America 9/11 Attacks: అమెరికా మర్చిపోలేని రోజు.. ‘2001 సెప్టెంబర్ 11’

America 9/11 Attacks: అమెరికా చరిత్రలోనే అతిపెద్ద నెత్తుటి గాయం అది. ప్రపంచంలోనే అగ్రరాజ్యంగా.. అతి శక్తివంతమైన దేశంగా కీర్తినందుకుంటున్న అమెరికాను చావుదెబ్బ తీసిన రోజు అది. అగ్రరాజ్యాన్నే సవాల్ చేసిన ఉగ్రమూకల ఆకృత్యానికి నిదర్శనం ఆరోజు. అమెరికాలో అమెరికా విమానాలతో దాడి చేసి వేల మందిని చంపిన ‘ఆల్ ఖైదా’ ఉగ్రసంస్థ దుశ్చర్యను మరిచిపోని రోజు ఇదీ.. 9/11 అమెరికాపై అల్ ఖైదా దాడి జరిగి ఇప్పటికి 20 ఏళ్లు అవుతోంది. ఆ విషాద జ్ఞాపకాలు […]

Written By: NARESH, Updated On : September 11, 2021 11:35 am
Follow us on

America 9/11 Attacks: అమెరికా చరిత్రలోనే అతిపెద్ద నెత్తుటి గాయం అది. ప్రపంచంలోనే అగ్రరాజ్యంగా.. అతి శక్తివంతమైన దేశంగా కీర్తినందుకుంటున్న అమెరికాను చావుదెబ్బ తీసిన రోజు అది. అగ్రరాజ్యాన్నే సవాల్ చేసిన ఉగ్రమూకల ఆకృత్యానికి నిదర్శనం ఆరోజు. అమెరికాలో అమెరికా విమానాలతో దాడి చేసి వేల మందిని చంపిన ‘ఆల్ ఖైదా’ ఉగ్రసంస్థ దుశ్చర్యను మరిచిపోని రోజు ఇదీ.. 9/11 అమెరికాపై అల్ ఖైదా దాడి జరిగి ఇప్పటికి 20 ఏళ్లు అవుతోంది. ఆ విషాద జ్ఞాపకాలు ఇంకా అమెరికాను వెంటాడుతూనే ఉన్నాయి. దీనిపై స్పెషల్ ఫోకస్..

2001 సెప్టెంబర్ 11.. ఈ తేదీ గురించి వినగానే అప్పటి నుంచి ఇప్పటి వరకు ఉన్న ప్రతీ అమెరికన్ గుండెలో దడ పుడుతుంది. ప్రపంచవ్యాప్తంగా ఈ తేదీ గురించి ఇప్పటికీ చర్చ సాగుతోంది. ప్రపంచంలోని అత్యంత శక్తివంతమైన అమెరికాని ఆ దేశ నడిబొడ్డున ప్రధాన టవర్లను ఉగ్రవాదులు కూల్చేశారు. రక్షణ విషయంలో ఎంతో పకడ్బందీగా ఉండే అమెరికాలోనే ఇంతటి ఘోరం జరగడం ఒక్కసారిగా ప్రపంచాన్ని కుదిపేసింది. జార్జ్ బుష్ అమెరికా అధ్యక్షుడిగా ఉన్నఆ సమయంలో జరిగిన ఈ దాడుల తరువాత అగ్రరాజ్యం అప్రమత్తమైంది. ఉగ్రవాద పోరుకు నడుం బిగించింది. ఇటీవల అప్ఘాన్ల విషయంలో అమెరికా తీరు చూశాక ఈ తేదీపై మరోసారి చర్చకు వచ్చింది. ఇంతకీ ఆరోజు ఏం జరిగింది..? ఉగ్రవాదులు ఎలా దాడి చేశారు..?

అమెరికా ఆర్థిక, రాజకీయ, సైనిక శక్తికి చిహ్నాలైన రెండు భారీ భవనాలపైకి నాలుగు విమానాలు చొచ్చుకుపోయాయి. ఈ దాడుల్లో 29,996 మంది మరణించారు. అమెరికా చరిత్రలోని ఇది అతిపెద్ద దాడిగా పేర్కొంటారు. ఆ విషయం గురించి ఇప్పటికీ గుర్తు చేసుకొని భయపడుతూనే ఉంటారు.

-మొదటి విమానం (11 (ఏఏ11):
2001 సెప్టెంబర్ 11న ఉదయం 7 గంటల 59 నిమిషాలకు లాస్ ఏంజిల్స్ వెళ్లాల్సిన విమానం ఎయిర్ లైన్స్ ఫ్లైట్ 11 (ఏఏ11) విమానం బోస్టన్ లోని లోగాస్ ఇంటర్నేషనల్ నుంచి బయలుదేరింది. 11 మంది విమాన సిబ్బంది, 81 ప్రయాణికులు ఉన్నారు. ఇందులో ఐదుగురు హైజాకర్లు ఉన్నారు.

-రెండో విమానం(యూఏ 175 ):
బోస్టన్ ఎయిర్ పోర్టులోనే మరో టెర్మినల్ నుంచి యునైటెడ్ ఎయిర్ లైన్స్ కు చెందిన యూఏ 175 విమానం కూడా లాస్ ఏంజిల్స్ బయలు దేరింది. ఇందులో 9 మంది విమాన సిబ్బంది, 56 మంది ప్రయాణికులు, ఐదుగురు హైజాకర్లు ఉన్నారు.

– మూడో విమానం (ఏఏ77):
ఇందులో ఆరుగురు సిబ్బంది, 58 మంది ప్రయాణికులు, ఐదుగురు హైజాకర్లు ఉన్నారు. ఇది కూడా లాస్ ఏంజిల్స్ కు వెళ్లాల్సిన విమానమే.

– నాలుగో విమానం (యూఏ93):
ఇందులో ఏడుగురు సిబ్బంది, 37 మంది ప్రయాణికులు ఉన్నారు. నలుగురు హైజాకర్లు ఉన్నారు.

మొదటి విమానం (11 (ఏఏ11)బయలుదేరిన కొంత సమయానికి హైజార్లు కాక్ పిట్లో ప్రవేశించి విమానాన్ని తమ ఆధీనంలోకి తీసుకున్నారు. అప్పటికే ఇద్దరు విమాన సిబ్బందిని చంపేశారు. వీరి బృందానికి అట్టా నేతృత్వం వహించాడు. మొహమ్మద్ అట్లా ప్రయాణికులనుద్దేశించి విమానం హైజాక్ చేశామని చెప్పాలనుకున్నాడు. అయితే తాను ఓ బటన్ నొక్కడంతో ఆ సందేశం బోస్టన్ ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ కు వెళ్లింది. అయితే మొదట కంట్రోల్ సిబ్బంది గందరగోళానికి గురైనప్పటికీ ఈ విమానం హైజాక్ అయినట్లు గుర్తించారు. ఈ సమయంలో హైజాకర్లు విమానంలోని ట్రాన్స్పాండర్లను ఆపేశారు. దీంతో ఎయిర్ కంట్రోల్ కు ఇన్ఫర్మేషన్ లేకుండా పోయింది.

ఇక ఏఏ 11 విమానం 8 గంటల 46 నిమిషాలకు న్యూయార్క్ లోని ఒక టవర్ లోకి నేరుగా దూసుకెళ్లింది. నార్త్ టవర్ 93వ అంతస్థు నుంచి 99 వ అంతస్థు మధ్యలోకి దూసుకెళ్లడంతో వందలాది మంది అక్కడే చనిపోయారు. ఇక విమానంలోని ఇంధనం అగ్నిగోళంలో మండడంలో లిప్టులు ధ్వంసమయ్యాయి.

యూఏ 175 విమానం వరల్డ్ ట్రేడ్ సెంటర్ సౌత్ టవర్లోని 77, 85వ అంతస్తుల మధ్య ప్రాంతంలోకి దూసుకెళ్లింది. నార్త్ టవర్లో జరిగిన దాడి తరువాత 17 నిమిషాల్లోనే ఇది జరిగింది. ట్విన్ టవర్స్ పై రెండో దాడి జరిగిన తరువాత ఏ విమానాన్ని కూడా అనుమతించకూడదని అమెరికన్ ఎయిర్ లైన్స్, యునైటెడ్ ఎయిర్ లైన్స్ నిర్ణయం తీసుకుంది.

కానీ యూఏ 93 విమానం అప్పటికే హైజాకర్లు తమ ఆధీనంలోకి తీసుకున్నారు. లెబనాన్ కు చెందిన జియాద్ జర్రా నాయకత్వంలో హైజాకర్లు ఈ విమానాన్ని హైజాక్ చేశారు. అయితే ఇందులో ఉన్న ప్రయాణికులు హైజాకర్లతో కాసేపు పోరాడారు. కానీ ఫలిత లేకుండా పోయింది. 930 కిలోమీటర్ల కంటే ఎక్కువ వేగంతో పై నుంచి పెన్సెల్వేనియాలోని షాంక్స్ విల్లేలోని ఓ బహిరంగ ప్రదేశంలో కుప్ప కూలింది. ఇందులో ఉన్నవారంతా చనిపోయారు. మరో విమానం ఏఏ 77 పెంటగాన్ పశ్చిమ గోడను ఢీకొట్టింది. దీంతో పైకప్పుపై 60 మీటర్ల ఎత్తు వరకు మంటలు లేచాయి. విమానంలో ఉన్న 64 మందితో పాటు 125 మంది మృతి చెందారు.

ఆ విషాద ఘటన జరిగి నేటి 20 ఏళ్లు పూర్తయ్యాయి. ఈ సందర్భంగా అమెరికాలో మరణించిన వారికి నివాళులర్పిస్తున్నారు. నాటి నెత్తుటి మరకలు ఇప్పటికీ పోలేదు. వారి బాధితులు తమ వారిని గుర్తు చేసుకొని కన్నీటి పర్యంతం అవుతున్నారు. అమెరికా అల్ ఖైదాపై ఆ తర్వాత దాడి చేసి అప్ఘనిస్తాన్ ను ఆక్రమించినా మళ్లీ అక్కడ తాలిబన్లు అధికారం చేజిక్కించుకోవడంతో పరిస్థితి మొదటికొచ్చింది. తాలిబాన్ చాటున అల్ ఖైతా పడగనీడ అలానే ఉంది. 20 ఏళ్ల యుద్ధం అప్ఘనిస్తాన్ లో ప్రజాస్వామ్యాన్ని కొనసాగించలేకపోయింది. వెరిసి అమెరికా విజయం సాధించిందా? అంటే లేదనే జవాబు వినిపిస్తోంది.