జగన్ సర్కార్ రివర్స్ టెండరింగ్ క్వాలిటీపై ఎఫెక్ట్ చూపిస్తుందా…?

సీఎం జగన్ అధికారంలోకి వచ్చిన కొత్తలో బాగా పాపులర్ అయిన పదం రివర్స్ టెండరింగ్. రివర్స్ టెండరింగ్ అనగా అప్పటికే ఇచ్చిన కాంట్రాక్టుని నిర్వహించడానికి తక్కువ ధరకే టెండర్లు పిలవడం. దేశంలోని ఏ రాష్ట్రంలో రివర్స్ టెండరింగ్ అమలులో లేదు. కానీ ఏపీ మాత్రం రివర్స్ టెండరింగ్ ను అమలు చేస్తోంది. రివర్స్ టెండరింగ్ ద్వారా ఖర్చులను తగ్గించి ఆదాయాన్ని పెంచాలని ప్రభుత్వం భావిస్తోంది. Also Read : అచ్చెన్నాయుడికి జ్ఞానోదయం కలిగిందా..? అయితే వాస్తవం మాత్రం […]

Written By: Navya, Updated On : September 22, 2020 2:21 pm
Follow us on

సీఎం జగన్ అధికారంలోకి వచ్చిన కొత్తలో బాగా పాపులర్ అయిన పదం రివర్స్ టెండరింగ్. రివర్స్ టెండరింగ్ అనగా అప్పటికే ఇచ్చిన కాంట్రాక్టుని నిర్వహించడానికి తక్కువ ధరకే టెండర్లు పిలవడం. దేశంలోని ఏ రాష్ట్రంలో రివర్స్ టెండరింగ్ అమలులో లేదు. కానీ ఏపీ మాత్రం రివర్స్ టెండరింగ్ ను అమలు చేస్తోంది. రివర్స్ టెండరింగ్ ద్వారా ఖర్చులను తగ్గించి ఆదాయాన్ని పెంచాలని ప్రభుత్వం భావిస్తోంది.

Also Read : అచ్చెన్నాయుడికి జ్ఞానోదయం కలిగిందా..?

అయితే వాస్తవం మాత్రం మరో విధంగా ఉంది. పోలవరం టెండర్ల ప్రక్రియలో జగన్ రివర్స్ టెండరింగ్ కు వెళ్లారు. గ్రామ, వార్డ్ సచివాలయ అభ్యర్థుల కోసం కొనుగోలు చేసే ఫోన్ల విషయంలో రివర్స్ టెండరింగ్ కు వెళ్లారు. దాదాపు కొన్ని వందల కోట్ల రూపాయలు ప్రభుత్వానికి ఆదాయం మిగిలింది. కోటి రూపాయలు దాటిన వస్తు, సేవల కొనుగోళ్లకు ఏపీ ప్రభుత్వం రివర్స్ టెండరింగ్ చేపట్టనుందని.. కొనుగోళ్లలో పారదర్శకత కోసం ఈ విధానాన్ని అమలులోకి తెచ్చామని జగన్ సర్కార్ ప్రకటించింది.

గతేడాది డిసెంబర్ నాటికి జగన్ సర్కార్ రివర్స్ టెండరింగ్ వల్ల జగన్ సర్కార్ 1582 కోట్ల రూపాయలు ఆదా అయినట్టు ప్రకటించింది. అయితే విశ్లేషకులు, వివిధ రంగాల నిపుణులు మాత్రం జగన్ సర్కార్ తీసుకున్న రివర్స్ టెండరింగ్ నిర్ణయం క్వాలిటీపై ప్రభావం చూపిస్తుందని చెబుతున్నారు. అలా జరగడం వల్ల తాత్కాలికంగా ప్రభుత్వానికి ఖర్చు తగ్గినా భవిష్యత్తులో ఆ ప్రభావం కనిపిస్తుందని తెలుపుతున్నారు.

రివర్స్ టెండరింగ్ విషయంలో ఆచితూచి వ్యవహరించాలని లేదంటే ప్రభుత్వానికి వచ్చే ఆదాయం కంటే కలిగే నష్టమే ఎక్కువగా ఉంటుందని తెలుపుతున్నారు. అయితే జగన్ సర్కార్ మాత్రం మొండిగా ముందుకెళ్లడానికే సిద్ధమవుతోంది. కరోనా, లాక్ డౌన్ సమయంలో కూడా జగన్ సర్కార్ రివర్స్ టెండరింగ్ పైనే దృష్టి పెడుతోంది. మరి రివర్స్ టెండరింగ్ ఎలాంటి ఫలితాలు ఇస్తుందో తెలియాలంటే మరికొన్ని నెలలు ఆగాల్సిందే.

Also Read : తొలి టీకాకు బ్రాండ్ అంబాసిడర్ భారతీయ మహారాణులే..!