Telangana Political Target Fix: టార్గెట్‌ పిక్స్‌.. షా.. ఆగయా!.. తెలంగాణ రాజకీయాలపై కీలక ప్రకటన చేసే ఛాన్స్‌!!

Telangana Political Target Fix: బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ ప్రజల సమస్యలను తెలుసుకోవడానికి, తెలంగాణ ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలను ఎండగట్టడానికి రెండో విడత ప్రజా సంగ్రామ యాత్ర ద్వారా ప్రజాక్షేత్రంలోకి వెళ్లారు. నెల రోజులపాటు సాగిన యాత్ర ముగింపు దశకు చేరుకుంది. శనివారం యాత్ర ముగింపు సందర్భంగా భారీ బహిరంగ సభను నిర్వహించేందుకు బీజేపీ ఏర్పాట్లు చేసింది. ఈ సభకు అమిత్‌ షా వస్తున్నారు. సాయంత్రం నిర్వహించే సభ ద్వారా తెలంగాణ రాజకీయాలపై […]

Written By: NARESH, Updated On : May 14, 2022 3:35 pm
Follow us on

Telangana Political Target Fix: బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ ప్రజల సమస్యలను తెలుసుకోవడానికి, తెలంగాణ ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలను ఎండగట్టడానికి రెండో విడత ప్రజా సంగ్రామ యాత్ర ద్వారా ప్రజాక్షేత్రంలోకి వెళ్లారు. నెల రోజులపాటు సాగిన యాత్ర ముగింపు దశకు చేరుకుంది. శనివారం యాత్ర ముగింపు సందర్భంగా భారీ బహిరంగ సభను నిర్వహించేందుకు బీజేపీ ఏర్పాట్లు చేసింది. ఈ సభకు అమిత్‌ షా వస్తున్నారు. సాయంత్రం నిర్వహించే సభ ద్వారా తెలంగాణ రాజకీయాలపై కీలక ప్రకటచ చేసే అవకాశం ఉంది. ముఖ్యమంత్రి కేసీఆర్‌ టార్గెట్‌గా ఈ ప్రకటన ఉంటుందన్న చర్చ జరుగుతోంది.

Amit Shah

తొలివిడత ప్రజా సంగ్రామ యాత్ర నిర్వహించిన సమయంలో సెప్టెంబర్‌ 17 వ తేదీన కేంద్ర మంత్రి అమిత్‌ షా నిర్మల్‌ సభకు వచ్చారు. మళ్లీ ఏడాదిలోపే అమిత్‌ షా తెలంగాణ పర్యటనకు వస్తుండటం ప్రాధాన్యంత సంతరించుకుంది. ఇదిలా ఉంటే రాష్ట్రంలోని ప్రజల సమస్యలు తెలుసుకోవడం కోసం, పార్టీని ప్రజాక్షేత్రంలో బలోపేతం చేయడం కోసం, కేసీఆర్‌ సర్కారు ప్రభుత్వ వ్యతిరేక విధానాలను ప్రజలకు తెలియజేయడం కోసం బండి సంజయ్‌ నిర్వహించిన ప్రజా సంగ్రామ యాత్ర రెండో విడత ఏప్రిల్‌ 14వ తేదీన అలంపూర్‌ లోని జోగులాంబ అమ్మవారి ఆలయం నుంచి ప్రారంభించారు. గద్వాల్, వనపర్తి, నారాయణపేట, మహబూబ్‌నగర్, రంగారెడ్డి జిల్లాల్లో యాత్ర సాగింది. ఆలంపూర్, గద్వాల మక్తల్, నారాయణపేట, దేవరకద్ర, మహబూబ్‌ నగర్, జడ్చర్ల, షాద్‌ నగర్‌ , మహేశ్వరం అసెంబ్లీ నియోజకవర్గాలను బండి సంజయ్‌ తన పాదయాత్రలో కవర్‌ చేశారు.

అమిత్‌ షా సభపై అందరి దృష్టి..

ఇక పాదయాత్రలో చివరి రోజు శనివారం సాయంత్రం తుక్కుగూడలో నిర్వహించే భారీ బహిరంగ సభకు ఇప్పటికే ఏర్పాట్లను పూర్తి చేశారు. అయితే అమిత్‌ షా హాజరయ్యే సభ రాష్ట్రంలో ఎటువంటి మార్పులకు కారణం కాబోతుందో అన్న ఆసక్తి అందరిలో నెలకొంది. అమిత్‌ షా సభ ద్వారా పార్టీ శ్రేణుల్లో నూతన ఉత్తేజం నింపడంతోపాటు, తెలంగాణ రాష్ట్రంలో భవిష్యత్తు రాజకీయ పరిణామాలపై, అమిత్‌ షా ఏం మాట్లాడతారో అన్న ఆసక్తి నెలకొంది. ఇప్పటికే తెలంగాణ రాష్ట్రానికి వచ్చిన కేంద్ర మంత్రులు, ముఖ్య నేతలు కేసీఆర్‌ సర్కార్‌ పై తీవ్రస్థాయిలో విరుచుకు పడుతున్నారు.

ఐదు లక్షల జన సమీకరణ..

తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు సాగిస్తున్న కుటుంబ పాలనను, అవినీతిని ఈ సభద్వారా ఎండగట్టే ప్రయత్నం చేయనున్నట్లు తెలిసింది. సభలో కేంద్ర మంత్రి అమిత్‌ షా సభలో ఏం మాట్లాడుతారు. ఎలాంటి కీలక నిర్ణయాలు తీసుకోబోతున్నారు అన్నది ఆసక్తిగా మారింది. వచ్చే ఎన్నికల లక్ష్యంగా, రాష్ట్రంలో పార్టీని బలోపేతం చేయడానికి ఓ మార్గంగా ఈరోజు తుక్కుగూడ లో నిర్వహించనున్న సభ ను ప్రతిష్టాత్మకంగా తీసుకుంటుంది బీజేపీ. ఈ నేపథ్యంలో భారీ బహిరంగ సభకు సంబంధించిన ప్రధాన వేదికతో పాటు అన్ని ఏర్పాట్లను పూర్తి చేశారు. మొత్తం 40 ఎకరాల్లో ఐదు లక్షలకు మించిన జనాలతో ఈ సభను నిర్వహించడానికి అన్ని ఏర్పాట్లు చేసుకున్నారు. ఇక పోలీసులు అమిత్‌ షా పర్యటన నేపధ్యంలో ట్రాఫిక్‌ మళ్లించారు.

టీఆర్‌ఎస్, కేసీఆర్‌ లక్ష్యంగా..

KCR

రాష్ట్ర రాజకీయాలపై ప్రత్యేకంగా ఫోకస్‌ పెట్టిన బీజేపీ.. టీఆర్‌ఎస్‌ సర్కారు, సీఎం కేసీఆర్‌ లక్ష్యంగా దాడి ముమ్మరం చేసేందుకు సిద్ధమైంది. ఓవైపు టీఆర్‌ఎస్‌ సర్కారు, సీఎం కేసీఆర్‌ భారీగా అవినీతికి పాల్పడ్డారని ఆరోపణలు గుప్పిస్తూనే.. మరోవైపు రాష్ట్రంలో బీజేపీకి మరింత సానుకూలత తెచ్చుకునేలా, పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం నింపేలా షా ప్రసంగం ఉంటుందని బీజేపీ వర్గాలు చెప్తున్నాయి. టీఆర్‌ఎస్‌ సర్కారు సాగునీటి ప్రాజెక్టుల్లో భారీగా అక్రమాలకు పాల్పడిందని, కాళేశ్వరం ఏటీఎంగా మారిపోయిందని ఇటీవలే బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. అమిత్‌షా సభ కూడా రాష్ట్ర ప్రభుత్వం, టీఆర్‌ఎస్‌ పార్టీ, సీఎం కేసీఆర్‌లను లక్ష్యంగా చేసుకునే సాగనున్నట్టు బీజేపీ నాయకులు చెబుతున్నారు. కేసీఆర్‌ కుటుంబ పాలన, అవినీతి, అక్రమాల ఆరోపణలకు తోడు కేంద్ర పథకాలను రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయడం లేదని, కేంద్ర నిధులను మళ్లిస్తోందని అమిత్‌షా ధ్వజమెత్తే అవకాశముందని పేర్కొంటున్నాయి.

Also Read: Balakrishna: బాలయ్య అప్పట్లో ఎంత కట్నం డిమాండ్ చేశారో తెలుసా ?

పథకాలను ప్రస్తావిస్తూ..

రాష్ట్ర ప్రభుత్వం అప్రజాస్వామిక విధానాలను అవలంబిస్తోందంటూ అమిత్‌షా తన ప్రసంగంలో ఎండగట్టే అవకాశం ఉందని తెలుస్తోంది. నిరుద్యోగ భృతి, డబుల్‌ బెడ్రూం ఇళ్లు, దళితులకు మూడెకరాల భూమి, దళితబంధు, ఉచిత ఎరువులు తదితర హామీల అమల్లో వెనకడుగు, బియ్యం, వడ్ల కొనుగోళ్ల వైఫల్యం.. ఆయుష్మా¯Œ భారత్, పీఎం ఆవాస్‌ యోజన, పీఎం కిసా¯Œ వంటి కేంద్ర పథకాలను తెలంగాణలో పూర్తి స్థాయిలో అమలుచేయకపోవడాన్ని ప్రస్తావించే అవకాశం ఉంది. ఉపాధి హామీ సహా అనేక పథకాల ద్వారా గ్రామీణాభివృద్ధికి, ఇతర రంగాలకు నిధులిస్తున్నా.. కేంద్రం సహకరించట్లేదంటూ టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం, సీఎం కేసీఆర్, మంత్రులు విమర్శలు చేయడాన్ని ఎత్తిచూపుతారని బీజేపీ నేతలు పేర్కొంటున్నారు.

ప్రత్యామ్నాయం బీజేపీనేనని..

Bandi sanjay

టీఆర్‌ఎస్‌కు అసలైన ప్రత్యామ్నాయం బీజేపీనేనని.. కేంద్రంలో, రాష్ట్రంలో బీజేపీ సర్కార్‌ ఏర్పడితే డబుల్‌ ఇంజ¯Œ తో తెలంగాణ అభివృద్ధి సాధ్యమనే సందేశాన్ని అమిత్‌షా ఇస్తారని తెలుస్తోంది. బీజేపీకి ఆదరణ పెరుగుతుండటాన్ని సహించలేక పార్టీ నాయకులు, కార్యకర్తలపై తప్పుడు కేసులు పెడ్తున్నారని.. దాడులకు పాల్పడుతున్నారనే అంశాన్ని లేవనెత్తుతారని అంటున్నారు. ఖమ్మంలో పార్టీ కార్యకర్త సాయిగణేశ్‌ ఆత్మహత్య, ఉమ్మడి ఆదిలాబాద్, నిజామాబాద్, నల్లగొండ తదితర జిల్లాల్లో బీజేపీ కార్యకర్తలపై స్థానిక టీఆర్‌ఎస్‌ నాయకుల బెదిరింపులు, దాడులనూ ప్రస్తావిస్తారని పేర్కొంటున్నారు. ఇలాంటి దాడులకు భయపడొద్దని.. పార్టీ నాయకులు, కార్యకర్తలు తెగించి పోరాడాలని అమిత్‌షా భరోసా ఇస్తారని సమాచారం. తెలంగాణలో బీజేపీకి అనుకూల పరిస్థితులు ఉన్నాయని, వచ్చే అసెంబ్లీ ఎన్నికలకు ఇప్పటినుంచే పూరిస్థాయిలో సన్నద్ధం కావాలని దిశానిర్దేశం చేయనున్నారని పార్టీ నేతలు చెబుతున్నారు.

రాష్ట్రంలో గరం.. గరం..

వాస్తవానికి రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలకు ఇంకా ఏడాదిన్నర సమయముంది. అయినా ప్రధాన రాజకీయ పార్టీలు మాత్రం పోటాపోటీ కార్యక్రమాలతో వేడి పుట్టిస్తున్నాయి. ఇటీవలే కాంగ్రెస్‌ రాహుల్‌గాంధీతో సభ నిర్వహించడం.. టీఆర్‌ఎస్‌ నేతలు కూడా విస్తృతంగా పర్యటనలు చేస్తుండటం, బీజేపీని టార్గెట్‌ చేసి విమర్శలు గుప్పిస్తుండటం.. ఇదే సమయంలో బీజేపీ పాదయాత్ర, సభలకుతోడు తాజాగా అమిత్‌షా పర్యటనతో అన్నివర్గాల్లో ఆసక్తి నెలకొంది. అమిత్‌షా బీజేపీ ఎన్నికల ఎజెండాను ప్రస్తావించడంతోపాటు తనదైన శైలితో విమర్శలతో ప్రధాన పార్టీల మధ్య రాజకీయ చర్చలు, సవాళ్లు, ప్రతిసవాళ్ల పర్వానికి తెరలేపే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.

Also Read: Early Elections In AP: ఏపీలో ముందస్తు ఎన్నికలు.. చీఫ్ ఎలక్షన్ ఆఫీసర్ మార్పు దేనికి సంకేతం?

Tags