జగన్ బెయిల్ రద్దు అవుతుందా?

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ బెయిల్ రద్దు అవుతుందని పుకార్లు వ్యాపిస్తున్నాయి. వైసీపీ వ్యతిరేక మీడియాలో కథనాలు వస్తున్నాయి. ఈనెల 26న జగన్ బెయిల్ రద్దు పిటిషన్ పై సీబీఐ విచారణ చేపట్టనుంది. ఆ రోజే తీర్పు వెలువడే అవకాశముందని తెలుస్తోంది. ఈ నేపథ్యంలో జగన్ బెయిల్ రద్దుపై ఇటు వైసీపీ, అటు టీడీపీ లో ఉత్కంఠ నెలకొంది. పలు రకాల పుకార్లు ప్రచారం అవుతున్నాయి. జగన్ బెయిల్ రద్దు అవుతుందని కొందరు లేదు వాయిదా పడుతుందని మరికొందరు […]

Written By: Srinivas, Updated On : July 21, 2021 9:41 am
Follow us on

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ బెయిల్ రద్దు అవుతుందని పుకార్లు వ్యాపిస్తున్నాయి. వైసీపీ వ్యతిరేక మీడియాలో కథనాలు వస్తున్నాయి. ఈనెల 26న జగన్ బెయిల్ రద్దు పిటిషన్ పై సీబీఐ విచారణ చేపట్టనుంది. ఆ రోజే తీర్పు వెలువడే అవకాశముందని తెలుస్తోంది. ఈ నేపథ్యంలో జగన్ బెయిల్ రద్దుపై ఇటు వైసీపీ, అటు టీడీపీ లో ఉత్కంఠ నెలకొంది. పలు రకాల పుకార్లు ప్రచారం అవుతున్నాయి. జగన్ బెయిల్ రద్దు అవుతుందని కొందరు లేదు వాయిదా పడుతుందని మరికొందరు చెబుతున్నారు. మొత్తానికి ఏం జరుగుతుందోననే ఉత్కంఠ కలుగుతోంది.

సీఎం జగన్ బెయిల్ రద్దు చేయాలని వైసీపీ రెబల్ఎంపీ రఘురామ కృష్ణంరాజు సీబీఐ కోర్టులో పిటిషన్ వేసిన సంగతి తెలిసిందే. బెయిల్ షరతులను జగన్ ఉల్లంఘిస్తున్నారనే రాజు తరఫున న్యాయవాదాలు వాదించారు. తాను ఈ పిటిషన్ వేసినందుకే తనప దేశద్రోహం కేసు పెట్టారంటూ ఆయన తరఫు న్యాయవాదులు సీబీఐ కోర్టుకు విన్నవించారు. దీనిపై జగన్ తరఫఉ న్యాయవాదులు తమ వాదనను లిఖితపూర్వకంగా అందజేశారు.

సీబీఐ తరఫున వాదనలను మాత్రం ఇంకా న్యాయస్థానానికి చేరలేదు. ఈనెల 26న లిఖితపూర్వకంగా వాదనలను తెలియజేయాలని సీబీఐ న్యాయస్థానం ఆదేశించింది. రఘురామ చెబుతున్న దాని ప్రకారం 26న కేసు ఓ కొలిక్కి వస్తుందని అంటున్నారు. మరో వైపు కేంద్ర ప్రభుత్వంతో జగన్ కయ్యానికి కాలు దువ్వుతున్న క్రమంలో బెయిల్ రద్దుపై భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.

బెయిల్ రద్దు అంశం సమీపిస్తున్న తరుణంలోజగన్ దూకుడు పెంచి కట్టడి చేసేందుకుప్రయత్నాలు చేస్తున్నట్లు సమాచారం. వైసీపీ అవసరం రాజ్యసభలో బీజేపీకి ఏర్పడిన కరమంలో గట్టిగా నొక్కితే తప్ప తమ దారికి రాకపోవచ్చనే జగన్ భావిస్తున్నట్లు చెబుతున్నారు. జగన్ బెయిల్ రద్దవుతుదని ప్రచారం జరుగుతున్న క్రమంలో ఢిల్లీలో జరుగుతున్న పరిణామాలు ఎటు వైపు దారి తీస్తాయో అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.