https://oktelugu.com/

ఏపీలో పక్కా ప్లానింగ్ తో వెళుతున్న బీజేపీ..!

ఆంధ్రప్రదేశ్ లో బీజేపీ బలపడేందుకు సమయం కలిసి వస్తుందా? అంటే అవుననే వాదనలు విన్పిస్తున్నాయి. కిందటి అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఒక్క సీటు సాధించినప్పటికీ ఏపీ రాజకీయాల్లో చక్రం తిప్పుతోంది. కేంద్రంలో బీజేపీ అధికారంలో ఉండటాన్ని ఏపీ బీజేపీ నేతలు సమర్థవంతంగా ఉపయోగించుకుంటున్నారు. లోటు బడ్జెట్లో ఉన్న ఏపీకి కేంద్రం అవసరం ఉండటాన్ని వినియోగించుకుంటూ ఏపీలో బలపడేందుకు ఆ పార్టీ పావులు కదుపుతోంది. ఏపీకి కేంద్రం నుంచి వచ్చే సాయాన్ని ఆపార్టీ నేతలు తమ క్రెడిట్ గా […]

Written By:
  • Neelambaram
  • , Updated On : July 6, 2020 / 07:36 PM IST
    Follow us on


    ఆంధ్రప్రదేశ్ లో బీజేపీ బలపడేందుకు సమయం కలిసి వస్తుందా? అంటే అవుననే వాదనలు విన్పిస్తున్నాయి. కిందటి అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఒక్క సీటు సాధించినప్పటికీ ఏపీ రాజకీయాల్లో చక్రం తిప్పుతోంది. కేంద్రంలో బీజేపీ అధికారంలో ఉండటాన్ని ఏపీ బీజేపీ నేతలు సమర్థవంతంగా ఉపయోగించుకుంటున్నారు. లోటు బడ్జెట్లో ఉన్న ఏపీకి కేంద్రం అవసరం ఉండటాన్ని వినియోగించుకుంటూ ఏపీలో బలపడేందుకు ఆ పార్టీ పావులు కదుపుతోంది. ఏపీకి కేంద్రం నుంచి వచ్చే సాయాన్ని ఆపార్టీ నేతలు తమ క్రెడిట్ గా నేతలు ప్రచారం చేసుకుంటున్నారు.

    రఘురామకృష్ణం రాజు ఆటలో అరటిపండు అయ్యాడా?

    కిందటి ఎన్నికల్లో వైసీపీ ప్రభంజనం సృష్టించింది. 151 సీట్లు సాధించి వైసీపీ సత్తా చాటింది. ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి పదవీ స్వీకారం తర్వాత టీడీపీని టార్గెట్ చేయడంతో ఆ పార్టీ ఇబ్బందులు ఎదుర్కొంటుంది. టీడీపీకి చెందిన నేతలంతా వైసీపీ, ఇతర పార్టీలోకి చేరుతుండటంతో ఆ పార్టీ బలహీనంగా మారుతోంది. ఈ అవకాశాన్ని బీజేపీ తనకు అనుకూలంగా మరల్చుకునేందుకు పక్కా ప్లానింగ్ తో ముందుకెళుతోంది.

    ఏపీలో కులాల పేరు ప్రస్తావన లేకుండా రాజకీయం జరుగదనేది అందరికీ తెల్సిందే. దీంతో బీజేపీ నేతలు సైతం ఆ మూడు వర్గాలకు చెందిన నేతలను తమ పార్టీలోకి చేర్చుకునేందుకు ప్లాన్ చేస్తున్నారు. ఈమేరకు ఏపీలో బలమైన సామాజిక వర్గాలను టార్గెట్ చేసింది. కమ్మ, కాపు, రాజు కులలాకు చెందిన నేతలను బీజేపీలో చేర్చుకునేందుకు ఇప్పటికే పలువురు నేతలకు టార్గెట్ ఫిక్స్ చేసినట్లు సమాచారం. గుంటూరు నుంచి గోదావరి జిల్లాల వరకు టీడీపీలో పలుకుబడి ఉన్న నేతలను బీజేపీలో చేర్చుకునేందుకు పావులు కదుపుతోంది. ఈమేరకు బీజేపీ నేతలు ఇప్పటికే యాక్షన్లోకి దిగినట్లు తెలుస్తోంది.

    కేటీఆర్ కు ట్రైనింగ్ ఇస్తున్న కేసీఆర్.. ఎందుకంటే?

    ఏపీలో సీఎం జగన్ దూకుడు చూస్తుంటే టీడీపీ వచ్చే ఎన్నికల వరకు కనుమరుగు అవడం ఖాయమని బీజేపీ నేతలు నమ్ముతున్నారు. ఈ పరిస్థితులను తమకు అనుకూలంగా మార్చుకోవాలని చూస్తున్నారు. వచ్చే ఎన్నికల వరకు ఏపీలో బీజేపీ బలపడాలని భావిస్తోంది. బీజేపీతో కలిసివచ్చే శక్తులతో బీజేపీ 2023ఎన్నికల్లో పోటీ చేసేందుకు సన్నహాలు చేస్తోంది. ఇప్పటికే జనసేన అధ్యక్షుడు బీజేపీకి మద్దతు ప్రకటించిన సంగతి తెల్సిందే. పక్కా ప్రణాళికతో ముందుకెళుతున్న బీజేపీ ఆశలు నెరవేరుతాయా? లేదా అనేది వేచిచూడాల్సిందే..!