https://oktelugu.com/

మూడు రాజధానులు: జగన్‌కు మోడీ సాయం చేస్తున్నారా?

రాష్ట్రంలో జగన్ తో కొట్లాడుడే.. కానీ కేంద్రానికి వచ్చేసరికి ఫ్రెండ్ షిప్ చేయడమే.. ఏ ఎండకు ఆ గొడుగు పట్టేయడమే.. బీజేపీ, వైసీపీ దోస్తీ ఫైట్ చూశాక ఇప్పుడు ఎవ్వరికైనా ఇలాంటి అనుమానాలే కలుగక మానవు. ఏపీ గల్లీలో ఫైట్ చేస్తూ ఢిల్లీలో దోస్తీ చేస్తూ బీజేపీ-వైసీపీ డబుల్ గేమ్ ఆడుతున్నాయి. వీరి స్నేహానికి అసలు డిఫెనేషన్ ఏం ఇవ్వాలో అర్థం కాని పరిస్థితి ప్రత్యర్థులకు ఎదురవుతోందట.. Also Read: జడ్జిల బదిలీ విషయం చంద్రబాబుకు తెలియదా..? […]

Written By:
  • NARESH
  • , Updated On : December 17, 2020 / 11:12 AM IST
    Follow us on

    రాష్ట్రంలో జగన్ తో కొట్లాడుడే.. కానీ కేంద్రానికి వచ్చేసరికి ఫ్రెండ్ షిప్ చేయడమే.. ఏ ఎండకు ఆ గొడుగు పట్టేయడమే.. బీజేపీ, వైసీపీ దోస్తీ ఫైట్ చూశాక ఇప్పుడు ఎవ్వరికైనా ఇలాంటి అనుమానాలే కలుగక మానవు. ఏపీ గల్లీలో ఫైట్ చేస్తూ ఢిల్లీలో దోస్తీ చేస్తూ బీజేపీ-వైసీపీ డబుల్ గేమ్ ఆడుతున్నాయి. వీరి స్నేహానికి అసలు డిఫెనేషన్ ఏం ఇవ్వాలో అర్థం కాని పరిస్థితి ప్రత్యర్థులకు ఎదురవుతోందట..

    Also Read: జడ్జిల బదిలీ విషయం చంద్రబాబుకు తెలియదా..?

    వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఢిల్లీ వెళ్లి బీజేపీ పెద్దలను కలిశాక పరిణామాలు వేగంగా మారిపోతున్నాయి. జగన్ పెట్టిన అభ్యర్థనలపై తాజాగా కేంద్రం స్పందిస్తున్న తీరు చూశాక ఈ అనుమానాలకు బలం చేకూరుతోంది. సీఎం జగన్ తాజాగా కేంద్ర హోంమంత్రి అమిత్ షాకు చేసిన ప్రధాన అభ్యర్థనలలో ఒకటి రాష్ట్ర హైకోర్టును కర్నూలుకు మార్చే ప్రక్రియను ప్రారంభించాలని కోరడం.. పరిపాలన వికేంద్రీకరణ కోసం ఆంధ్రప్రదేశ్‌కు మూడు రాజధాని నగరాలు ఏర్పాటు చేస్తున్నామని.. దీనికి సహకరించాలని విన్నవించడం.. వీటిపై కేంద్రం కూడా వేగంగా స్పందించడం విశేషం. మంగళవారం రాత్రి ఏపీ హైకోర్టును అమరావతి నుంచి కర్నూలుకు మారుస్తూ కేంద్రం నోటిఫికేషన్ జారీ చేయాలని జగన్ అభ్యర్థించారు.

    ఈ ప్రధాన పర్యటనలో ముఖ్యమంత్రి జగన్ తన మూడు రాజధానులకు కేంద్రం నుంచి అనుమతి పొందాలని గట్టి ప్రయత్నాలు చేశారు. అన్ని ప్రాంతాల సమగ్ర అభివృద్ధి కోసం పరిపాలన వికేంద్రీకరణ అవసరమని నివేదించారు. తన ప్రభుత్వం ఎలా, ఎందుకు వెళ్తుందో వివరంగా షాకు వివరించారని తెలిసింది.

    విశాఖపట్నంలో కార్యనిర్వాహక రాజధాని, అమరావతిలో శాసన రాజధాని, కర్నూలులో న్యాయ రాజధాని.. ఇలా ఆంధ్రప్రదేశ్‌కు మూడు రాజధానులను ఏర్పాటు చేయాలని కోరుతూ రాష్ట్ర శాసనసభ ఇప్పటికే ఆగస్టులో సంబంధిత చట్టాలను ఆమోదించినట్లు ఆయన గుర్తు చేశారు.

    Also Read: ఓటుకు నోటు కేసులో కీలక పరిణామం

    కార్యనిర్వాహక రాజధానిని విశాఖపట్నానికి మార్చడం.. అమరావతిని శాసన రాజధానిగా కొనసాగించడం రాష్ట్ర ప్రభుత్వం చేతిలో ఉండగా, రాష్ట్ర హైకోర్టును కర్నూలుకు మార్చడానికి మాత్రం సుప్రీంకోర్టు ఆమోదం పొందిన తరువాత రాష్ట్రపతి ఉత్తర్వుల ద్వారా మాత్రమే సాధ్యపడుతుంది.. కాబట్టి, సుప్రీంకోర్టు సమ్మతితో, ఆపై న్యాయ మంత్రిత్వ శాఖ అనుమతితో నోటిఫికేషన్ జారీ చేయడం ద్వారా రాష్ట్ర హైకోర్టును కర్నూలుకు మార్చడానికి కేంద్రమే ప్రక్రియ ప్రారంభించాలి. చివరగా దీనిని భారత రాష్ట్రపతి ఆమోద ముద్ర ద్వారా సాధ్యమవుతుంది

    2019 పార్లమెంట్ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ ఏపీ ఎన్నికల మేనిఫెస్టోలో కర్నూలులో రాష్ట్ర హైకోర్టును ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చిందని..దాన్ని నెరవేర్చాలని సీఎం జగన్ హోంమంత్రి అమిత్ షాకు గుర్తు చేశారు.

    హైకోర్టును కర్నూలుకు మార్చడం అంటే ఓ రకంగా కేంద్రం సీఎం జగన్ ప్రతిపాదించిన మూడు రాజధానుల ప్రణాళికకు క్లియరెన్స్ ఇవ్వడమే. ఇది రాష్ట్ర హైకోర్టులో తన ప్రభుత్వానికి ఉన్న చట్టపరమైన అడ్డంకులను కూడా క్లియర్ చేస్తుంది. జగన్‌కు మూడు రాజధానుల చిక్కుముడులను సులభతరం చేస్తుంది. ప్రస్తుతం ప్రక్రియ ప్రారంభమవుతున్న వేళ మోడీ సర్కార్ సీఎం జగన్ తలపెట్టిన మూడు రాజధానులకు సాయం చేస్తున్నట్టే లెక్క..

    మరిన్ని ఆంధ్ర రాజకీయ వార్తల కోసం ఏపీ పాలిటిక్స్

    -నరేశ్