COP26 : భూతాపంతో ప్రకృతి వైఫరీత్యాలు కొనసాగుతూనే ఉంటాయా..?

cop26 Global warming: వాతావరణంలో వస్తున్న మార్పులతో ప్రకృతి విలయతాండవం చేస్తోంది. ఫలితంగా ఊహించని విధంగా వర్షాలు, వరదలు సంభవిస్తున్నాయి. మరోవైపు అడవుల్లో అనుకోకుండా కార్చిచ్చులు మొదలై  దట్టమైన అడవులన్నీ బుగ్గి అవుతున్నాయి. అయితే ఇలాంటి ప్రకృతి వైఫరీత్యాలకు భూమ్మీద పెరుగుతున్న ఉష్ణోగ్రతే కారణమా..? అంటే కొన్ని నివేదికలను చూస్తే అవేనంటున్నాయి. మనం చూస్తుండగానే విపత్తులు సంభవించి ఎక్కడికక్కడ సర్వ నాశనం అవుతున్నాయి. మరోవైపు సముద్రం నానాటికి పెరుగుతూ సమీప ప్రాంతంలో ఉన్న ఊళ్లను ముంచేస్తోంది. అయితే […]

Written By: NARESH, Updated On : November 2, 2021 4:56 pm
Follow us on

cop26 Global warming: వాతావరణంలో వస్తున్న మార్పులతో ప్రకృతి విలయతాండవం చేస్తోంది. ఫలితంగా ఊహించని విధంగా వర్షాలు, వరదలు సంభవిస్తున్నాయి. మరోవైపు అడవుల్లో అనుకోకుండా కార్చిచ్చులు మొదలై  దట్టమైన అడవులన్నీ బుగ్గి అవుతున్నాయి. అయితే ఇలాంటి ప్రకృతి వైఫరీత్యాలకు భూమ్మీద పెరుగుతున్న ఉష్ణోగ్రతే కారణమా..? అంటే కొన్ని నివేదికలను చూస్తే అవేనంటున్నాయి. మనం చూస్తుండగానే విపత్తులు సంభవించి ఎక్కడికక్కడ సర్వ నాశనం అవుతున్నాయి. మరోవైపు సముద్రం నానాటికి పెరుగుతూ సమీప ప్రాంతంలో ఉన్న ఊళ్లను ముంచేస్తోంది. అయితే మన ప్రపంచాన్ని మనమే నాశనం చేసుకుంటున్నామనే వాదన వినిపిస్తోంది. ప్రకృతిని పట్టించుకోకుండా మన అవసరాల కోసం వినియోగిస్తున్న కొన్ని కర్భన ఉద్గారాలు మానవాళీ జీవనానికి ముప్పు తెస్తుంది.

cop26 Glasgow

పారిశ్రామిక విప్లవం తరువాత 2002 వరకు ఉష్ణో గ్రత 1 డిగ్రీ పెరిగినట్లయింది. 2021లో ప్రపంచవ్యాప్తంగా సముద్ర మట్టాలు పెరిగాయని వాతావరణ నివేదిక ప్రముఖంగా తెలిపింది. వాతావరణ మార్పులతో జరుగుతున్న విపత్తులు, జరగబోయే సంఘటనలను వివరించాడానికి ఐక్యరాజ్య సమితి గ్లాస్గో సదస్సులను ఉద్దేశించి నివేదిక విడుదల చేసింది. ఈ నివేదికలో ఉష్ణోగ్రతల వివరాలు, ప్రకృతి వైఫరీత్యాలు, సముద్ర మట్టాల పెరుగుతల, వాతావరణ సూచికలను తెలుపుతున్నాయి. వాతావరణంలో గ్రీన్ హౌజ్ వాయు ఉద్గారాల సాంద్రత రికార్డు స్థాయికి చేరుకోవడంతో ఏడేళ్లుగా ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయని తెలిపింది.

ప్రపంచంలో వివిధ అవపసరాల కోసం కర్మాగారాలు నెలకొల్పడంతో పాటు అడవులను విచ్చలవిడిగా ధ్వంసం చేస్తున్నారు. దట్టమైన అడవిలో సైతం కొన్ని ప్రాజెక్టులు చేపడుతుండడంతో ప్రకృతిలో పెను మార్పులు సంభవిస్తున్నట్లు తెలుస్తోంది. దీంతో భూ తాపం పెరిగి అనేక విపత్తులు సంభవిస్తున్నాయి. ఇటీవల కేరళ వ్యాప్తంగా ఊహించని వరదలు సంభవించి తీవ్ర నష్టం జరిగింది. పెద్ద పెద్ద నీటి ప్రాజెక్టులు సైతం వరద తాకిడికి తట్టుకోలేకపోయాయి. ఇక చిన్న నీటి ప్రాజెక్టులు ధ్వంసమై వరద పొంగిపొర్లింది. ఇలా ఊహించని వైఫరీత్యాలకు భూతాపమే కారణమని అంటున్నారు.

మరోవైపు నానాటికి సముద్రం గర్భం పెరిగిపోతుంది. గత కొన్నేళ్లల్లో సముద్రం ముందుకు వచ్చినట్లు చెబుతున్నారు. ఇప్పటికే విశాఖ, ముంబై ప్రాంతాల్లో కొన్ని గ్రామాలు రానున్న రోజుల్లో మునిగిపోయే అవకాశం ఉందని వాతావరణ అధికారులు తేల్చారు. ఇటీవ తూర్పుగోదావరి జిల్లాలోని ఉప్పాడ, తదితర గ్రామాల్లో ఊరి సగభాగం వరకు సముద్రం ముందుకు వచ్చింది. ఇందుకు కారణం భూమిపై ఉన్న ఉష్ణోగ్రత పెరగడమేనని నిపుణులు పేర్కొంటన్నారు.

1990 నుంచి శాటిలైట్ ఆధారంగా సముద్ర మట్టాలను పరీక్షించారు. ఇందులో భాగంగా 1993 నుంచి 2002 మధ్యలో సముద్రమట్టాలు ఏడాదికి 2.1 మిల్లిమీటర్ల చొప్పున పెరిగాయి. 2013 నుంచి 2021 మధ్యలో ఇది రెట్టింపుగా 4.4 మిల్లీమీటర్ల చొప్పును పెరుగుతూ వచ్చాయి. మంచు పలకాలు కరగడం.. హిమనీనదాలు పొంగిపొర్లడంతో సముద్ర మట్టాలు పెరిగాయని భావిస్తున్నారు. అంతకుముందు సముద్ర మట్టాలు పెరిగింది లేదని , కానీ 30 ఏళ్లల్లో రెట్టింపు పెరిగిందని బ్రిస్టల్ గ్లాసియాలజీ సెంటర్ డైరెక్టర్ ప్రొఫెసర్ జోనాథన్ చాంబర్ తెలిపారు. ఈ పరిస్థితి ఇలాగే కొనసాగితే సముద్ర మట్టాలు మరింత పెరిగిపోవచ్చు అని పేర్కొన్నారు.

ఇరవై ఏళ్లల్లో 1 సెంటిగ్రేట్ దాటనుందని అయితే దీనిపై చర్యలు తీసుకోవాల్సిన దానిపై చర్చించేందుకు cop26 దేశాలు నిర్ణయిస్తాయని తెలుస్తోంది. భూ గ్రహం మన కళ్లముందే మారిపోతుందని, సముద్ర లోతుల నుంచి పర్వత శిఖరాల వరకు హిమనీనదాలు కరగడం అన్ని రకాల ప్రకృతి వైపరీత్యాల వరకు ప్రపంచవ్యాప్తంగా సమాజాలు ధ్వంసం అవుతున్నాయని ఐక్యరాజ్య సమితి సెక్రటరీ పేర్కొన్నారు. ఈఏడాది ప్రారంభంలో ‘లా నివా’ అనే సంఘటన చోటు చేసుకుందని, దీని ద్వారా ఉష్ణోగ్రతలు తగ్గుతాయని కొందరు అంటున్నారు.