Mamatha Benargee: బెంగాల్ సీఎం మమత పోస్టు ఉంటుందా? ఊడుతుందా? ప్రజలేం చేస్తారు?

అతి విశ్వాసం కొంప ముంచుతుంది. దేని మీద అయినా ఎక్కువగా నమ్మకం పెట్టుకోకూడదు. అదే మనల్ని పాతాళానికి తోసేస్తుంది. ఇప్పుడు బెంగాల్ లో జరిగింది అదే. గత శాసనసభ ఎన్నికల్లో ముఖ్యమంత్రి మమతా బెనర్జీ అతి విశ్వాసానికి పోయి భంగపడ్డారు. రెండు నియోజకవర్గాల్లో పోటీ చేసే వీలున్నా ఒక నందిగ్రామ్ నుంచే పోటీ చేసి ఓటమి పాలయ్యారు. ఫలితంగా మళ్లీ పోటీలో నిలవాల్సిన పరిస్థితి తెచ్చుకున్నారు. నందిగ్రామ్ లో బీజేపీ నాయకుడు సువేందు అధికారి సత్తా తెలిసి […]

Written By: Srinivas, Updated On : September 11, 2021 11:03 am
Follow us on

అతి విశ్వాసం కొంప ముంచుతుంది. దేని మీద అయినా ఎక్కువగా నమ్మకం పెట్టుకోకూడదు. అదే మనల్ని పాతాళానికి తోసేస్తుంది. ఇప్పుడు బెంగాల్ లో జరిగింది అదే. గత శాసనసభ ఎన్నికల్లో ముఖ్యమంత్రి మమతా బెనర్జీ అతి విశ్వాసానికి పోయి భంగపడ్డారు. రెండు నియోజకవర్గాల్లో పోటీ చేసే వీలున్నా ఒక నందిగ్రామ్ నుంచే పోటీ చేసి ఓటమి పాలయ్యారు. ఫలితంగా మళ్లీ పోటీలో నిలవాల్సిన పరిస్థితి తెచ్చుకున్నారు. నందిగ్రామ్ లో బీజేపీ నాయకుడు సువేందు అధికారి సత్తా తెలిసి కూడా ఆమె ప్రతిష్టకు పోయి అప్రదిష్ట పాలయ్యారు. ఓటమి భారంతో కుదేలైపోయారు.

ఎక్కడ పోగొట్టుకున్నామో అక్కడే వెతుక్కోవాలి అనే నానుడిని నమ్ముతూ ప్రస్తుతం కళ్లు తెరుచుకున్నాయి. గతంలో దీదీకి కలిసొచ్చే భవానీపూర్ కాకుండా నందిగ్రామ్ నుంచి పోటీ చేసి చేతులు కాల్చుకున్నారు. మళ్లీ అదే తప్పు చేయకూడదని నిర్ణయించుకుని భవానీపూర్ నుంచే రంగంలోకి దిగాలని భావిస్తున్నారు. ఆమె కోసమే అక్కడి ఎమ్మెల్యే శోవన్ దేవ్ చటర్జీ రాజీనామా చేసినట్లు తెలుస్తోంది. దీంతో దీదీ విజయం కోసం అన్ని దారులు వెతుకుతున్నారు. విజయం దక్కకపోతే సీఎం పదవికే మోసం వస్తుందని తెలుసుకుని అన్ని మార్గాలను సుగమం చేసుకుంటున్నట్లు సమాచారం.

గత ఎన్నికల్లో తృణమూల్ కాంగ్రెస్ బ్రహ్మాండమైన మెజార్టీ సాధించింది. 294 నియోజకవర్గాలకు గాను 213 చోట్ల విజయం దక్కించుకుని తిరుగులేని పార్టీగా అవతరించింది. కానీ మమత బెనర్జీ మాత్రం అపజయం సాధించడం అందరిని కలచివేసింది. దీంతో ఆమె సీఎం పీఠం అధిరోహించినా ఎమ్మెల్యే పదవి మాత్రం అందకుండా పోయింది. ఈ నేపథ్యంలో ఈ ఉప ఎన్నికలో ఎలాగైనా విజయం సాధించి పరువు నిలబెట్టుకోవాలని పాకులాడుతున్నారు.

ఈనెల 30న పశ్చిమ బెంగాల్ లో మూడు స్థానాలకు ఉప ఎన్నికలు జరగనున్నాయి. ఈ మేరకు ఎన్నికల కమిషన్ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నేపథ్యంలో భవానీపూర్ నుంచి మమతా బెనర్జీ తన అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. ఇప్పటికే భవానీపూర్ నుంచే బరిలో నిలుస్తానని ప్రకటించిన సందర్భంలో ఆమె గెలుపు కోసం పార్టీ కార్యకర్తలు విస్తృతంగా ప్రచారం చేసేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. ఏదిఏమైనా మమతా బెనర్జీకి ఈ ఎన్నిక చావో రేవో అన్న చందంగా మారింది.