగా పాడినా.. తప్పులు వెతకడంలో తమన్ దిట్ట. ఇక సింగర్ పాటలో తప్పులు దొర్లితే, తమన్ నిర్మొహమాటంగా కాస్త కటువైన వ్యాఖ్యలే చేస్తాడు. సినిమాల పాటల కంపోజింగ్ విషయంలోనూ తమన్ వ్యవహార శైలి ఇలాగే ఉంటుంది. ఉదాహరణకు.. ‘అఖండ’ సినిమాలోని ‘జై బాలయ్య’ పాట విషయంలో సింగర్ గీతా మాధురి పై తమన్ సీరియస్ అయ్యాడు. ఓ చిన్న హమ్మింగ్ ఆమె తప్పుగా పలికింది. దానికే తమన్ ఓ ఫేమస్ సింగర్ పైనే అసహనం వ్యక్తం చేశాడు.

    Geetha Madhuri

    Also Read: Mahesh Babu Hard work: మహేష్ కష్టమంతా వృధా.. ఇది ఫ్యాన్స్ కి వ్యథే !

    ఆ స్థాయి నిర్మొహమాటంగా ఉండే తమన్ నోటి వెంట, ఇలాంటి పెద్ద మాట ఎలా వచ్చింది ? ఈ ఎపిసోడ్ చూసిన ఇండస్ట్రీ ప్రముఖులు కూడా ఇదే ఆలోచిస్తున్నారు. బహుశా.. తమన్ కి కూడా ఇదే డౌట్ వచ్చినట్టు ఉంది. అందుకే, ఏదో
    నాకు తెలియని ఎనర్జీ, నా చేత ఇలా పలికించింది అన్నట్టు చెప్పుకొచ్చాడు.

    కర్ణుడి చావుకి సవాలక్ష కారణాలు ఉన్నా, ప్రధాన కారణం మాత్రం అర్జునుడే. సేమ్ అలాగే ‘సర్కారు వారి పాట’ పరాజయానికి ఎన్ని కారణాలు ఉన్నా.. ప్రధాన కారణం తమనే. ఇదే ఇప్పుడు ఇండస్ట్రీలో బాగా ప్రచారంలో ఉంది. తమన్ సంగీతం ‘అఖండ’కు ఎంత ప్లస్ అయ్యిందో, సర్కారుకి అంత మైనస్ అయ్యింది. ఈ విషయంలోనే మహేష్ ఫ్యాన్స్ కూడా తమన్ ను విపరీతంగా ట్రోల్ చేస్తున్నారు. పైగా, నిర్మాతలు కూడా తమన్ పై పెదవి విరిచినట్టు తెలుస్తోంది. మొత్తానికి తమన్ పై ‘సర్కారు’ ప్లాప్ బాగా ప్రభావం బాగా పడింది. ఆ ప్రభావం ఫలితమే.. తమన్ నోట ఈ మాట పలికించి ఉండొచ్చు. మరి తమన్ మాట ప్రకారం.. వాగ్లేవీ, రాబోయే పదిహేను ఇరవై ఏళ్లు ఇండస్ట్రీని ఏలాలి అని కోరుకుందాం.

    Also Read: Ram Gopal Varma : నా లైఫ్‌ నా ఇష్టం.. నాలా బతకాలంటే ఆ మూడు వదిలేయాలి: రామ్‌గోపాల్‌వర్మ!!

    Tags