MLC Kavitha : డాక్టర్ల రాక.? ఎమ్మెల్సీ కవితను అరెస్టు చేస్తారా?

  MLC Kavitha : తెలంగాణ ఎమ్మెల్సీ, సీఎం కేసీఆర్ కూతురు కల్వకుంట్ల కవితను అరెస్టు చేస్తారా? ఒక వేళ చేస్తే అందుకు తగిన ఆధారాలు ఈడీ వద్ద ఉన్నాయా? అనే కోణంలో చర్చలు నడుస్తున్నాయి. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించి లిక్కర్ స్కాంలో ఆసక్తికర విషయాలు వెలుగు చూస్తున్నాయి. ఈ నేపథ్యంలో కేసు ఎంత దూరం వెళ్తుందో తెలియడం లేదు. చట్టం తనపని తాను చేసుకుపోతుందనే నాయకులు ప్రకటనలు ఉంటున్నాయి. బీఆర్ఎస్ నేతలు మాత్రం కవితకు సపోర్టుగా […]

Written By: NARESH, Updated On : March 20, 2023 6:50 pm
Follow us on

 

MLC Kavitha : తెలంగాణ ఎమ్మెల్సీ, సీఎం కేసీఆర్ కూతురు కల్వకుంట్ల కవితను అరెస్టు చేస్తారా? ఒక వేళ చేస్తే అందుకు తగిన ఆధారాలు ఈడీ వద్ద ఉన్నాయా? అనే కోణంలో చర్చలు నడుస్తున్నాయి. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించి లిక్కర్ స్కాంలో ఆసక్తికర విషయాలు వెలుగు చూస్తున్నాయి. ఈ నేపథ్యంలో కేసు ఎంత దూరం వెళ్తుందో తెలియడం లేదు. చట్టం తనపని తాను చేసుకుపోతుందనే నాయకులు ప్రకటనలు ఉంటున్నాయి. బీఆర్ఎస్ నేతలు మాత్రం కవితకు సపోర్టుగా నిలుస్తున్నారు. ఆడబిడ్డను కేసుల్లో ఇరికిస్తున్నారని దుమారం రేపుతున్నారు. కేసులో ఇరుక్కుంటే ఎవరైనా ఒకటే. చట్టానికి ఆడబిడ్డ అనే తారతమ్యాలు ఉండవని బీజేపీ నేతలు చెబుతున్నారు.

ఈడీ ఏం చేస్తుంది?

ఈ కేసులో ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అన్ని ఆధారాలు సేకరిస్తోంది. కేసులో ఇప్పటికే కొందరిని అదుపులోకి తీసుకున్నారు. చివరగా కవితను ప్రశ్నిస్తోంది. ఈ క్రమంలో ఈడీ ఎలా ముందుకు వెళ్తుంది? కవిత ఫోన్ ను లాక్కున్నారని కోర్టులో పిటిషన్ వేసిన కవితకు కోర్టు మద్దతుగా నిలుస్తుందా? ఇప్పటికే సుప్రీంకోర్టులో కవితకు చుక్కెదురు కావడంతో ప్రస్తుతం ఏం జరుగుతుందోననే ఉత్కంఠ అందరిలో నెలకొంది. ఈడీ కేసులో కవిత ఇచ్చే సమాచారం కీలకం కానుందని చెబుతున్నారు. కానీ కవిత మాత్రం నోరు విప్పడం లేదు. దీంతోనే ఎలా ముందుకెళ్లాలని ఈడీ అధికారులు తర్జనభర్జన పడుతున్నారు.

కవితను అరెస్టు చేస్తే..

కవితను అరెస్టు చేస్తే దానికి సంబంధించిన ఆధారాలు కోర్టుకు సమర్పించాల్సి ఉంటుంది. ఫోన్లు ధ్వంసం చేసినందున అందులో కీలక సమాచారం ఉందని భావిస్తున్నారు. అన్ని అంశాలు బేరీజు వేసుకుని చూస్తే కవిత కావాలనే ఇలా ప్రవర్తిస్తోందని అధికారులు గుర్తిస్తున్నారు. ఈడీ అధికారుల నిర్ణయం ఎలా ఉంటుందనే దానిపై స్పష్టమైన సమాచారం మాత్రం లేదు. ఈ నేపథ్యంలో కవిత అరెస్టుపై రకరకాల ఊహాగానాలు బయటకు వస్తున్నాయి. అరెస్టు చేసే అధికారం ఉన్నా సరైన ఆధారాలు లేకపోతే కుదరదని చెబుతున్నారు.

దేశవ్యాప్తంగా..

లిక్కర్ కుంభకోణం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది. ఢిల్లీకి చెందిన వారిని అరెస్టు చేశారు. ఇప్పుడు కవితను కూడా అరెస్టు చేస్తారనే వదంతులు కొనసాగుతున్నాయి. కవితను ఏడున్నర గంటలుగా విచారిస్తున్నారు. తాజాగా కొద్ది సేపటి క్రితమే ఏజీతో పాటు ఇద్దరు డాక్టర్లు ఈడీ కార్యాలయంలోకి వెళ్లారు. దీంతో కవిత అరెస్టు ఖాయమనే వాదనలు వస్తున్నాయి. ఇతరుల వైద్య పరీక్షల కోసం వచ్చినట్లు చెబుతున్నా దానిపై క్లారిటీ లేదు. మొత్తానికి కవిత అరెస్టు పై ఎన్నో అనుమానాలు వస్తున్నాయి. ఏం జరుగుతుందో వేచి చూడాల్సిందే.