KCR Delhi Tour: మొన్న సడన్ గా కేసీఆర్ ఢిల్లీ టూర్ అంటూ ప్రచారం జరిగింది. ఏమైందో ఏమో గానీ చివరి నిమిషంలో క్యాన్సల్ అయిపోయింది. కేసీఆర్ ప్రగతి భవన్ లోనే ఉండిపోయారు. అప్పుడు కేసీఆర్ ప్రధాని అపాయింట్మెంట్ కోసమే ప్రయత్నించారని గుసగుసలు వినిపించాయి. కానీ వీలు పడకపోవడంతో ఆయన సైలెంట్ అయిపోయారు. కాగా ఇప్పుడు కేసీఆర్ మరోసారి కుటుంబ సమేతంగా ఢిల్లీ వెళ్లారు.
ఆయన వెంట భార్య శోభ, కూతురు కవిత కూడా ఉన్నారు. అయితే కేసీఆర్ ఈసారి కూడా ప్రధాని అపాయింట్మెంట్ కోసమే వెళ్లినట్లు తెలుస్తోంది. వీలైతే ప్రధానిని కలిసి అనేక విషయాలపై చర్చించే అవకాశం ఉంది. అయితే ఇక్కడ ఒక విషయం ఉంది. ఒకవేళ ప్రధాని అపాయింట్మెంట్ ఇస్తే వడ్ల కొనుగోలు విషయంలో ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.
Also Read: AP New Districts-CM Jagan: కొత్త జిల్లాలను ప్రారంభించిన జగన్.. అభివృద్ధి ఊసే ఎత్తలే..
ప్రధాని అపాయింట్మెంట్ ఇవ్వకపోతే ఇదే విషయాన్ని ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లి తెలంగాణకు అన్యాయం చేస్తున్నారంటూ చెప్పుకోవచ్చు. పైగా 11వ తేదీన ఢిల్లీలోని జంతర్ మంతర్ లో వడ్ల కొనుగోలు విషయంపై నిరసన తెలియజేయాలని టీఆర్ఎస్ ప్లాన్ చేస్తోంది. ఈ ఆందోళన కార్యక్రమానికి జాతీయస్థాయిలో రైతు సంఘాల నేతలు రప్పించాలని కేసీఆర్ భావిస్తున్నారు. అంటే ఒకే సమయంలో రెండు పనులు ముందు పెట్టుకున్నారన్నమాట.
అపాయింట్మెంట్ ఇస్తే ఇలా ఇవ్వకపోతే అలా అని కేసీఆర్ రెండు ప్లాన్ లను సిద్ధం చేసుకుని ఉంచుకున్నారు. అసలే ఒంటికాలిపై లేస్తున్న కేసీఆర్ కు మోడీ అపాయింట్మెంట్ ఇచ్చే అవకాశం ఇప్పట్లో లేదు. ఆ విషయం కేసీఆర్ కు కూడా బాగా తెలుసు. అందుకే తన భార్యకు ఎయిమ్స్ లో చికిత్స అందిస్తున్నట్టు చెబుతున్నారు. అందుకోసమే తాము ఢిల్లీ వెళ్లినట్టు కవర్ చేస్తున్నారు గులాబీ బి సైన్యం. మరి ఏం జరుగుతుందో చూడాలి.
Also Read:New Trend Of Political Parties: రాజకీయ పార్టీల కొత్త పంథా…సోషల్ మీడియా వింగ్ బలోపేతం