టీడీపీ అధినేత చంద్రబాబు అమరావతి రాజధాని ఉచ్చులోకి మెల్లిగా ప్రధాని మోదీని లాగే ప్రయత్నం చేస్తున్నారు. వైసీపీ అధికారంలోకి వచ్చాక టీడీపీ నేతలను టార్గెట్ చేస్తూ ముందుకెళుతోంది. దీనిలో భాగంగా రాజధానుల భూముల వ్యవహరంపై టీడీపీని టార్గెట్ చేస్తోంది. అమరావతిని రాజధానిగా ప్రకటించకముందే టీడీపీ నేతలు అక్కడ భూములు కొనుగోలు అనంతరం అమరావతి ప్రకటించి గోల్ మాల్ చేశారని వైసీపీ మొదటి నుంచి ఆరోపిస్తున్న సంగతి తెల్సిందే. తాజాగా రాజధాని ఉచ్చులోకి బీజేపీని లాగేందుకు బాబు మెల్లిగా ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది.
రఘురామకృష్ణం రాజు ఆటలో అరటిపండు అయ్యాడా?
తాజాగా అమరావతి రాజధాని ఉద్యమం తాజాగా 200రోజులు పూర్తి చేసుకుంది. టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు ఏపీకి అమరావతిని రాజధానిగా ప్రకటించినా ఎలాంటి పనులు చేయలేదని విమర్శలు ఉన్నాయి. ఆ తర్వాత జరిగిన ఎన్నికల్లో వైసీపీ అధికారంలోకి వచ్చింది. ఒకే ప్రాంతంలో అభివృద్ధి కేంద్రీకృతం కాకుండా సీఎం జగన్మోహన్ రెడ్డి అన్ని ప్రాంతాలకు సమన్యాయం చేసేలా మూడురాజధానుల ఫార్మూలాను తెరపైకి తీసుకొచ్చారు. అయితే దీనిని అమరావతి ప్రాంతవాసులు ఈ నిర్ణయాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తూ నిరసన తెలిపారు. అయితే సీఎం జగన్మోహన్ రెడ్డి మూడు రాజధానుల నిర్ణయానికి కట్టుబడి ముందుకెళుతున్నారు.
టీడీపీ మాత్రం అమరావతి ఉద్యమానికి తొలి నుంచి మద్దతు ఇస్తుంది. అయితే వైసీపీ సర్కార్ అమరావతి ఉద్యమాన్ని పెద్దగా పట్టించుకోవడం లేదు. కొంతమంది కావాలని అమరావతి ప్రాంతవాసులు రెచ్చగొట్టి ఉద్యమాన్ని క్యాష్ చేసుకోవాలని చూస్తున్నారని వైసీసీ నేతలు ఆరోపిస్తున్నారు. 200రోజులైనా వైసీపీ ప్రభుత్వం ఈ ఉద్యమాన్ని పట్టించుకోకపోవడంతో టీడీపీ చంద్రబాబు బీజేపీ నేతలను రాజధాని ఉచ్చులోకి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. గతంలో ప్రధాని నరేంద్ర మోదీ అమరావతి రైతులకు సంఘీభావం తెలిపిన మాటలను పదేపదే గుర్తు చేస్తున్నారు. 2014 ఎన్నికల ప్రచారంలో ఢిల్లీ కంటే మెరుగైన రాజధాని నిర్మిస్తామని ఇచ్చిన హామీని చంద్రబాబు ఇప్పుడు ప్రస్తావిస్తున్నారు. అమరావతిని కాపాడాల్సిన బాధ్యత కేంద్రంపైనే ఉందని ఈ వ్యవహారాంలోకి మోదీకి లాగే ప్రయత్నాన్ని బాబు చేస్తున్నారు.
కేటీఆర్ కు ట్రైనింగ్ ఇస్తున్న కేసీఆర్.. ఎందుకంటే?
టీడీపీ కిందటి ఎన్నికల్లో ఓడిపోయాక ప్రధాని మోదీపై చంద్రబాబు నాయుడు ఎక్కడలేని ప్రేమ చూపిస్తున్నారు. బీజేపీ అధిష్టానం జగన్ ప్రభుత్వం పట్ల సానుకూల వైఖరితో వ్యవహరిస్తుండటంతో చంద్రబాబు రూట్ మార్చినట్లు తెలుస్తోంది. దీంతో ప్రధాని మోదీ గతంలో ఇచ్చిన హామీలను జగన్ నెరవేర్చడం లేదని ఆరోపణలు గుప్పిస్తున్నారు. బీజేపీ నేతలను రెచ్చగొట్టి కేంద్రంతో జగన్ కు ఉన్న సఖ్యతను చెడగొట్టాలని ఆలోచిస్తున్నారట. ఇందులో భాగంగానే అమరావతి రాజధాని ఉచ్చులోకి మోదీని లాగుతున్నారు. అయితే చంద్రబాబు ట్రాప్ లో బీజేపీ నేతలు పడుతారా? లేదా అనేది వేచి చూడాల్సిందే..!