TISS Recruitment 2021: టాటా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సోషల్ సైన్సెస్ నిరుద్యోగులకు తీపికబురు అందించింది. 26 ఉద్యోగ ఖాళీల భర్తీ కోసం జాబ్ నోటిఫికేషన్ ను విడుదల చేసింది. భారత ప్రభుత్వ విద్యామంత్రిత్వ శాఖకు సంబంధించిన ఈ సంస్థ నన్ టీచింగ్ ఉద్యోగ ఖాళీలను భర్తీ చేయనుందని తెలుస్తోంది. దేశంలోని వేర్వేరు క్యాంపస్ లలో ఈ ఉద్యోగ ఖాళీల భర్తీ జరగనుండగా మొత్తం 26 ఉద్యోగ ఖాళీలను ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయనున్నారు.
ఈ క్యాంపస్ లలో హైదరాబాద్ క్యాంపస్ కూడా ఉంది. ముంబయి, తుల్జాపుర్, హైదరాబాద్, గువహటి క్యాంపస్‌లలో ఈ నోటిఫికేషన్ ద్వారా ఉద్యోగ ఖాళీల భర్తీ జరగనుంది. అసిస్టెంట్ మేనేజర్, హెల్త్ ఆఫీసర్, అసిస్టెంట్ ఇంజనీర్, సెక్షన్ ఆఫీసర్, డిప్యూటీ రిజిష్ట్రార్ ఉద్యోగ ఖాళీలను ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయనున్నారు. సంబంధిత సబ్జెక్టులో బ్యాచిలర్స్, డిగ్రీ, బీఈ/బీటెక్, ఎంఈ/ఎంటెక్, మాస్టర్స్ డిగ్రీ, ఎంబీబీఎస్ పాసైన వాళ్లు ఈ ఉద్యోగ ఖాళీల కోసం దరఖాస్తు చేసుకోవచ్చు.
అనుభవం ఉన్నవాళ్లు మాత్రమే ఈ ఉద్యోగ ఖాళీలకు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. 30 నుంచి 50 సంవత్సరాల మధ్య వయస్సు ఉన్నవాళ్లు ఈ ఉద్యోగ ఖాళీలకు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఆన్ లైన్ విధానంలో అర్హత, ఆసక్తి ఉన్న అభ్యర్థులు ఈ ఉద్యోగ ఖాళీల కోసం దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. రిక్రూట్‌మెంట్ టెస్ట్, ఇంటర్వ్యూ ద్వారా ఈ ఉద్యోగ ఖాళీలకు దరఖాస్తు చేసుకోవచ్చు.
2021 సంవత్సరం అక్టోబర్ 3 ఈ ఉద్యోగ ఖాళీలకు దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీగా ఉంది. https://tiss.edu/ వెబ్ సైట్ ద్వారా ఈ ఉద్యోగ ఖాళీలకు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.