Homeఎంటర్టైన్మెంట్Sreesanth: 'సమంత - నయనతార' సినిమాలో ఫేమస్ క్రికెటర్ !

Sreesanth: ‘సమంత – నయనతార’ సినిమాలో ఫేమస్ క్రికెటర్ !

Sreesanth: విజయ్ సేతుపతి హీరో, సమంత నయనతార హీరోయిన్లు.. నిజంగా క్రేజీ కాంబినేషన్ అంటే ఇదే. గతేడాది ఈ ముగ్గురి కలయికలో ఒక సినిమా రాబోతుందని వార్త రాగానే సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీ అంతా ఈ సినిమా గురించి ఆరా తీసింది. విజయ్ సేతుపతి హీరోగా, సమంత, నయనతార హీరోయిన్లుగా దర్శకుడు విగ్నేష్ శివన్ దర్శకత్వంలో ఓ సినిమా వస్తోందని, పైగా నయనతారనే నిర్మాత అని తెలిసి.. ఇక ఈ సినిమా హిట్ గ్యారంటీ అనుకున్నారు అందరూ. ఇప్పుడు ఈ సినిమా నుంచి మరో క్రేజీ అప్ డేట్ వచ్చింది.

Sreesanth
Sreesanth

ఈ సినిమాలో క్రికెటర్ శ్రీశాంత్ కీలక పాత్ర పోషిస్తున్నట్లు చిత్ర బృందం పేర్కొంది. మహ్మద్ మోబీగా అతడిని పరిచయం చేస్తూ ఓ పోస్టర్‌ను రిలీజ్ చేసింది. ప్రస్తుతం ఈ పోస్టర్ వైరల్‌గా మారింది. మొత్తానికి సమంత మూవీలో క్రికెటర్ శ్రీశాంత్ అంటూ ఈ వార్త బాగా వైరల్ అవుతుంది. ఇక అక్కినేని సమంత వరుస సినిమాలు చేస్తోంది, ఎక్కడా గ్యాప్ లేకుండా వరుసగా షూటింగ్ లో పాల్గొంటుంది.

Also Read:  ‘ఆడవాళ్లు మీకు జోహార్లు’.. టీజర్ బాగున్నా రేటు తెగట్లేదు !

పైగా సామ్ చేసే ప్రతి సినిమా పై భారీ అంచనాలు ఉన్నాయి. కారణం.. సెలెక్టివ్ గా సినిమాలను ఎంచుకుంటూ ముందుకు పోతుంది సమంత. అయితే.. అన్నీ సినిమలో కల్లా నయనతార – విజయ్ సేతుపతి – సమంత కలయికలో వస్తున్న సినిమా పైనే భారీ అంచనాలు ఉన్నాయి. నిజానికి ఈ సినిమా ఎప్పుడో రిలీజ్ కావాలి. కానీ, ఈ సినిమా అనౌన్స్ చేసిన తరువాత సడెన్ గా కరోనా రావడం, అంతలో లాక్ డౌన్ ను పెట్టడం దాంతో ఈ సినిమా ఈ ఏడాదికి పోస్ట్ ఫోన్ అవ్వాల్సి వచ్చింది.

Samantha
Samantha

ఇక ఈ జనవరిలో హైదరాబాద్ లో ఈ సినిమా మొదటి షెడ్యూల్ షూటింగ్ కూడా జరిగింది. దాదాపు నెల రోజులు పాటు షూట్ చేశారు. మొత్తానికి సినిమా ఫస్ట్ కాపీ రెడీ అయింది. త్వరలోనే సినిమాను రిలీజ్ కి సిద్ధం చేస్తున్నారు.

Also Read: వైట్ రైస్ తినేవాళ్లకు షాకింగ్ న్యూస్.. ఆ ప్రమాదకరమైన సమస్యలు!

Sekhar
Sekhar
Sekhar is an Manager, He is Working from Past 6 Years in this Organization, He Covers News on Telugu Cinema Updates and Looks after the overall Content Management.
Exit mobile version