https://oktelugu.com/

‘రైతుబంధు’ కోసం ఎదురుచూపులేనా?

రైతు సంక్షేమం కోసం దేశంలో ఎక్కడ లేనివిధంగా తెలంగాణలో పథకాలను టీఆర్ఎస్ సర్కార్ అమలు చేస్తోంది. రైతుబంధు.. రైతు బీమా.. ఉచిత కరెంట్.. రుణమాఫీ.. గొర్లు.. బర్రెల పంపిణీ తదితర పథకాలను సీఎం కేసీఆర్ ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్నారు. రైతులు సైతం సీఎం కేసీఆర్ కు బాసటగా నిలువడంతో టీఆర్ఎస్ రెండుసార్లు అధికారంలోకి వచ్చింది. అయితే ప్రస్తుతం తెలంగాణలో టీఆర్ఎస్ వ్యతిరేక పవనాలు వీస్తున్నాయి. దుబ్బాక ఉప ఎన్నిక.. గ్రేటర్ ఎన్నికల్లో వీటిని స్పష్టం చేశాయి. Also […]

Written By:
  • Neelambaram
  • , Updated On : December 17, 2020 / 11:12 AM IST
    Follow us on

    రైతు సంక్షేమం కోసం దేశంలో ఎక్కడ లేనివిధంగా తెలంగాణలో పథకాలను టీఆర్ఎస్ సర్కార్ అమలు చేస్తోంది. రైతుబంధు.. రైతు బీమా.. ఉచిత కరెంట్.. రుణమాఫీ.. గొర్లు.. బర్రెల పంపిణీ తదితర పథకాలను సీఎం కేసీఆర్ ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్నారు.

    రైతులు సైతం సీఎం కేసీఆర్ కు బాసటగా నిలువడంతో టీఆర్ఎస్ రెండుసార్లు అధికారంలోకి వచ్చింది. అయితే ప్రస్తుతం తెలంగాణలో టీఆర్ఎస్ వ్యతిరేక పవనాలు వీస్తున్నాయి. దుబ్బాక ఉప ఎన్నిక.. గ్రేటర్ ఎన్నికల్లో వీటిని స్పష్టం చేశాయి.

    Also Read: మూడు రాజధానులు: జగన్‌కు మోడీ సాయం చేస్తున్నారా?

    నిరుద్యోగులు.. ఉద్యోగులు.. పలువర్గాల్లో ప్రభుత్వంపై వ్యతిరేకతలు మొదలైంది. అయితే తొలి నుంచి ప్రభుత్వానికి అండగా నిలుస్తున్న రైతన్నల్లో మాత్రం వ్యతిరేకతలు రాకుండా చూసుకోవాలని సీఎం కేసీఆర్ అధికారులకు ఆదేశాలు జారీ చేస్తున్నారు.

    యాసంగికి రైతుబంధు సాయం నవంబర్లో నెలలోనే ప్రభుత్వం అందించాల్సి ఉంది. అయితే డిసెంబర్ మూడోవారం గడిచినా రైతుబంధు రైతుల ఖాతాల్లో జమకాలేదు. అయితే ఈనెల 27నుంచి రైతుబంధు సాయం ప్రారంభం అవుతుందని సీఎం కేసీఆర్ ప్రకటించారు.

    ఇటీవల అకాల వర్షాలతో రైతులకు పెద్ద నష్టం వాటిల్లింది. పంట బీమా కూడా అందకపోవడంతో రైతులు ఇబ్బందులు పడుతున్నారు. ఇక సాగుకు ముందే ప్రభుత్వం సాయం అందించాల్సి ఉండగా అందకపోవడంతో అప్పోస్పో చేసి యాసంగికి రైతులు సిద్ధమవుతున్నారు.

    రైతుబంధు డబ్బులు అందుతాయమనే ధీమాతో ఇప్పటికే 7లక్షల ఎకరాల్లో నాట్లు మొదలైనట్లు తెలుస్తోంది. నెలఖారు నుంచి రైతు బంధు సాయం మొదలవుతుందని సీఎం ప్రకటించారు. అయితే నిధులు సర్దుబాటుకు ప్రభుత్వం ఇబ్బందులు పడుతున్నట్లు తెలుస్తోంది.

    Also Read: జడ్జిల బదిలీ విషయం చంద్రబాబుకు తెలియదా..?

    రైతు బంధు కోసం సుమారు రూ.7,300కోట్ల అవసరం అవుతాయని ఆర్థిక శాఖ అంచనా వేసింది. కరోనా ఎఫెక్ట్.. రిజిస్ట్రేషన్ల ఆదాయం పడిపోవడంతో ఆర్థిక నిల్వలు తగ్గినట్లు తెలుస్తోంది.దీనికి తోడు నెలఖారులో ఉద్యోగులకు జీతాలు ఇవ్వాల్సి ఉంది.

    ఈ ఏడాది భారీగా అప్పులు చేసిన ప్రభుత్వం వాటి నుంచే నిధులు సర్దుబాటు చేసేందుకు సిద్ధమవుతోంది. రైతుల విషయంలో మాత్రం వ్యతిరేకత రాకుండా ప్రభుత్వం తగు జాగ్రత్తలు తీసుకుంటుంది. దీంతో అనుకున్న సమయానికే రైతుబంధు సాయం అందించాలని ప్రభుత్వం పట్టుదలతో ఉన్నట్లు తెలుస్తోంది.

    మరిన్ని తెలంగాణ రాజకీయ వార్తల కోసం తెలంగాణ పాలిటిక్స్